news

News January 19, 2026

డియర్ పేరెంట్స్.. పిల్లల ఆరోగ్యంతో ఆటలొద్దు!

image

స్క్రీన్ టైమ్ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదో పనుందనో, అన్నం తినట్లేదనో, రిలాక్స్ అవుదామనో పిల్లలకు ఫోన్, TVలు అలవాటు చేస్తున్నారు. అయితే అలా చేస్తే వారి మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, ఫిజికల్ యాక్టివిటీస్, రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ వంటివి లోపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫోకస్ చేయడం, భాష నేర్చుకోవడం కూడా ఆలస్యమవుతుందని చెబుతున్నారు.

News January 19, 2026

సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని<> ICAR<<>>-సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌లో 3 పోస్టులకు ఇవాళ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును బట్టి PhD(అగ్రోనమీ/సాయిల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్), పీజీ అగ్రోనమీ/సాయిల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. RAకు గరిష్ఠ వయసు 40(M) కాగా, మహిళలకు 45ఏళ్లు. కంప్యూటర్ ఆపరేటర్‌కు 27ఏళ్లు. వెబ్‌సైట్: www.icar-crida.res.in

News January 19, 2026

వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

image

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

News January 19, 2026

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేయనున్న TTD

image

AP: ఏప్రిల్ కోటా తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన)ను 10AMకు TTD విడుదల చేయ‌నుంది. 21వ తేదీ ఉ.10గం.ల వరకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్‌కు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న మ.12 గంటల్లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న అకామిడేషన్(రూమ్స్), రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.

News January 19, 2026

అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

image

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.

News January 19, 2026

లక్కీడిప్ కాకుండా మొదటి గడప దర్శనం చేసుకోవచ్చా?

image

శ్రీవాణి ట్రస్ట్‌కు పది వేల రూపాయల విరాళం + ఐదు వందల రూపాయల టికెట్ కొనుగోలు చేసే భక్తులకు ‘బ్రేక్ దర్శనం’ లభిస్తుంది. దీని ద్వారా స్వామివారిని అతి చేరువగా దర్శించుకోవచ్చు. అలాగే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే విఐపిలకు, వారి సిఫార్సు లేఖలు ఉన్నవారికి కూడా ఈ భాగ్యం కలుగుతుంది. సామాన్య భక్తులకు మాత్రం లక్కీ డిప్ ద్వారా లభించే ఆర్జిత సేవలే మొదటి గడప దర్శనానికి ఉన్న అత్యుత్తమ, సరళమైన మార్గం.

News January 19, 2026

బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్

image

పంతానికి పోయి బంగ్లాదేశ్ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ముస్తాఫిజుర్‌ను IPL నుంచి తప్పించారని భారత్‌లో WC మ్యాచులు ఆడమని పట్టుబట్టింది. తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ICC ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే తమను ఐర్లాండ్‌తో గ్రూప్స్ స్వాప్ చేయాలని కోరింది. దానిని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తిరస్కరించింది. తమ షెడ్యూల్ ప్రకారమే మ్యాచులు ఆడతామని స్పష్టం చేసింది.

News January 19, 2026

నేడు మరోసారి CBI విచారణకు విజయ్

image

TVK చీఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇవాళ మరోసారి ఢిల్లీలో CBI విచారణకు హాజరుకానున్నారు. నిన్న సాయంత్రమే ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. జనవరి 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. సంక్రాంతి నేపథ్యంలో విజయ్ కోరిక మేరకు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. కరూర్ తొక్కిసలాటలో 41మంది చనిపోయిన విషయం తెలిసిందే.

News January 19, 2026

మహిళలు శంఖానాదం చేయకూడదా?

image

మన ధర్మశాస్త్రాల ప్రకారం మహిళలు శంఖం ఊదకూడదనే నియమం ఎక్కడా లేదు. శంఖానాదం ఆధ్యాత్మికంగా సానుకూలతను ఇస్తుంది. అయితే శంఖం ఊదేటప్పుడు నాభి భాగంపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది మహిళల గర్భాశయ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే పూర్వీకులు ఈ జాగ్రత్తను సూచించారు. గర్భిణీలు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం. ఇది ఆరోగ్యపరమైన సూచనే తప్ప ఆంక్ష కాదు. శారీరక సామర్థ్యం ఉన్న మహిళలు నిరభ్యంతరంగా శంఖానాదం చేయవచ్చు.

News January 19, 2026

నేడు దావోస్‌కు CM రేవంత్

image

TG: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు నేడు సీఎం రేవంత్ దావోస్ వెళ్లనున్నారు. మేడారంలో మహాజాతరను ప్రారంభించాక ఉ.8 గం.కు హెలికాప్టర్‌లో HYD చేరుకుంటారు. ఉ.9.30గం.కు శంషాబాద్ నుంచి CM, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు పర్యటనకు వెళ్లనున్నారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి సంస్థల అధినేతలతో రేవంత్ భేటీ అవుతారు.