news

News October 27, 2024

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

నాన్ టెక్నికల్ కేటగిరీ(NTPC)లో 3,693 పోస్టులకు RRB దరఖాస్తులు స్వీకరిస్తోంది. అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో 18 నుంచి 33 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఈ నెల 27 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500. మహిళలు, ఎస్టీ, ఎస్సీ, ఈబీసీలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

News October 27, 2024

ఉదయం చలి.. పగలు ఎండ

image

AP: రాష్ట్ర ప్రజలను ఉదయం పూట చలి వణికిస్తుంటే మధ్యాహ్నం ఎండ బాదుతోంది. శీతాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అటు పగటిపూట ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

News October 27, 2024

సైబర్ నేరాల నియంత్రణకు AI పరిష్కారాలు!

image

సైబ‌ర్ నేరాల‌ను ఎదుర్కొనేందుకు AI ప‌రిష్కారాల కోసం కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. IndiaAI ఇనిషియేటివ్‌లో భాగంగా నేష‌న‌ల్ సైబ‌ర్ క్రైం పోర్ట‌ల్‌ (NCRP)లో పౌరులు సుల‌భంగా సైబ‌ర్ నేరాల‌పై ఫిర్యాదు చేసే విధంగా, నేర విధానాల ఆధారంగా వాటి విభ‌జ‌న‌కు అవ‌స‌ర‌మైన Natural Language Processing వృద్ధికి ఔత్సాహికులను ఆహ్వానించింది. రోజూ నమోదయ్యే 6K కేసుల నిర్వహణ, నేరాల నియంత్రణకే ఈ ప్రయత్నాలని ఓ అధికారి తెలిపారు.

News October 27, 2024

రోజుకు 10000 STEPS వేస్తున్నారా?

image

ఫిట్నెస్ ట్రాకర్లు వచ్చాక రోజుకు ‘10000 STEPS’ టార్గెట్‌గా పెట్టుకోవడం అలవాటైంది. ఈ ట్రెండుపై కాస్త ఆలోచించాలని పరిశోధకులు అంటున్నారు. ఆయు ప్రమాణం పెరగాలంటే ‘10000’ అవసరమేమీ లేదంటున్నారు. శ్రద్ధగా రోజుకు 2300 అడుగులు వేసినా గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని అంటున్నారు. 3300 అడుగులేస్తే డెత్ రిస్క్ 15% తగ్గుతుందని, అదనంగా వేసే ప్రతి 500 స్టెప్స్‌కు 7% కార్డియో డెత్ రిస్క్ తగ్గుతుందని వెల్లడించారు.

News October 27, 2024

మరో ఆరుగురికి సోకిన డయేరియా

image

AP: రాష్ట్రంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకినట్లు తేలింది. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు ఇదే కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 17 మంది ఆసుపత్రిలో చేరారు. తాగునీరు కలుషితం కావడంతో ఇక్కడ ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి.

News October 27, 2024

కార్తీక మాసం ఎప్పుడంటే?

image

TG: నవంబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కార్తీక మాస ఉత్సవాలను నిర్వహించాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించాలని తెలిపింది. దీపోత్సవంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని ఆలయాల ఈవోలు, సహాయక కమిషనర్లు ఇవి అమలయ్యేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

News October 27, 2024

CNN సర్వేలో కమల, ట్రంప్ హోరాహోరీ

image

ప్రీపోల్ స‌ర్వేలు అమెరికాలో ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా CNN నిర్వ‌హించిన స‌ర్వేలో క‌మ‌లా హారిస్‌, డొనాల్డ్ ట్రంప్ ఇద్ద‌రూ స‌మానంగా 47% చొప్పునా (1704 శాంపిల్స్) మద్ద‌తు పొందారు. ఇటీవల న్యూయార్క్‌టైమ్స్‌, సియెనా కాలేజీ స‌ర్వేలోనూ ఇద్ద‌రికీ చెరో 48% మ‌ద్ద‌తు ద‌క్కింది. ఇక ఆర్థిక అంశాలపై ఫైనాన్షియ‌ల్ టైమ్స్‌, మిచిగాన్ వ‌ర్సిటీ స‌ర్వేలో 44% మంది మ‌ద్ద‌తుతో క‌మ‌ల కంటే ట్రంప్ 1% పైచేయి సాధించారు.

News October 27, 2024

నాకు హిందీ రాదు.. అర్థం కాలేదు: డీఎంకే ఎంపీ

image

రైళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై DMK MP అబ్దుల్లా వేసిన ప్రశ్నలకు కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టు హిందీలో బదులిస్తూ లేఖ రాశారు. తనకు హిందీ రాదని, బిట్టు లెటర్‌లో ఒక్క ముక్క అర్థం కాలేదని అబ్దుల్లా ఆయన ఆఫీస్‌కు ఫోన్ చేశారు. ఈ విషయం తాను గతంలోనూ చెప్పానని, ఇంగ్లిష్‌లో రిప్లై ఇవ్వాలని చెప్పారు. ఇదే విషయంపై తమిళంలోనూ రిటర్న్ లేఖ రాశారు. కాగా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని DMK విమర్శిస్తోంది.

News October 27, 2024

నేడు న్యూజిలాండ్‌తో రెండో వన్డే

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డే గెలిచిన భారత్ ఈరోజు అహ్మదాబాద్ వేదికగా రెండో వన్డేలో తలపడనుంది. మ్యాచ్ మ.1.30గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో ప్రసారం అవుతుంది. కాగా ఇందులో గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలవాలని భారత్ చూస్తుంటే ఇందులో ఎలాగైనా గెలిచి రేసులో నిలవాలని కివీస్ భావిస్తోంది.

News October 27, 2024

అనురాధ ముందు అనేక సవాళ్లు

image

APPSC ఛైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న AR అనురాధ ముందు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అనేక సవాళ్లు ఉన్నాయి. ఆయుష్ విభాగంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై అభ్యర్థులు పోస్టింగ్స్ కోసం చూస్తున్నారు. గ్రూప్-1, 2 DYEO, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు వంటి పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.