India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్లోబల్ స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడుతున్న వేళ క్రిప్టో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత 24 గంటల్లో మార్కెట్ విలువ 1.43% పెరిగి $3.58Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ నిన్న $3,871 (Rs3.30L) పెరిగి $1,02,235ను తాకింది. నేడు $1,01,872 వద్ద ట్రేడవుతోంది. Mcap 2.74% ఎగిసి $2.01Tకి చేరుకుంది. ఎథీరియం $3,700 రెసిస్టెన్సీని బ్రేక్ చేసింది. 1.42% లాభంతో $3,687 వద్ద ముగిసింది. ప్రస్తుతం $3,665 వద్ద కొనసాగుతోంది.
AP: పేదవాడి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ భరోసా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. దివంగత సీఎం YSR మానసపుత్రిక అయిన సంజీవని లాంటి ఆ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుండా వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులైనా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని షర్మిల చెప్పారు.
ఇవాళ ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన <<15084946>>భారీ భూకంపం<<>> ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పలుచోట్ల భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 32 మృతదేహాలను వెలికితీశారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి నష్టాల నుంచి కొంత తేరుకున్నాయి. నిఫ్టీ 23,683 (+70), సెన్సెక్స్ 78,069 (+101) వద్ద ట్రేడవుతున్నాయి. ఆరంభంలో సెన్సెక్స్ 400, నిఫ్టీ 140 పాయింట్ల మేర పెరగడం గమనార్హం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు తగ్గడం పాజిటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. IT, MEDIA, AUTO షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
కరోనాను మరవకముందే hMP వైరస్ భారత్‌ను తాకి కలవరపెడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు ముందే వివిధ కాలాల్లో ప్రపంచాన్ని కొన్ని వైరస్‌లు వణికించగా, కొన్ని ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి.
1. రోటా వైరస్, 2. స్మాల్ పాక్స్, 3. మీజిల్స్(తట్టు), 4. డెంగ్యూ, 5. ఎల్లో ఫీవర్, 6. ఫ్లూ, 7. రేబిస్, 8.హెపటైటిస్-బీ&సీ, 9. ఎబోలా, 10. హెచ్‌ఐవీ.
AP: సాధారణంగా బ్రాయిలర్ కోడి గుడ్డు ధర రూ.6-8, నాటు కోడి గుడ్డు అయితే రూ.10-13 పలుకుతుంది. అయితే పందెం కోడి గుడ్డుకు రూ.400-700 వరకు డిమాండ్ ఉంటోంది. తూర్పు కోడి, ఎర్ర కక్కెర, తెల్ల కోడి గుడ్డు రూ.400 వరకు, తెల్ల కెక్కర, ఎర్రమైల, అబ్రాసు మైల జాతుల గుడ్డు రూ.700 వరకు పలుకుతోంది. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో చాలా మందికి ఇదొక కుటీర పరిశ్రమగా మారింది.
TG: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడంపై ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద పోస్టర్లు వెలిశాయని తెలిపారు. ‘రైతు డిక్లరేషన్’ ఎలా అమలవుతుందో రాష్ట్రానికి వచ్చి వివరించవచ్చు కదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ‘అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే’ అని ట్వీట్ చేశారు.
బంగారం ఆభరణాల మాదిరే వెండి నగలకూ హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని BISను కోరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అమలు సాధ్యాసాధ్యాలు, వినియోగదారులు, డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరినట్లు చెప్పారు. అవసరమైన చర్చల తర్వాతే ప్రక్రియ మొదలుపెడతామన్నారు. అటు 3-6 నెలల్లో ఈ విధానం అమలుకు సిద్ధంగా ఉన్నట్లు BIS డైరెక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు.
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి బయల్దేరారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసుల అనుమతితో బాలుడిని పరామర్శించేందుకు బన్నీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
USలో బర్డ్‌ఫ్లూ కారణంగా తొలిసారి ఓ మనిషి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. లూసియానాలో 65 ఏళ్ల వృద్ధుడు అడవి పక్షుల కారణంగా H5N1 వైరస్ సోకి ఆస్పత్రిలో చేరాడని, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. USలో ఇప్పటి వరకు 66 మందికి బర్డ్‌ఫ్లూ సోకింది. అయితే మనుషుల నుంచి మనుషుల్లో వ్యాప్తికి ఆధారాలు లభించలేదు. గతంలో బర్డ్‌ఫ్లూ సోకి మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.