India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమ వాహనానికి ఫ్యాన్సీ నంబర్ ఉండాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అలాంటి ఓ వ్యక్తి ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.45 లక్షలు ఖర్చు చేశాడు. కేరళలోని ఎర్నాకుళం ఆర్టీవో కార్యాలయంలో వేలానికి ఉంచిన KL 07 DG 0007 నంబర్‌కు పోటీ నెలకొంది. ఐదుగురు దీనిని దక్కించుకునేందుకు పోటీ పడగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందినవారు దీనిని రూ.45.99లక్షలకు కొనడం గమనార్హం. ఇండియాలో ఇదే రికార్డ్ ధర అని సమాచారం.

IPL: PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తాను చివరిసారిగా ఏడ్చిన సంఘటన గురించి వెల్లడించారు. ఇవాళ CSKతో మ్యాచ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘CT-2025 తొలి ప్రాక్టీస్ సెషన్‌లో బాగా ఆడలేకపోయా. ప్రాక్టీస్‌కు ఎక్స్‌ట్రా టైమ్ కూడా దొరకలేదు. నాపై నాకే చాలా కోపం వచ్చి ఏడ్చాను’ అని తెలిపారు. కాగా CTలో 243రన్స్‌తో IND తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. IPLలోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నారు.

APలో ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 12 లేదా 13న విడుదల చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. మార్చి 1 నుంచి 19 వరకు ఫస్టియర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు జరిగాయి. ఇటీవలే వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తవగా, ఫలితాల్లో తప్పులు దొర్లకుండా మరోసారి అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఫలితాల విడుదలపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. bieap.gov.in, వే2న్యూస్ యాప్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చు.

వాంఖడేలో ముంబైతో జరిగిన మ్యాచులో ఆర్సీబీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో కృనాల్ పాండ్య నాలుగు వికెట్లతో అదరగొట్టారు. అయితే, గత మూడేళ్లుగా ఏప్రిల్ 7న జరిగే మ్యాచుల్లో కృనాల్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో LSG తరఫున 3 వికెట్లు, 2024లో GTతో మ్యాచులోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. నిన్నటి మ్యాచులోనూ సత్తాచాటారు.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. HYD జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ విచారణకు A6గా ఉన్న శ్రవణ్ రావు హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ఆయనను మరింత లోతుగా విచారించి, సమాచారం సేకరించాలని సిట్ భావిస్తోంది. గతంలో ఆయన ఎంక్వైరీకి సహకరించలేదని సిట్ వెల్లడించగా, నేటి విచారణపై ఆసక్తి నెలకొంది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై AP CM చంద్రబాబు, మంత్రి లోకేశ్, TG మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘బాలుడు త్వరగా కోలుకోవాలి. ఈ కష్ట సమయంలో పవన్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని చంద్రబాబు, లోకేశ్ ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై నటి ఊర్వశీ రౌతేలా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డిగారు కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని నేను వేడుకుంటున్నా. ఇది అభయారణ్యమే కాదు.. మన నగరానికి జీవం పోసే శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ’ అని ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చారు.

తెలంగాణలో ఇవాళ, రేపు ఉమ్మడి వరంగల్, KMM, నల్గొండ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు APలో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది.

MI, RCB మ్యాచ్‌పై IND క్రికెటర్ విహారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘RCB ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కు జితేశ్‌శర్మను అంపైర్ LBWగా ప్రకటించారు. రివ్యూ తీసుకోగా నాటౌట్ అని తేలింది. ఆ బంతికి పరుగు తీసినా రూల్ కారణంగా కౌంట్ అవ్వలేదు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో లాస్ట్ బాల్‌కు 2 రన్స్ చేయాల్సిన సమయంలో ఇలా జరిగితే పరిస్థితేంటి? అంపైర్ నిర్ణయంతో ఫలితం మారేది. ఇప్పటికైనా ఈ రూల్ మార్చాలి’ అని అసహనం వ్యక్తం చేశారు.

AP: పర్యాటక శాఖలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేశ్ ఈ నెల 9, 10 తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. పోవై లేక్‌లో జరిగే దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు, రాయితీలు వంటివి వివరించి ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్నారు. మంత్రితో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి వెళ్లనున్నారు.
Sorry, no posts matched your criteria.