news

News April 15, 2025

ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా శ్రేయస్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ ఐసీసీ <<16037939>>ప్లేయర్ ఆఫ్ ది మంత్(మార్చి)<<>> అవార్డుకు ఎంపికయ్యారు. కివీస్‌కు చెందిన రచిన్ రవీంద్ర, జాకోబ్ డఫీ పోటీ పడినప్పటికీ అయ్యర్‌ను పురస్కారం వరించింది. ఉమెన్స్ విభాగంలో ఆసీస్ యంగ్ ప్లేయర్ జార్జియా వాల్‌ అవార్డు దక్కింది. కివీస్‌తో T20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో ఈమె కీలక పాత్ర పోషించారు.

News April 15, 2025

ఢిల్లీలో ఉంటే 10 ఏళ్ల ఆయువు తగ్గినట్లే: గడ్కరీ

image

ఢిల్లీలో మూడు రోజులు నివసిస్తే జబ్బు చేయడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజధానిలో నెలకొన్న ఎయిర్ పొల్యూషన్‌పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో నివసించేవారికి 10 ఏళ్ల ఆయువు తగ్గినట్లే. ఢిల్లీతోపాటు ముంబైలో కూడా ఇదే పరిస్థితి. దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవాలి. ఇంధనాల వాడకాన్ని భారీగా తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

News April 15, 2025

మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి: భట్టి

image

TG: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. వారి ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్నామన్నారు. HYDలో జరుగుతున్న ‘స్త్రీ సమ్మిట్’లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఏడాదికి రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ అతివలను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు.

News April 15, 2025

ఆ భూములు మావే.. గ్రామానికి వక్ఫ్ బోర్డు నోటీసులు

image

TNలోని వేలూర్(D) కట్టుకొల్లాయి గ్రామస్థులకు వక్ఫ్ బోర్డు షాకిచ్చింది. 150 కుటుంబాలున్న ఆ గ్రామ భూములు దర్గాకు చెందినవని, ఖాళీ చేయాలని నోటీసులు పంపింది. ఆందోళనకు గురైన గ్రామస్థులు కలెక్టర్‌ వద్దకు వెళ్లి 4తరాలుగా అక్కడ జీవిస్తున్నామని, రక్షణ కల్పించాలని కోరారు. కాగా గతంలో తిరుచిరపల్లిలోని 1500 ఏళ్ల నాటి చోళా టెంపుల్‌కు సైతం వక్ఫ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

News April 15, 2025

ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు: పొంగులేటి

image

TG: BRS MLA ప్రభాకర్ రెడ్డి <<16103245>>వ్యాఖ్యలకు<<>> మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటరిచ్చారు. ‘ప్రభుత్వాన్ని కూల్చి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రీకొడుకులు భావిస్తున్నారు. MLAలను సంతలో పశువుల్లా కొనాలి అనుకుంటున్నారు. కొత్త ప్రభాకర్ అంటే KCR ఆత్మ. కేసీఆర్ మాటలనే ప్రభాకర్ చెప్పారు. ధరణితో BRS వారి తొత్తులకు అక్రమంగా ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటామని వారు భయపడ్డారు’ అని ఫైరయ్యారు.

News April 15, 2025

తరచూ ఒళ్లు విరుస్తున్నారా?

image

ఏదైనా ఓ పని పూర్తయ్యాక అప్రయత్నంగానే ఒళ్లు విరిచి ఆవలిస్తుంటాం. ఇలా చేస్తే హాయిగా అనిపిస్తుంది. ఇలా ఒళ్లు విరవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కండర సంకోచాలు నియంత్రించే నాడులు తిరిగి గాడిలో పడతాయి. అనుసంధాన కణజాల పొరలు ఉత్తేజితమవుతాయి. శరీరం నిటారుగా ఉండేందుకు తోడ్పడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. డోపమైన్ కూడా విడుదలై సంతోషంగా అనిపిస్తుంది.

News April 15, 2025

కొత్త ప్రభాకర్‌ వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్ కౌంటర్

image

TG: కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన బిల్డర్లు, వ్యాపారవేత్తలు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని తమకు చెబుతున్నారంటూ BRS MLA ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ‘ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రతోనే ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. వాటిపై విచారణ జరిపించాలని CMను కోరతా. కుట్రకోణం ఉంటే ఆయనపై చర్యలు తప్పవు. ఈ ఐదేళ్లు కాదు.. మరో ఐదేళ్లూ మా ప్రభుత్వమే ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News April 15, 2025

జనసేనలోకి గ్రంథి శ్రీనివాస్?

image

AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఆ పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్‌ను గ్రంథి ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అదే పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేయడం ఆసక్తికరంగా మారింది.

News April 15, 2025

పోక్సో కేసు.. సంచలన తీర్పు

image

బాలిక(15)ను ఓ యువకుడు(22) రేప్ చేశాడన్న కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2020లో నవీ ముంబైకి చెందిన బాలిక UPకి చెందిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 10 నెలల తర్వాత గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి యువకుడిపై పోక్సో కేసు పెట్టారు. వాదనలు విన్న కోర్టు ‘బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది. ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు’ అని పేర్కొంటూ యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.

News April 15, 2025

Big Alert.. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్స్ క్లోజ్

image

సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 6 ప్లాట్‌ఫామ్స్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లకు దాదాపు 120 రైళ్లను మళ్లించనున్నారు. రెన్నోవేషన్‌లో భాగంగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు నిర్మించనున్నారు. 110 మీ. వెడల్పు, 120 మీ. పొడవుతో నిర్మించే స్కై కాంకోర్స్‌లో రిటైల్ ఔట్‌లెట్స్, కియోస్కులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.