news

News April 12, 2025

అమలాపురం వైసీపీ ఇన్‌ఛార్జిగా పినిపే

image

AP: వైసీపీ పలు పదవులకు నియామకాలు చేపట్టింది. అమలాపురం అసెంబ్లీ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పినిపే శ్రీకాంత్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని నియమించింది.

News April 12, 2025

WhatsApp గ్రూపుల్లో మెసేజులు వెళ్లట్లేదు!

image

WhatsAppలో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. గ్రూపుల్లో మెసేజులు సెండ్ అవ్వట్లేదు. దీంతో యూజర్లు, ముఖ్యంగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై మెటా ఇంకా స్పందించలేదు. పర్సనల్ మెసేజులు మాత్రం ఏ సమస్య లేకుండా డెలివరీ అవుతున్నాయి. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?

News April 12, 2025

ఓడితే ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే: వెంకయ్య

image

AP: ఒకసారి ప్రజలు ఓటమి తీర్పు ఇచ్చాక ఇష్టమున్నా లేకపోయినా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలకు ఆ ఓపిక ఉండటం లేదని చెప్పారు. తిరుపతిలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ డిబేట్‌లో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వంతో ఎన్ని చర్చలైనా జరపండి. చట్టసభలను మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. అది మనకు మనమే అపకారం చేసుకున్నట్లు అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

News April 12, 2025

ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం

image

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు అమెరికాలో ఎక్కువగా ఉత్పత్తి అవ్వవు. వీటిని పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్ ధరలపై అదనపు సుంకం భారం ఉండదు.

News April 12, 2025

పూరన్ విధ్వంసం.. LSG గ్రాండ్ విక్టరీ

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో LSG గ్రాండ్ విక్టరీ సాధించింది. 181 పరుగుల టార్గెట్‌ను 19.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ మార్క్‌రమ్ (58) హాఫ్ సెంచరీతో రాణించారు. నికోలస్ పూరన్ (1 ఫోర్, 7 సిక్సర్లతో 61 రన్స్) విధ్వంసంతో జట్టు విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. రషీద్, సుందర్ చెరో వికెట్ తీశారు.

News April 12, 2025

చందమామపై హ్యూమన్ వేస్ట్.. ఒక్క ఐడియాకు రూ.25 కోట్లు

image

అంతరిక్షంలో పేరుకుపోయిన మానవ వ్యర్థాలను తొలగించేందుకు మంచి ఐడియా ఇచ్చే వారికి నాసా బంపరాఫర్ ప్రకటించింది. వేస్ట్‌ను రీసైక్లింగ్ చేసేందుకు వినూత్న ఐడియా ఇచ్చే వారికి రూ.25 కోట్లు ($3 మిలియన్) ఇస్తామని ప్రకటించింది. 1969-72 మధ్య కాలంలో అపోలో మిషన్ ద్వారా నాసా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపింది. దీంతో అక్కడ 96 బ్యాగుల వ్యర్థాలు పేరుకుపోయాయి. కాంటెస్ట్ పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 12, 2025

ఇంటర్‌లో అత్యధిక మార్కులు

image

AP: ఇంటర్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. హర్షిణి, హేమలత, సిరి (ప్రకాశం), లాస్య (తిరుపతి)లకు సెకండియర్ MPCలో 991 మార్కులు వచ్చాయి. Bipcలో హారిక (ప్రకాశం) 991 మార్కులు సాధించింది. ఫస్టియర్ MPCలో నాదెండ్ల కృష్ణప్రియ (పొన్నూరు) 470కి 467, భాగ్యలక్ష్మి(తిరుపతి) 465, KGBV విద్యార్థిని రేవతి (అనకాపల్లి) Bipcలో 440కి 433 మార్కులు తెచ్చుకున్నారు. మీకు తెలిసిన వారిలో ఎక్కువ మార్కులు ఎన్ని? కామెంట్ చేయండి.

News April 12, 2025

3 నెలల్లో 85వేల వీసాలు.. చైనా స్నేహహస్తం!

image

సరిహద్దు వివాదాలతో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వే చైనా కొంతకాలంగా మెతక వైఖరి అవలంబిస్తోంది. ఇటీవల సరిహద్దుల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్న చైనా తాజాగా భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత 3 నెలల్లో 85 వేల వీసాలు ఇచ్చామని చైనీస్ ఎంబసీ తెలిపింది. ‘చైనాను సందర్శించేందుకు మరింత మంది ఇండియన్ ఫ్రెండ్స్‌కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.

News April 12, 2025

రేపటి నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

image

AP: దక్షిణ మధ్య రైల్వే మరిన్ని <>స్పెషల్ ట్రైన్లు<<>> నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విశాఖ నుంచి బెంగళూరు, తిరుపతి, కర్నూలు నగరాలకు మొత్తం 42 ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి మే నెలాఖరు వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. విశాఖ నుంచి బెంగళూరుకు ప్రతి ఆదివారం, తిరుపతికి బుధవారం, కర్నూలుకు మంగళవారం ట్రైన్స్ ప్రారంభమవుతాయి.

News April 12, 2025

WhatsApp డౌన్..!

image

వాట్సాప్ సేవల్లో అంతరాయం కలుగుతోందని పలువురు యూజర్లు Xలో పోస్టులు చేస్తున్నారు. మెసేజులు సెండ్ కావట్లేదని, స్టేటస్‌లు అప్డేట్ అవ్వట్లేదని చెబుతున్నారు. అసలు వాట్సాప్ లాగిన్ కావడం లేదని మరికొందరు పేర్కొంటున్నారు. కాగా మన దేశంలో ఎక్కువ మంది వినియోగించే యూపీఐ, వాట్సాప్ సేవలు ఒకేరోజు డౌన్ కావడం గమనార్హం.