news

News April 7, 2025

బిగ్‌బాస్ హోస్ట్‌గా బాలకృష్ణ?

image

తెలుగు బిగ్‌బాస్ షో హోస్టింగ్ నుంచి కింగ్ నాగార్జున తప్పుకొన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హోస్ట్‌గా చేయాలని బాలయ్యను నిర్వాహకులు సంప్రదించారని టాక్. ‘అన్‌స్టాపబుల్’ ద్వారా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌కూ బాలయ్య ప్లస్ అవుతారని వారు భావిస్తున్నట్లు సమాచారం. అటు రానా దగ్గుబాటి పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 7, 2025

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

image

ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడి నూటికి నూరుపాళ్లు నిజం. ఏ భయం లేకుండా ఏదైనా తినగలగడం, దాన్ని అరాయించుకోగలగడం, హాయిగా నిద్రపోవడం.. వీటి తర్వాతే మనిషికి ఏ ఆస్తైనా. బీపీలు, షుగర్లు, దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, క్యాన్సర్లు.. ఒకటేమిటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు అనేక రకాల మహమ్మార్లు కాచుకుని ఉన్నాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నవారే అదృ‌ష్టవంతులు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.

News April 7, 2025

మాజీ రైజర్సే దెబ్బ కొట్టారు!

image

GT నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మాజీ ఆటగాళ్లు గట్టి దెబ్బ తీశారు. గత సీజన్ వరకూ SRHలోనే ఉన్న వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లోనే 49 రన్స్‌తో లక్ష్య ఛేదనను సులువుగా మార్చేశాడు. అటు ఒకప్పటి రైజర్ సిరాజ్ బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. వీరిద్దరూ మన వద్ద ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఆడలేదంటూ నెట్టింట సన్‌రైజర్స్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

News April 7, 2025

50కి పైగా దేశాలు మాతో బేరాలాడుతున్నాయి: US

image

ట్రంప్ విధించిన సుంకాలతో ప్రభావితమైన వాటిలో 50కి పైగా దేశాలు తమతో టారిఫ్‌ల తగ్గింపుపై బేరాలాడుతున్నాయని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ వెల్లడించారు. ‘దేశ ప్రయోజనాలే ట్రంప్‌కు ముఖ్యం. వేరే ఉద్దేశాలేం లేవు. అనేక దేశాలు ఇప్పుడు మాతో చర్చలు జరుపుతున్నాయి. సుంకాల వల్ల పెద్ద ఇబ్బంది అవుతుందని మేం భావించట్లేదు. మనకు ఎగుమతి చేసే దేశాలు తమ సుంకాల్ని తగ్గిస్తాయంతే’ అని వివరించారు.

News April 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 7, 2025

ఏప్రిల్ 7: చరిత్రలో ఈరోజు

image

1920: సంగీత విద్వాంసుడు రవిశంకర్ జననం
1942: బాలీవుడ్ నటుడు జితేంద్ర జననం
1962: సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ జననం
1962: నటి కోవై సరళ జననం
1991: కవి కొండవీటి వెంకటకవి మరణం
* ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

News April 7, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 7, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.06 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.31 గంటలకు
ఇష: రాత్రి 7.44 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 7, 2025

శుభ ముహూర్తం (07-04-2025)(సోమవారం)

image

తిథి: శుక్ల దశమి రా.11.14 వరకు
నక్షత్రం: పుష్యమి ఉ.9.58 వరకు
శుభసమయం: ఉ.6.25 నుంచి ఉ.7.01 వరకు
రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00 వరకు
యమగండం: ఉ.10.30-మ.12.00 వరకు
దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
వర్జ్యం: సా.6.03-సా.7.39 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.7.50-ఉ.9.26 వరకు

News April 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 7, 2025

TODAY HEADLINES

image

✒ తమిళనాట పాంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన PM
✒ CPM ప్రధాన కార్యదర్శిగా MA బేబీ
✒ భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం
✒ ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. కేంద్రానికి CBN లేఖ
✒ వృద్ధి రేటులో APకి రెండో స్థానం: CM
✒ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు: సంధ్యారాణి
✒ రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన రేవంత్
✒ HCU రక్షణకు చేతులు కలపండి: KTR
✒ మంత్రులను AICC నిర్ణయించడమేంటి?: సంజయ్