India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్‌ను నమ్మి అన్ని వర్గాలు మోసపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ఆరు గ్యారంటీలు, 400 హామీలను ఎలా అమలు చేస్తుంది? పెన్షన్లు, దళితబంధు, నిరుద్యోగ భృతి గురించి సర్కార్ ఆలోచించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మూసీ బాధితుల కోసం కరసేవ చేసేందుకు మేం సిద్ధం’ అని ఆయన ప్రకటించారు.
ఇండియాలో 2024కి గాను అత్యుత్తమ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ SBIని బెస్ట్ బ్యాంకుగా ఎంపిక చేసింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ సేవలు, ఖాతాదారుల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో ఎస్బీఐ ముందంజలో ఉందని ఆ మ్యాగజైన్ తెలిపింది. మన దేశంలో SBIకి 22500 బ్రాంచులు, 62వేల ఏటీఎంలు ఉన్నాయి.
AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగినవారే అని PCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. జగన్ మాటలే ఆయన మాట్లాడుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘విజయసాయి గారూ, మీరు చదివింది జగన్ స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తులు నలుగురు బిడ్డలకు చెందాలని YS నిర్ణయించారు. కాదని ఆయన చెప్పగలరా? ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఈ వైఎస్ బిడ్డకు ఎప్పటికీ రాదని మాట ఇస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
AP: దీపావళి వేళ అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పుట్టపర్తిలో ఈమేరకు ఎస్పీ వి.రత్న ప్రకటన విడుదల చేశారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, అన్నింటికంటే ముఖ్యంగా లైసెన్సులు ఉన్నవారే విక్రయించాలని సూచించారు. పండుగ వేళ ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేయాలన్నారు.
AP: ఛార్జిషీట్‌లో వైఎస్ పేరు చేర్చిందే జగన్ అని పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. ‘వైఎస్ మరణానికి చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకీడ్చిన విషపు నాగు జగన్’ అని ఆమె ట్వీట్ చేశారు.
కెరీర్ ఆరంభంలో దక్షిణాది నిర్మాత ఒకరు తనను అవమానించినట్లు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ చెప్పారు. ‘భూల్ భులయ్యా3’ సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. మలయాళ మూవీ ‘చక్రం’లో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత తమిళ చిత్రంలో అవకాశం రాగా నిర్మాత ‘యాక్టింగ్ రాదు. డాన్స్ రాదు. హీరోయిన్‌లా కనిపిస్తున్నావా?’ అని తల్లిదండ్రుల ముందే తనను అవమానించారన్నారు.
పాకిస్థాన్ క్రికెటర్ ఫఖర్ జమాన్‌కు PCB ఝలక్ ఇచ్చింది. అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించింది. అలాగే ఆస్ట్రేలియా, జింబాబ్వే సిరీస్‌లకు కూడా ఎంపిక చేయలేదు. మరోవైపు బాబర్ ఆజమ్‌ను ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేసి, జింబాబ్వే టూర్‌కు పక్కనబెట్టింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు నుంచి బాబర్‌ను తప్పించడంతో ఆయనకు మద్దతుగా ఫఖర్ వివాదాస్పద ట్వీట్ చేశారు. దీనిపై PCB సీరియస్‌గా వ్యవహరించింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి కానుకగా టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే టీజర్ కట్ పూర్తయిందని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
TG: ఈ ఏడాది మహిళలకు రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీలో డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలచే బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. త్వరలోనే వారు బస్సు యజమానులుగా మారతారన్నారు.
శ్రీరాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చింది, అలాగే నరకాసురుడిని సత్యభామ చంపింది ఒకే రోజు. ఈ రోజునే దీపావళిగా జరుపుకుంటారని ప్రతీతి. అప్పటినుంచి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఈసారి అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 8.52 గంటల మధ్య లక్ష్మీపూజ సమయమని పండితులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.