news

News April 7, 2025

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి

image

AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

News April 7, 2025

ప్రముఖ టీవీ నటుడు మృతి

image

అమెరికన్ టీవీ నటుడు జే నార్త్(73) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున చనిపోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ‘డెన్నిస్ ది మెనస్’తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. వాంటెడ్, 77 సన్‌సెట్ స్ట్రిప్, షుగర్‌ఫుట్ వంటి షోల్లో గెస్ట్ పాత్రల్లో మెరిశారు. ది టీచర్, మాయ వంటి చిత్రాల్లోనూ నటించారు.

News April 7, 2025

2030లోగా AIకి మానవ మేధస్సు: గూగుల్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) 2030లోగా మానవులతో సమానమైన మేధస్సు(AGI)ను సాధిస్తుందని గూగుల్ డీప్‌మైండ్ అంచనా వేసింది. ఇది మానవ జాతిని శాశ్వతంగా నాశనం చేస్తుందని ఓ నివేదికలో పేర్కొంది. అయితే ఈ సామర్థ్యాన్ని ఏఐ ఎలా సాధిస్తుందన్న విషయాన్ని వెల్లడించలేదు. AGI ముప్పును నియంత్రించడానికి గూగుల్‌తో పాటు ఇతర ఏఐ కంపెనీలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నివేదిక ఫోకస్ పెట్టింది.

News April 7, 2025

ఆ‘రేంజ్’లో ఊహించుకుంటే..

image

గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని IPL-2025లో SRHపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి కప్పు కొడుతుందని ధీమాగా ఉండగా ఆరెంజ్ ఆర్మీ ప్రదర్శన మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి మ్యాచ్ మినహా మిగతా వాటిలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. భారీ స్కోర్లు అటుంచి కనీసం మ్యాచ్ గెలిచే ప్రదర్శన చేయలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా సమష్టిగా రాణిస్తే అంచనాలను అందుకోవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

News April 7, 2025

ట్రంప్ దెబ్బ.. మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిది!

image

ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత స్టాక్ మార్కెట్లు 3.9%, హాంకాంగ్- 8.7%, సింగపూర్- 7%, జపాన్- 6%, చైనా- 5.5%, మలేషియా- 4.2%, ఆస్ట్రేలియా- 4.1%, ఫిలిప్పీన్స్- 4%, న్యూజిలాండ్-3.6% నష్టపోయాయి. కొన్ని నెలల పాటు ఈ టారిఫ్స్ ఒడుదొడుకులు కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.

News April 7, 2025

ఐటీ నోటీసులకు భయపడం: పృథ్వీరాజ్ తల్లి

image

రెమ్యునరేషన్ వివరాలు వెల్లడించాలని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఐటీ నోటీసులు రావడంపై ఆయన తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తునకు భయపడేది లేదని చెప్పారు. అంతకుముందు సినిమా విషయంలో వివాదం చెలరేగగా పృథ్వీరాజ్‌కు స్టార్ హీరో మమ్ముట్టి అండగా ఉండటం తనను కదిలించిందని తెలిపారు. తన కొడుకుకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

News April 7, 2025

STOCK MARKETS: రూ.19 లక్షల కోట్ల నష్టం!

image

భారత స్టాక్ మార్కెట్స్ సెషన్ ప్రారంభంలోనే సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 3939, నిఫ్టీ 1160 పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. మొత్తంగా 5 శాతానికి పైగా సంపద ఆవిరైంది. ఐటీ, మెటల్ సూచీలు 7 శాతం నష్టపోయాయి. మరోవైపు చైనా, జపాన్, కొరియా తదితర దేశాల మార్కెట్లు సైతం కుప్పకూలాయి.

News April 7, 2025

మూడు రోజుల్లో ₹3000 తగ్గిన బంగారం ధరలు!

image

అమెరికా విధించిన సుంకాలతో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ కూడా స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹280 తగ్గి ₹90,380కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹250 తగ్గి ₹82,850గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,02,900కి చేరింది. కాగా, గత మూడు రోజుల్లోనే కేజీ వెండిపై రూ.9,100, తులం బంగారంపై రూ.3000 తగ్గడం విశేషం.

News April 7, 2025

వాట్సాప్ యూజర్లకు అలర్ట్

image

ఆన్‌లైన్ మోసాల పట్ల వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నంబర్‌కి OTP పంపి, అనుకోకుండా పంపామని మోసగాళ్లు వాట్సాప్‌లో చాట్ చేస్తున్నారని తెలిపారు. వాట్సాప్‌ను హ్యాక్ చేసి సన్నిహితుల నంబర్లకు మీ పేరుతో డబ్బులు పంపించాలంటూ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలన్నారు.

News April 7, 2025

ఈ క్లాక్ టవర్ కోసం రూ.40 లక్షలు ఖర్చు!

image

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బిహార్ ప్రభుత్వం నిర్మించిన ‘క్లాక్ టవర్’పై విమర్శలొస్తున్నాయి. రూ.40 లక్షల వ్యయంతో షరీఫ్‌లో నిర్మించగా ఇది పక్షుల కోసం ఏర్పాటు చేసిన గూడులా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ముందుగా నిర్దేశించిన మోడల్‌కు విరుద్ధంగా దీనిని నిర్మించగా, ప్రస్తుతం క్లాక్ కూడా పనిచేయట్లేదు. కాగా బ్రిటీషర్లు నిర్మించిన క్లాక్ టవర్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.