news

News April 22, 2025

RESULTS: ఫస్ట్ ర్యాంక్ ఈమెకే

image

మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. తాజా సివిల్స్ ఫలితాల్లో యూపీ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈమె అలహాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు.

News April 22, 2025

TDP MLAలను చెప్పులతో కొడతారు: రోజా

image

AP: చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని YCP నేత రోజా ఆరోపించారు. TDP MLAలు ప్రజల్లోకి వెళ్తే చెప్పులతో కొడతారని ఆమె విమర్శించారు. ‘చేతకాని హామీలు ఇచ్చి రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు. హామీలు అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లిక్కర్‌స్కామ్‌లో మిథున్ రెడ్డిని అక్రమంగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై PM మోదీ స్పందించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

News April 22, 2025

నిషేధం వార్తలపై స్పందించిన హర్ష భోగ్లే

image

IPLలో ఈడెన్ గార్డెన్ మ్యాచులకు తనను నిషేధించారన్న వార్తల్ని వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఖండించారు. కోల్‌కతాలో జరిగే 2 మ్యాచులకు మాత్రమే తనను ఎంపిక చేశారని, ఆ రెండూ పూర్తయ్యాయని వివరించారు. KKRకు ఈడెన్ గార్డెన్స్‌లో హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ దక్కడం లేదని సైమన్ డౌల్, హర్ష భోగ్లే అన్నారు. దీంతో వీరిని కోల్‌కతాలో జరిగే మ్యాచులకు దూరం పెట్టాలని BCCIని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోరినట్లు వార్తలు వచ్చాయి.

News April 22, 2025

హద్దుమీరాను.. బ్రాహ్మణులంతా క్షమించాలి: అనురాగ్ కశ్యప్

image

ఆవేశంలో హద్దు దాటి ప్రవర్తించానని, బ్రాహ్మణులందరూ తనను క్షమించాలని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కోరారు. ఫూలే సినిమాకు సంబంధించి ఓ నెటిజన్‌తో వాగ్వాదంలో ‘బ్రాహ్మణులపై మూత్రం పోస్తాను. నీకేమైనా సమస్యా?’ అని ప్రశ్నించారు. ఆగ్రహంలో అలా నోరు జారానని తాజాగా వివరణ ఇచ్చారు. ‘నా జీవితంలో ఉన్న ఎంతోమంది బ్రాహ్మణులు నా వ్యాఖ్యల పట్ల బాధపడుతున్నారు. బ్రాహ్మణులందర్నీ అనడం నా ఉద్దేశం కాదు’ అని పేర్కొన్నారు.

News April 22, 2025

సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు తేజాలు

image

* సాయి శివాని- 11వ ర్యాంక్, * బన్నె వెంకటేశ్-15
* అభిషేక్ శర్మ-38, * జయసింహారెడ్డి- 46
* శ్రవణ్ కుమార్ రెడ్డి-62, * సాయి చైతన్య- 68
* చేతన రెడ్డి-110, * శివగణేశ్ రెడ్డి-119,
* కృష్ణ సాయి-190, * పవన్ కుమార్-375,
* సూర్య తేజ-647, సాయిభార్గవ-798,
* సూర్య తేజ-799, సాయి మోహిని మానస-975

News April 22, 2025

లాక్‌డౌన్ టైమ్‌లో ‘పెద్ది’ కథ రాశా: బుచ్చిబాబు

image

రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా కథలో కొంత ఊహాజనితం కాగా కొంత మాత్రం నిజజీవిత గాథల నుంచి తీసుకున్నానని ఆ మూవీ దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ‘నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలతో ప్రజలు త్వరగా కనెక్ట్ అవుతారనేది నా అభిప్రాయం. లాక్‌డౌన్ సమయంలో ఈ కథ రాశాను. సుకుమార్‌కు వినిపిస్తే బాగుందని, రామ్ చరణ్‌కు చెప్పమని అన్నారు. ఫస్ట్ సిటింగ్‌లోనే చరణ్ ఓకే చెప్పారు. చిన్న మార్పులు మాత్రం సూచించారు’ అని పేర్కొన్నారు.

News April 22, 2025

TDP నాయకులను వేధించడానికి జగన్ CIDని వాడారు: అనిత

image

AP: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై తప్పుడు కేసులు నమోదయ్యాయని, అయితే తమ వల్ల ఏ అధికారీ ఇబ్బంది పడలేదని హోంమంత్రి అనిత అన్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్ట్ నేపథ్యంలో మాట్లాడారు. YCP హయాంలో చేసిన తప్పుడు పనుల వల్లే అధికారులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. TDP నాయకులను వేధించడానికి జగన్ CIDని వాడారని ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు.

News April 22, 2025

అత్యధిక పాస్ పర్సెంటేజ్ ఈ గ్రూప్‌లోనే..

image

TG: ఇవాళ విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో MPC గ్రూప్‌లోనే అత్యధిక మంది విద్యార్థులు పాసయ్యారు. అత్యల్పంగా HECలో పాస్ పర్సెంట్ నమోదైంది.
MPC: ఫస్టియర్‌- 76.65%, సెకండియర్‌ -72.23%
BPC: ఫస్టియర్‌- 67.88%, సెకండియర్‌ -71.93%
MEC: ఫస్టియర్‌- 65.53%, సెకండియర్‌ -56.96%
CEC: ఫస్టియర్‌- 45.56%, సెకండియర్‌ -46.92%
HEC: ఫస్టియర్‌- 34.51%, సెకండియర్‌ -46.26%

News April 22, 2025

రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు: జగన్

image

ఏపీలో కూటమి సర్కార్ దుష్ట సంప్రదాయాలకు తెరతీసిందని మాజీ CM జగన్ విమర్శించారు. కుట్ర పూరితంగా YCP శ్రేణులు, పోలీసులను అరెస్ట్ చేయడం కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలో పార్టీ PAC సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించడం లేదు. అసలు రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News April 22, 2025

అధిష్ఠానం చెప్పినవారికే ఓటేస్తాం: పొన్నం

image

TG: రేపు హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ల ఇళ్ల ఎదుట బ్యానర్లు కట్టి, బ్లాక్‌మెయిల్‌ చేయడమేంటని మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేయకపోతే హిందువులు కారా? అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే పనులు చేస్తున్నా EC మౌనంగా ఉందన్నారు. అధిష్ఠానం చెప్పినవారికి తమ నేతలు ఓటేస్తారన్నారు. కాగా ఈ ఎన్నికలో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులే బరిలో ఉన్నారు.