news

News April 9, 2025

మోదీని విమర్శించే స్థాయి నీకుందా రేవంత్: TBJP

image

TG: ప్రధాని మోదీపై CM రేవంత్ చేసిన విమర్శలకు తెలంగాణ BJP కౌంటరిచ్చింది. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన నీకు మోదీని విమర్శించే స్థాయి ఉందా? రాహుల్ గాంధీకి ఊడిగం చేసే నువ్వా మాట్లాడేది? అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి పేద ప్రజల కడుపు కొడుతూ పబ్బం గడుపుకునే నువ్వా మాట్లాడేది? విదేశీ గడ్డపైనా ప్రశంసలు పొందిన మోదీని విమర్శించావంటే నీ స్థాయి ఏంటో, నీ కురచ బుద్ధి ఎలాంటిదో అర్థమవుతుంది’ అని ట్వీట్ చేసింది.

News April 9, 2025

రేపు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

AP: ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ చీఫ్ జగన్ రేపు సమావేశం కానున్నారు. తాడేపల్లి కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో భేటీ కానున్నట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మీటింగ్‌కు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, MLAలు, MLCలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని పేర్కొంది.

News April 9, 2025

గ్రూప్-1 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌.. షెడ్యూల్ ఇదే

image

TG: గ్రూప్-1 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి TGPSC షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలుగు వర్సిటీలో ఈనెల 16, 17, 19, 21న వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. 22వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించింది. జీఆర్ఎల్ ఆధారంగా అభ్యర్థులను వెరిఫికేషన్‌కు పిలిచింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News April 9, 2025

ఇండియాలో వెజిటేరియన్లు ఎంత శాతమంటే?

image

పెస్సెటేరియన్లు & శాకాహారులను కలిపితే ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఇండియాలో 20-39శాతం మంది ఉంటారని తాజా నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత మెక్సికో (19%), బ్రెజిల్ (14%), థైవాన్ (13-14%), ఇజ్రాయెల్ (13%), ఆస్ట్రేలియా (12.1%), అర్జెంటీనా(12%), ఫిన్లాండ్ (12%), స్వీడన్ (12%) ఉన్నాయి.
NOTE: పెస్సెటేరియన్లు అంటే చేపలు, ఇతర సముద్ర ఆహారాలతో పాటు శాకాహారం తినేవాళ్లు.

News April 9, 2025

గ్రూప్-2 పోస్టుల భర్తీ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలివే

image

AP: స్పోర్ట్ కోటా, గ్రూప్-1 పరీక్షలు రాయబోయే అభ్యర్థులు మినహా మిగిలిన గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 21 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు APPSC ప్రకటించింది. విజయవాడ కార్యాలయంలో ఉ.10 నుంచి సా.5.30 గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. గ్రూప్-1 పరీక్షలు ఈనెల 27 నుంచి 30 వరకు జరగనుండగా, వాటికి హాజరయ్యే గ్రూప్-2 అభ్యర్థులకు మే 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది.

News April 9, 2025

దుబాయ్ టు ముంబై.. సముద్రంలో బుల్లెట్ ట్రైన్!

image

దుబాయ్ నుంచి ముంబైకి అండర్ వాటర్ బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ప్లాన్ చేస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. హైపర్‌లూప్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో అరేబియన్ సముద్రంలో అల్ట్రా-హై స్పీడ్ ట్రైన్ రానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దుబాయ్-ముంబై మధ్య 2వేల కి.మీ దూరాన్ని 2 గంటల్లో చేరుకోవచ్చు.

News April 9, 2025

పెళ్లి తర్వాత ఎందుకిలా? సమాజంలో ఏం జరుగుతోంది?

image

సమాజంలో మితిమీరిన పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు/పురుషులు వివాహేతర సంబంధాలతో భార్యలు/భర్తలను చంపుతున్నారు. కొందరు మహిళలు పేగుబంధాన్ని సైతం లెక్కచేయకుండా పిల్లలను అనాథలుగా వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోతున్నారు. కొందరు భర్తలే స్వయంగా తమ భార్యలను ప్రియుళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ తల్లి తన కూతురికి కాబోయే భర్తతో వెళ్లిపోయింది. దీనిపై మీ కామెంట్?

News April 9, 2025

సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

image

తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘సీఎం సొంత జిల్లా పాలమూరులో బీజేపీ ఎంపీ గెలిచాడు. రేవంత్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్‌గిరిలోనూ కాషాయ జెండా ఎగిరింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి చేతిలో రేవంత్ ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపే గెలిచింది. సొంతగడ్డపైనే గెలవలేకపోయారు. మీరు బీజేపీని ఆపుతారా?’ అని కౌంటరిచ్చారు.

News April 9, 2025

విమానంలో తోటి ప్రయాణికునిపై మూత్ర విసర్జన!

image

ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికునిపై మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళుతున్న విమానంలో మద్యం తాగి మూత్ర విసర్జన చేసినట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది. బాధితుడు ఒక MNC కంపెనీకి MD అని తెలుస్తోంది. ఈ విషయంపై ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించగా అతడు నిరాకరించినట్లు పేర్కొంది. ఈ ఘటనపై కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు చేపడతామని ఎయిర్ ఇండియా తెలిపింది.

News April 9, 2025

ప్రేమ పెళ్లి.. పరువు హత్య?

image

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మం. నరసింగాపురంలో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. అజయ్, మైనర్ బాలిక (17) ఏడాది క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమె గర్భవతి. పేరెంట్స్ బాలికకు అబార్షన్ చేయించి, అజయ్‌పై పోక్సో కేసు పెట్టారు. అయినా ఆమె తరచూ అతడిని కలుస్తుండటంతో తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో ఈ నెల 4న బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తల్లిదండ్రులే చంపి ఉంటారని అనుమానిస్తున్నారు.