news

News April 6, 2025

నేడు ఉత్తరాఖండ్‌కు పొన్నం, సీతక్క

image

TG: మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క నేడు ఉత్తరాఖండ్‌కు వెళ్లనున్నారు. సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన రేపు, ఎల్లుండి డెహ్రాడూన్‌లో జరిగే చింతన్ శిబిర్ కార్యక్రమంలో పాల్గొంటారు. BC సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు వంటి అంశాలపై పొన్నం ప్రసంగించనున్నారు. మరోవైపు దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి సీతక్క వివరించనున్నారు.

News April 6, 2025

కాచుకొని ఉన్న ‘ఉపగ్రహ’ ముప్పు!

image

భూ కక్ష్యలో శకలాల ముప్పు నానాటికీ మరింత పెరుగుతోంది. ఉపగ్రహాలు తిరిగే వేగం కారణంగా ఒక సెం.మీ పరిమాణం ఉన్న వస్తువు ఢీకొట్టినా విధ్వంసం వేరేస్థాయిలో ఉంటుంది. భూ కక్ష్యలో అలాంటివి 12 లక్షలకు పైగా ఉన్నాయి. వీటి వల్ల ఒక ఉపగ్రహం ధ్వంసమైనా అది మిగతా శాటిలైట్లన్నింటినీ ధ్వంసం చేయొచ్చు. అదే జరిగితే భూమిపై సాంకేతికత అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News April 6, 2025

పూరీ-విజయ్ సేతుపతి సినిమాలో టబు?

image

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో పాపులరైన ఆమెను సినిమాలోని ఓ కీలక పాత్రకు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మేలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

News April 6, 2025

రాములోరి కళ్యాణానికి వేళాయె..

image

TG: భద్రాద్రిలో శ్రీరామనవమి సందర్భంగా నేడు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 9 గంటలకు కళ్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకెళ్తారు. 10.30-12.30గం. మధ్య కళ్యాణ క్రతువు నిర్వహిస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి దేవతామూర్తులకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు.

News April 6, 2025

అధ్యక్ష బాధ్యతల వల్ల భార్యకు దూరమయ్యా: ఒబామా

image

ఒబామా అమెరికా అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు సేవలందించారు. ఆ సమయంలో తన భార్య మిషెల్‌కు దూరమయ్యానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అధ్యక్ష బాధ్యతల కారణంగా మిషెల్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయాను. దీంతో మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకానొక సమయంలో మ్యారేజ్ కౌన్సిలర్‌ను కూడా కలిశాం. అధ్యక్షుడిగా దిగిపోయాక ఇప్పుడు ఆమెతోనే ఎక్కువ ఉంటున్నాను. మా బంధం మెరుగైంది’ అని వెల్లడించారు.

News April 6, 2025

తెలంగాణ కొత్త సీఎస్ ఆయనేనా?

image

TG: సీఎస్ శాంతికుమారి ఈనెలాఖరున రిటైర్ కానున్న నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఐఏఎస్ రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని CM రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆర్థిక శాఖలో సుదీర్ఘ అనుభవం, రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయనవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతికుమారి వీఆర్ఎస్ తీసుకుంటారని, ఆమెకు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News April 6, 2025

ఈ నెల 30 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం

image

చార్ ధామ్ యాత్ర ఈ నెల 30నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనుండగా వచ్చే నెల 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ గుళ్లను తెరుస్తారు. భక్తుల రక్షణార్థం 6వేలకు పైగా పోలీసుల్ని, భద్రతాసిబ్బందిని అధికారులు ఏర్పాటు చేయనున్నారు. 10 కి.మీకి ఒక సెక్టార్ చొప్పున 137 సెక్టార్లుగా యాత్ర మార్గాన్ని విభజించామని నిరంతరం భద్రతాసిబ్బంది గస్తీ తిరుగుతుంటారని వారు స్పష్టం చేశారు.

News April 6, 2025

గుజరాత్‌తో సన్‌రైజర్స్ ఢీ.. గెలుపెవరిదో!

image

IPLలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు గుజరాత్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న SRH సొంత గ్రౌండ్‌లో మళ్లీ గాడిన పడాలని చూస్తోండగా వరుస విజయాల జోరును కొనసాగించాలని GT భావిస్తోంది. SRH టీమ్ బ్యాటింగ్‌లో క్లిక్ అవ్వకపోగా బౌలింగ్‌లో వికెట్లూ తీయలేకపోతోంది. ఫీల్డింగ్‌లోనూ పేలవంగానే కనిపిస్తోంది. మరోవైపు GT బలంగా ఉంది. మరి ఈరోజు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

News April 6, 2025

ట్రోలింగ్‌ వల్ల వారికి ఏం ఆనందం వస్తుందో: మోహన్ బాబు

image

ట్రోలింగ్‌ను తాను పట్టించుకోనని నటుడు మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎదుటివాళ్లు నాశనమవ్వాలని కోరుకోకూడదు. అలా కోరుకుంటే వాళ్లకంటే ముందు మనమే నాశనమవుతాం. అందరూ క్షేమంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఈ ట్రోలింగ్ చేసేవారికి దాని వల్ల ఏం ఆనందం వస్తుందో అర్థంకాదు. అయితే ఎవర్నీ నిందించను. దేవుడి ఆశీస్సులతో ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ పిల్లలతో హాయిగా ఉండాలనుకుంటున్నాను అంతే’ అని తెలిపారు.

News April 6, 2025

మావోయిస్టులు లొంగిపోవడానికి కారణం?

image

మావోయిస్టులు గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. వారి లొంగుబాట్లకు కారణాలేంటన్నదానిపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దళ సభ్యుల మధ్య విభేదాలు, సీనియర్లలో వయోభారం, నేటి కాలంలో సిద్ధాంతాలు ఇమడటం లేదన్న భావం, ప్రజల మద్దతు లభించకపోవడం, బలగాల దాడుల తీవ్రత పెరగడం.. ఇలాంటివన్నీ కలగలిసి మావోయిస్టులు లొంగిపోయేందుకు మొగ్గుచూపిస్తున్నారన్న వాదనలున్నాయి. మీరేమనుకుంటున్నారు?