India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, పలు విద్యాసంస్థలకు రేపటి నుంచి ఈ నెల 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. ఆ తర్వాత 18న గుడ్‌ఫ్రైడేకు హాలిడే ఉంది. ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్న నేపథ్యంలో రెండో శనివారం పలు స్కూళ్లు సెలవు ఇవ్వడం లేదు. అలాంటి వాటికి 13, 14న రెండ్రోజులు సెలవులు ఉంటాయి.

AP: హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్‌కు రూ.1771.19 కోట్లు, వైజాగ్-చెన్నై కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌కు రూ.1264.44 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. డిజైన్ మొదలు నిర్వహణ వరకూ ఈ నిధుల్ని వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని సర్కారు తాజాగా జారీ చేసింది.

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఓ పోలీస్ అధికారి చేయిచేసుకున్నట్లు సమాచారం. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన <<16055063>>టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను<<>> అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పోలీస్ వాహనాన్ని మాధవ్ అడ్డుకున్నారు. దీంతో ఓ పోలీస్ ఆయన చెంప మీద కొట్టినట్లు తెలుస్తోంది. తర్వాత గోరంట్లను అదుపులోకి తీసుకుని తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు.

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30లోగా అప్లై చేసుకోవాలి. బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. గేట్ 2023, 2024, 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: npcilcareers.co.in

TG: అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నాశనమవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లో మామిడి కాయలు, వరి, మొక్కజొన్న, మిర్చి, జొన్న పంటలు నేలకూలాయి. ములుగు జిల్లా మెట్లగూడెంలో 15 ఎకరాల పంట నష్టపోవడంతో రైతు నర్సింహారావు పురుగుమందు తాగారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. వేర్వేరు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.

ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యాచేంద్ర(94) కన్నుమూశారు. తిరుపతి(D) వెంకటగిరి రాజకుటుంబానికి చెందిన ఈయన 1956లో ట్రావెన్‌కోర్-కొచ్చి జట్టుతో మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు. బ్యాటింగ్, లెగ్ స్పిన్‌తో గుర్తింపు తెచ్చుకున్న యాచేంద్ర మొత్తం 15 రంజీ మ్యాచ్‌లు ఆడారు. 1963-65 మధ్య ఆంధ్రా జట్టుకు నాయకత్వం వహించారు. ఆయన మృతిపై ACA అధ్యక్షుడు కేశినేని శివనాథ్ సంతాపం తెలిపారు.

IPLలో భాగంగా నేడు చెన్నైలో CSKతో KKR తలపడనుంది. 2జట్లూ పాయింట్స్ టేబుల్‌లో వెనుకబడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే చెపాక్‌లో వరుసగా 3సార్లు పరాజయం చవిచూసిన తొలి జట్టుగా CSK ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంటుంది. అయితే ధోనీ మళ్లీ కెప్టెన్ కావడంతో అలా జరగదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అటు KKR సైతం CSK కోటలోనే ఆ జట్టును కొట్టాలని చూస్తోంది. దీంతో పోరు హోరాహోరీగా ఉండే ఛాన్సుంది. ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

అమెరికాలో కోడిగుడ్ల ధరలు మండిపోతున్నాయి. తాజాగా డజను కోడిగుడ్ల ధర ఏకంగా రూ.536 (6.23 డాలర్లు)కు చేరింది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశంలో 3 కోట్ల కోళ్లను నిర్మూలించడం, దిగుమతులూ గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బర్డ్ ఫ్లూ ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

AP: పోసాని కృష్ణమురళిపై కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని తాము ఆదేశించిన తర్వాత సెక్షన్ 111(వ్యవస్థీకృత నేరం) చేర్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సూళ్లూరుపేట CIకి నోటీసులిచ్చింది. కాగా TTD ఛైర్మన్‌ను దూషించారంటూ TV5 సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైంది.

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే వేదిక(బెంగళూరు-చిన్నస్వామి స్టేడియం)లో అత్యధిక సార్లు(45) ఓడిన జట్టుగా నిలిచింది. భారీ సపోర్ట్ ఉండే హోమ్ గ్రౌండులోనే ఇలా ఓటములు ఎదురవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో DC(44), KKR(38), MI(34), PBKS(30) ఉన్నాయి. ఈ జట్లు కూడా తమ సొంత గ్రౌండ్లలోనే ఎక్కువసార్లు ఓడిపోవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.