news

News February 5, 2026

దేశంలో ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

image

దేశంలో డిజిటల్ సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందరికీ ఆ ప్రయోజనాలు చేరడం లేదు. దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇప్పటికీ ఇంటర్నెట్‌కు దూరంగా ఉంది. సుమారు 13.7% కుటుంబాలకు ఆన్‌లైన్ సదుపాయం లేదు. అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్‌ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఈ గ్యాప్ ఆందోళన కలిగిస్తోంది.

News February 5, 2026

T20WC: శాంసన్ కథ ముగిసినట్లేనా?

image

టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వార్మప్ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్‌కు రాకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో సంజూ టీమ్ మేనేజ్‌మెంట్‌నే కాదు.. అభిమానులను కూడా ఎంతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను T20WCలో అవకాశం కోల్పోనున్నారని, అందుకే వార్మప్ మ్యాచ్‌లోనూ కనిపించలేదని చెబుతున్నారు.

News February 4, 2026

‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్‌ అప్‌డేట్

image

వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో ‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని డైరెక్టర్ సందీప్ వంగా వెల్లడించారు. ఒకే విధంగా కనిపించే ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగే వార్‌ను ఇందులో చూపెట్టబోతున్నట్లు చెప్పారు. రన్ విజయ్, అజీజ్ పాత్రల మధ్య జరిగే ఘర్షణే ఈ సినిమా అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సందీప్ ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. అటు రణ్‌బీర్ ‘రామాయణ’, ‘లవ్&వార్’ సినిమాలు చేస్తున్నారు.

News February 4, 2026

మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ: మంత్రి

image

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టులను మార్చిలోపు భర్తీ చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు జిల్లాకో అధికారిని నియమించాలని సూచించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెలగపూడి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

News February 4, 2026

చిక్కుల్లో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం

image

ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ పబ్లిష్ కాని ఈ బుక్‌ కాపీ రాహుల్ గాంధీ చేతిలో కనిపించడంతో వివాదం మరింత ముదిరింది. చైనాతో ఉద్రిక్తతలపై ఇందులో రాశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రచురించని పుస్తకంలో ఉన్న వాటిని లేవనెత్తడం దేశ భద్రతకు ముప్పని కేంద్రం అంటోంది. రక్షణ శాఖ అనుమతులు రాకపోవడంతో 2023 నుంచి ఇది ప్రచురణ కాలేదు.

News February 4, 2026

U19 WC: భారత్ రికార్డు

image

అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. టీమ్ ఇండియా ఫైనల్ చేరడం U19 WC చరిత్రలో ఇది పదో సారి. దీంతో మొత్తం 16 ఎడిషన్లలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇవాళ SF-2లో AFGపై 311 పరుగులు ఛేదించగా, U19 WC హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్. మరోవైపు వరుసగా 6 ఎడిషన్లలో (2016, 18, 20, 22, 24, 26) భారత్ ఫైనల్ చేరడం విశేషం.

News February 4, 2026

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

image

AP: ‘మనమిత్ర’ పేరుతో ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. 50 లక్షల మంది దీని ద్వారా సేవలందుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 900 సేవలందిస్తుండగా త్వరలోనే 1000కి పెంచనున్నారు. పాస్ పుస్తకాలు, ఆలయ సేవలు, బస్ టికెట్ల బుకింగ్, పన్నులు, బిల్లుల చెల్లింపులను ఈ యాప్‌తో చేసేయొచ్చు. 9552300009 నంబర్‌తోని ఈ యాప్ ప్ర‌తి ఇంటి చిరునామాగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.

News February 4, 2026

చెత్త ఏరుకునే వారిలో SCలే అధికం: కేంద్రం

image

సామాజికంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులపై కేంద్రం చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో 1.52 లక్షల మంది చెత్త ఏరుకునేవారు ఉన్నారని, వీరిలో దాదాపు 84.5% మంది SC, ST, OBC సామాజిక వర్గాలకు చెందినవారేనని తేలింది. వీరిలో SCలు 60.3%, OBCలు 13.7%, OCలు 10.7%, STలు 10.5% ఉన్నారు. వీరందరికీ సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సేకరించింది.

News February 4, 2026

కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా అది రాజవదు: KTR

image

TG: మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ <<19051424>>వాడిన<<>> భాషను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. హార్వర్డ్‌లో ఎన్ని కోర్సులు చేసినా రేవంత్ తన భాషను మార్చుకోలేదని, సంస్కారం నేర్చుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన KCR వంటి నాయకుడిపై విషం చిమ్మడం రేవంత్ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనంపై కూర్చున్నంత మాత్రాన కుక్క రాజవదంటూ మండిపడ్డారు.

News February 4, 2026

వార్మప్ మ్యాచ్.. SAకి భారీ టార్గెట్

image

సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20WC వార్మప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్(53), తిలక్ వర్మ(45), అక్షర్ పటేల్(35), సూర్యకుమార్(30), పాండ్య(30) రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జాన్సన్, కోర్బిన్, అన్‌రిచ్, మఫాకలు తలో వికెట్ తీశారు. విజయం కోసం SA బ్యాటర్లు 20 ఓవర్లలో 241 పరుగులు చేయాలి.