India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: జన్వాడ ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న CC ఫుటేజీలను విడుదల చేయాలని BJP MP రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ‘DGP వెంటనే ప్రెస్‌మీట్ పెట్టాలి. లేదంటే ఎడిటింగ్లు స్టార్ట్ అవుతాయి. KTR, రేవంత్ ఒక్కటి కాకపోతే ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందో సమాజం తెలుసుకోవాలనుకుంటోంది. మళ్లీ మేం పేరు చెబితే మాకు నోటీసులు ఇస్తాడేమో యువరాజు. అందుకే ఆ పార్టీ రాజుదా? యువరాజుదా? రేవ్ పార్టీనా, రావుల పార్టీనా అనేది బయటపడాలి’ అని అన్నారు.
భారత న్యాయ చట్టాల్లో డిజిటల్ అరెస్టు వంటి వ్యవస్థ ఏదీ లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆర్థిక మోసాలు అధికమవుతుండడంపై మన్ కీ బాత్‌లో మోదీ స్పందించారు. ఇదోరకమైన మోసమని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారు సంఘ విద్రోహులని అన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాల కట్టడికి దర్యాప్తు సంస్థలు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘తగ్గేదే లే’ అని సెలబ్రేట్ చేసుకుంటున్న డేవిడ్ వార్నర్ ఫొటోను బన్నీ షేర్ చేశారు. ‘మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై బ్రదర్’ అని రాసుకొచ్చారు. IPLలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడినప్పటి నుంచి వార్నర్ టాలీవుడ్ అభిమానులకూ దగ్గరయ్యారు.
TG: పత్తిలో నిర్ణీత ప్రమాణాల కన్నా తేమ శాతం ఎక్కువ ఉన్నా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తేమ శాతం ఎక్కువ ఉందనే కారణంతో పలుచోట్ల కొనుగోలు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. దీంతో కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి తుమ్మల ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అటు పత్తి కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా వాట్సాప్(8897281111) సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
కెరీర్ తొలినాళ్లలో ఎలాన్ మస్క్ అమెరికాలో అక్రమంగా పనిచేశారని Washington Post కథనాన్ని ప్రచురించింది. సౌతాఫ్రికాకు చెందిన మస్క్ 1995లో స్టాన్ఫోర్డ్ నుంచి డ్రాపౌట్ అయ్యాక Zip2 సంస్థలో 4ఏళ్ల పాటు చట్టవిరుద్ధంగా అమెరికాలో పనిచేసినట్టు తెలిపింది. 1997లో మస్క్ వర్క్ ఆథరైజేషన్ పొందారని అతని మాజీ సహచరులు వెల్లడించారంది. స్టూడెంట్ వీసాతో ఓవర్ స్టే సహజమే అయినా, అది అక్రమమని పేర్కొంది.
AP: ‘షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘షర్మిల ప్రెస్‌మీట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని చెప్పారు. కానీ ఆ ప్రెస్‌మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. కొంతకాలంగా జగన్‌ను తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ మళ్లీ CM కావొద్దనే ఆమె పని చేస్తున్నారు’ అని మీడియాతో VSR అన్నారు.
నటి రేణూ దేశాయ్ ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలను రెస్క్యూ చేయడమే ఈ సంస్థ పని. అందుకు విరాళాలు ఇవ్వాలని ఆమె కోరగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన స్పందించినట్లు తెలుస్తోంది. తన పెంపుడు శునకం రైమ్ పేరిట ఆమె ఈ సాయం చేశారట. దీంతో పెట్స్ రెస్క్యూ కోసం వ్యాన్ కొనుగోలుకు సాయం చేసినందుకు ‘థాంక్యూ రైమ్, ఉపాసన’ అంటూ రేణూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
AP: రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ఎకో సిస్టం ఉందని, అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
‘యమరాజు’గా పాపులర్ అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జవహార్‌సింగ్ యాదవ్ కన్నుమూశారు. తాను పెంచుకుంటున్న ఆవును మేపుతుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆ ఆవు కూడా మరణించింది. కాగా ఆయన కరోనా సమయంలో యమ ధర్మరాజు వేషధారణలో వాహనదారులకు అవగాహన కల్పించారు. అప్పట్లో ‘యమరాజు’ వినూత్న ఆలోచనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిశాయి.
దీపావళి ముంగిట సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. భారీ ఆఫర్లంటూ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్ల లింకులు, APK ఫైళ్లను వాట్సాప్ నంబర్లకు పంపుతున్నారు. ఏదైనా వస్తువు కోసం డబ్బు చెల్లించినా డెలివరీ కావట్లేదు. వ్యక్తిగత సమాచారం దుండగుల చేతుల్లోకి వెళ్తోంది. అలాగే బంపర్ డ్రా, లాటరీల పేరుతోనూ స్కామ్‌లు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.