news

News April 8, 2025

రూ. రెండున్నర లక్షలు కొట్టేసి సారీ లెటర్ పెట్టాడు!

image

ఓ దుకాణంలో రూ.2.45 లక్షలు దోచుకున్న దొంగ, తనను క్షమించమంటూ ఓ లేఖ అక్కడ వదిలి వెళ్లాడు. ‘అప్పుల్ని తీర్చుకునేందుకు ఈ చోరీ చేస్తున్నా. రామనవమి రోజు చేస్తున్న ఈ దొంగతనానికి నన్ను క్షమించండి. నాకు కావాల్సినంత మాత్రమే తీసుకున్నా. 6 నెలల్లో తిరిగిచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయించుకోండి’ అని అందులో రాశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనీలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

News April 8, 2025

‘ఆక్వా’కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు: ఆనం

image

AP: CM చంద్రబాబు ఆక్వా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారని TDP సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ‘త్వరలోనే బాబు ఢిల్లీకి వెళ్లి వాణిజ్యమంత్రిని కలుస్తారు. US సుంకాల కారణంగా ఆక్వా సంక్షోభం తలెత్తింది. దీనిపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. చైనా, థాయ్‌లాండ్‌కు ఎగుమతి చేసే మార్గాన్ని పరిశీలించాలని సూచించారు’ అని పేర్కొన్నారు.

News April 8, 2025

విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

image

రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ముంబైకు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అప్పటికే ముంబై సమీపించిన విమానాన్ని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించారు. రాత్రి 8.50కి ల్యాండ్ అయిన విమానాన్ని వెంటనే దూరంగా తరలించి తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. విమానంలోని 225మందిని సురక్షితంగా కిందికి దించామని, ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని స్పష్టం చేశారు.

News April 8, 2025

ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా భేటీ అయ్యారు. టారిఫ్‌ల పెంపు అనంతరం ట్రంప్‌తో భేటీ అయిన తొలి దేశాధినేత ఆయనే కావడం గమనార్హం. సుంకాల విషయంతో పాటు హమాస్‌తో నెలకొన్న పరిస్థితులపైనా వారిద్దరూ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉండగా దాన్ని శ్వేతసౌధం ఉన్నట్టుండి రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.

News April 8, 2025

ఆర్సీబీని వణికించిన హార్దిక్

image

నిన్న జరిగిన MIvsRCB మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినప్పటికీ అది అంత సులువుగా రాలేదు. ముంబై కెప్టెన్ హార్దిక్ ఓ దశలో బెంగళూరు బౌలర్లను వణికించారు. ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్ని 6, 4, 6 కొట్టిన ఆయన 8 బంతుల్లో 33 రన్స్ కొట్టి ఓ దశలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసేలా కనిపించారు. చివరికి 15 బంతుల్లో 42 పరుగులకు ఔటయ్యారు. అప్పటికి 11 బంతుల్లో 28 పరుగులు అవసరమైన ముంబై వరసగా వికెట్లు కోల్పోయి చతికిలబడింది.

News April 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 8, 2025

ఏప్రిల్ 8: చరిత్రలో ఈరోజు

image

1857: స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే మరణం
1894: వందేమాతరం గీత రచయిత బంకిం చంద్ర ఛటర్జీ మరణం
1977: రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం
1982: సినీనటుడు అల్లు అర్జున్ జననం
1983: నటి అనురాధ మెహతా జననం
1984: పాటల రచయిత అనంత శ్రీరామ్ జననం
1988: నటి నిత్యా మేనన్ జననం
1994: నటుడు అక్కినేని అఖిల్ జననం

News April 8, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 8, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.31 గంటలకు
ఇష: రాత్రి 7.44 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 8, 2025

శుభ ముహూర్తం (08-04-2025)(మంగళవారం)

image

తిథి: శుక్ల ఏకాదశి రా.11.20 వరకు
నక్షత్రం: ఆశ్లేష ఉ.10.28 వరకు
శుభసమయం: సా.5.02 నుంచి సా.6.02 వరకు
రాహుకాలం: మ.3.00-మ.4.30 వరకు
యమగండం: ఉ.9.00-ఉ.10.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
వర్జ్యం: రా.10.52-రా.12.31 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.8.51-ఉ.10.27 వరకు

News April 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.