news

News April 24, 2025

ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు.. 28 నుంచి దరఖాస్తులు

image

AP: అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 2025-26 విద్యాసంవత్సరంలో 25% ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఫస్ట్ క్లాస్‌లో సీట్ల కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా ధ్రువీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు అవసరం. విద్యార్థుల వయసు 01.06.2025 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/

News April 24, 2025

సర్జికల్ స్ట్రైక్స్ వార్తలు.. పాక్ సరిహద్దు గ్రామాలు ఖాళీ?

image

J&K పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్‌లో గుబులు మొదలైంది. ISI హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా సరిహద్దు గ్రామాలను ఆర్మీ ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌ఫోర్స్ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఉరి దాడికి కౌంటర్‌గా 2016లో POK, పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే.

News April 24, 2025

సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

image

TG: తీవ్ర కాలేయ వ్యాధి(లివర్ సిరోసిస్) బారిన పడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 50 శాతం వేతనంతో కూడి ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వారు కోలుకునే వరకు ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు గుండె జబ్బు, టీబీ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, ఎయిడ్స్, మూత్రకోశ, మెదడు వ్యాధులకు ఇలాంటి సదుపాయం ఉండగా కాలేయ వ్యాధులకూ విస్తరించారు.

News April 24, 2025

నేటి నుంచి అప్పన్న నిజరూప దర్శన టికెట్లు

image

సింహాచలంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు టికెట్ల(రూ.300, రూ.1,000) విక్రయాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో సింహాచలం పాత పీఆర్వో ఆఫీస్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉంటాయి.

News April 24, 2025

దేశీయ HPV కిట్లు త్వరలో విడుదల: జితేంద్ర

image

సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన <<15380344>>HPV<<>> కిట్లను త్వరలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అందుబాటు ధరలో టీకాలు, టెస్టులు, ట్రీట్‌మెంట్ చేయడమనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘సర్వైకల్’ మృతుల్లో 25% INDలోనే నమోదవుతున్నాయని చెప్పారు. చికిత్స ఆలస్యమవడం వల్లే ఇలా జరుగుతోందని, వైద్య సేవల అందించడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు.

News April 24, 2025

వెంకటేశ్‌తో కలిసి సినిమా.. నాని ఏమన్నారంటే?

image

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ మే 2న ప్రారంభమవుతుందని హీరో నాని తెలిపారు. ఆ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత సుజీత్‌తో చిత్రం ఉంటుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వెంకటేశ్, నేను హీరోలుగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలనుకున్నారు. అలాగే శేఖర్ కమ్ములతోనూ చర్చలు జరిగాయి. అయితే ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు’ అని పేర్కొన్నారు.

News April 24, 2025

ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు

image

✒ 1929: ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ జననం
✒ 1934: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జననం
✒ 1969: జ్యోతిష పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం
✒ 1973: మాజీ క్రికెటర్ సచిన్ జననం
✒ 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది
✒ 2011: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా మరణం

News April 24, 2025

పాక్‌పై సానుభూతి చూపేదిలేదు: కిషన్‌రెడ్డి

image

దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రదాడి వెనకున్న పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మంచి పరిణామమన్నారు. ఆ దేశంపై సానుభూతి చూపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు దౌత్యపరమైన సమాధానమే ఇచ్చామని, త్వరలో మిలటరీ పరంగానూ ఆన్సర్ ఉంటుందని తెలిపారు. ఉగ్రదాడిలో పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తప్పదనే సంకేతాలు కేంద్రం ఇచ్చిందన్నారు.

News April 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 24, 2025

గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి

image

పుణె వేదికగా జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచారు. ఫైనల్ రౌండులో బల్గేరియాకు చెందిన నుర్గుయిల్‌పై 1-0 తేడాతో విజయం సాధించారు. తుదిపోరు ముగిసే సమయానికి జు జినర్(చైనా)తో కలిసి ఆమె టాప్‌లో ఉన్నారు. అయితే టై బ్రేక్ ఆధారంగా హంపిని విజేతగా నిర్ధారించారు. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక తన గేమ్‌ను డ్రాగా ముగించారు.