India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్- రాహుల్ ట్యాక్స్ వసూలవుతోందని, ఢిల్లీకి డబ్బుల సంచులు వెళ్తున్నాయని ఆరోపించారు. 100 శాతం రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.40వేల కోట్లు అప్పు చేస్తే, రేవంత్ ఒక్క ఏడాదిలోనే రూ.1.60లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు.

TG: కాంగ్రెస్ హయాంలో ఆరోపణలు తప్ప ఆధారాలున్నాయా? అని KTR ప్రశ్నించారు. ‘17నెలల్లో కొత్తగా ఒక్క ప్రాజెక్టైనా కట్టారా? హామీలు అమలు చేయకుండా మాపై విమర్శలా? TGకు విఘాతం కల్గితే స్పందించే వ్యక్తి KCR. అవసరమైతే రాష్ట్రం కోసం ఆయన గర్జించేవారు. కేంద్రం పంపిన ఒక దూత <<16212293>>NDSA<<>>. NDSA నిపుణులు ఇప్పటి వరకూ ప్రాజెక్టును చూడలేదు. బిహార్‌లో బ్రిడ్జిలు కూలుతుంటే NDSA ఏమైంది’ అని KTR ప్రశ్నించారు.

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించనున్నారని, విలన్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అలాగే అతిథి పాత్రలో దగ్గుబాటి వెంకటేశ్ కూడా మెరుస్తారని టాక్. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

సింధు నదీజలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్థాన్‌కు పోనివ్వమని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటిల్ స్పష్టం చేశారు. అమిత్‌షాతో జరిగిన భేటీలో రోడ్ మ్యాప్ తయారు చేసినట్లు తెలిపారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సింధు జలాలను మళ్లించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే సింధు, దాని ఉపనదులపై ఉన్న డ్యాం గేట్లను మూసివేశారు.

AP: ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. అలాగే రాష్ట్రంలో 169 ప్రాంతాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా గాజులపల్లె, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేపు రాష్ట్రంలోని 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది.

పహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఖండించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రధాని మోదీ, భారతీయులకు అమెరికా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 26 మంది హిందువులను చంపిన టెర్రరిస్టులను వేటాడేందుకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని వెల్లడించారు.

AP: PM మోదీతో ఢిల్లీలో గంటన్నర పాటు భేటీ అయిన CM చంద్రబాబు ప్రత్యేకంగా రాయలసీమ అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తోంది. సీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరినట్లు సమాచారం. అలాగే, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడర్ల ఏర్పాటుకూ సహకారం కోరినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇదే సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలనూ ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ నర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య రెచ్చగొట్టే నినాదాలతో ఓ ఇమేజ్ పోస్ట్ చేశారు. హ్యాకర్ల బృందం తమను ‘టీమ్ ఇన్‌సేన్ పీకే’ అంటూ రాసుకుంది. దీనిని పరిష్కరించేందుకు భారత సైన్యం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను సంప్రదించింది.

ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో SRHతో CSK తలపడనుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ధోనీ సారథ్యంలో ఏప్రిల్ 25న జరిగిన మ్యాచుల్లో సీఎస్కే ఓటమే ఎరుగలేదు. ఇదే తేదీల్లో ఆ జట్టు 7 మ్యాచులాడి అన్నింట్లోనూ గెలిచింది. 2010-MI, 2011-PWI, 2013-SRH, 2014-MI, 2015-PBKS, 2018-RCB, 2021లో RCBపై గెలుపొందింది. ఇందులో ఓ ఫైనల్ మ్యాచ్ కూడా ఉండటం విశేషం. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజీగా తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం ప్రవేశపెడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. 10 సంస్కృత లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం వివరాలు తెలుసుకునేందుకే అంతర్గత మెమో జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తెలుగు పట్ల ఇంటర్మీడియట్ విద్యా శాఖకు గౌరవం, అభిమానం ఉన్నాయని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.