India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా మాజీ CM జగన్‌కు తెలియదని TDP MLA పరిటాల సునీత ఎద్దేవా చేశారు. జై జగన్ అంటూ పరామర్శకు వెళ్తారా అని ఆమె ప్రశ్నించారు. ‘పరిటాల కుటుంబాన్ని రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారు. పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటి? జగన్ ఒక MLA మాత్రమే. ఒక DSP, 10 మంది పోలీసులు ఆయన పర్యటనకు సరిపోతారు. వైసీపీ నేత లింగమయ్య హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఆమె స్పష్టం చేశారు.

TG: ప్రజలకు వేగవంతంగా సేవలను అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. 10-15minలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా 22 కార్యాలయాల్లో ఈనెల 10 నుంచి స్లాట్ బుకింగ్ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. registration.telangana.gov.in సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు.

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74227 వద్ద, నిఫ్టీ 374 పాయింట్ల లాభంతో 22535 వద్ద ముగిశాయి. టారిఫ్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు రాణించాయి. అటు క్రూడాయిల్ రేట్లు తగ్గడం కూడా ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏప్రిల్‌లో సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని, ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయని NUVAMA రిపోర్ట్ తెలిపింది. ప్రభుత్వ వ్యయం ఎక్కువవుతుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా మూడు నెలలు పెరుగుతూ వచ్చిన సిమెంట్ ధరలు మార్చిలో తగ్గాయి. ఈనెల సౌత్ రీజియన్‌లో బస్తాకు రూ.30 చొప్పున పెరిగే అవకాశముందని పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌లో 25వేల టీచర్ పోస్టుల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు. న్యాయంగా ఎంపికైన అభ్యర్థులను టీచర్లుగా కొనసాగించాలని కోరారు. అనర్హులతో పాటు అర్హులు కూడా నష్టపోతున్నారని, ఈ విషయంలో కలగజేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. తాను ఉన్నంత వరకు అభ్యర్థులకు అన్యాయం జరగదని బెంగాల్ CM మమత ఇప్పటికే స్పష్టం చేశారు.

TG: GST వృద్ధి రేటుపై Dy.CM భట్టి విక్రమార్క ప్రజలకు అబద్ధాలు చెప్పారని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. ‘2024-25FYలో GST వృద్ధి 12.3%అని Dy.CM అసెంబ్లీలో చెప్పారు. కానీ అధికారికంగా 5.1% అని తేలింది. ఇది జాతీయ సగటు (10%) కంటే చాలా తక్కువ. అలాగే 2025 మార్చిలో 0% వృద్ధి నమోదైంది. దీనికి ప్రభుత్వ వైఫల్యం, అస్థిరమైన నిర్ణయాలు, రైతు భరోసా వంటి హామీలు నెరవేర్చకపోవడమే కారణం’ అని ట్వీట్ చేశారు.

ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ విల్ పుకోవిస్కీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికారు. ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విల్ అనూహ్యంగా రిటైర్ కావడం చర్చనీయాంశంగా మారింది. 2021లో భారత్‌పైనే విల్ టెస్టు అరంగేట్రం చేశారు. కానీ గతేడాది ఓ మ్యాచ్‌లో అతడి తలకు బంతి బలంగా తాకడంతో కుప్పకూలాడు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా అతడు క్రికెట్ ఆడే పరిస్థితులు లేవని మెడికల్ ప్యానెల్ నిర్ధారించింది.

ఐపీఎల్‌లో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచులో కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
LSG: మార్ష్, మార్క్‌రమ్, పూరన్, పంత్ (C), బదోని, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, దిగ్వేశ్, అవేశ్.
KKR: డికాక్, నరైన్, రహానే(C), అయ్యర్, జాన్సన్, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, వైభవ్, రాణా, చక్రవర్తి.

TG: CM రేవంత్, KTR ప్రాణ మిత్రులని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే కేటీఆర్ అరెస్ట్ కాకుండా CM కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘రేవంత్, KTR కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చెన్నైలో అఖిలపక్ష భేటీకి ఇద్దరూ కలిసే వెళ్లారు. HYD సమావేశం కూడా వీరే నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ కలిసి BJPని దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారు’ అంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలో స్టాండ్స్, వాకింగ్ బ్రిడ్జిలకు ప్రముఖ ముంబై క్రికెటర్ల పేర్లు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) భావిస్తోంది. ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరిట నామకరణం చేయనున్నట్లు సమాచారం. మాజీ ప్లేయర్స్ అజిత్ వాడేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, శివాల్కర్, డయానా ఎడుల్జీ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.