news

News October 27, 2024

విశాఖలో ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్: లోకేశ్

image

AP ఆర్థిక రాజధాని విశాఖకు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్ రాబోతున్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్‌పోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా సంస్థలు రాబోతున్నాయి. అమరావతిలో 5 బిలియన్ డాలర్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం’ అని ఆయన చెప్పారు.

News October 27, 2024

విశాఖ-విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్రమంత్రి

image

AP: విశాఖ-విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ 9.35amకు విశాఖలో బయలుదేరి 10.35amకు గన్నవరం చేరుతుంది. తిరిగి 7.55pmకు విజయవాడ నుంచి బయలుదేరి 9pmకు విశాఖకు చేరుతుంది. ఇండిగో సర్వీసు 7.15pmకు విజయవాడ నుంచి విశాఖకు వెళ్లి, 8.45pmకు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుతుంది. ఈ నగరాల మధ్య విమానాల సంఖ్య 3కి చేరింది.

News October 27, 2024

20 లక్షల ఉద్యోగాల కల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ

image

AP: 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకునేందుకు విధివిధానాలు రూపొందిస్తోంది. ఈమేరకు ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి లోకేశ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టనుంది.

News October 27, 2024

‘దృశ్యం’లో వెంకటేశ్ చిన్నకూతురు.. ఇప్పుడెలా అయ్యారో చూడండి!

image

విక్టరీ వెంకటేశ్-మీనా నటించిన ‘దృశ్యం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందులో వారి పెద్దకూతురిగా కృతిక, చిన్నకూతురిగా ఎస్తేర్ అనిల్ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. తాజాగా ఎస్తేర్ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా ‘ఆ అమ్మాయి ఇప్పుడు ఇలా అయిందా?’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌ భాషల్లోనూ ఎస్తేరే నటించారు.

News October 27, 2024

Swiggy IPO: Nov 6-8 మ‌ధ్య ప‌బ్లిక్ స‌బ్‌స్క్రిప్షన్

image

Swiggy IPO ప‌బ్లిక్ స‌బ్‌స్క్రిప్షన్ న‌వంబ‌ర్ 6-8 తేదీల మ‌ధ్య జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. $11.3 బిలియన్ల (₹93,790 కోట్లు) IPO వాల్యుయేషన్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. IPO ప్రైమ‌రీ కాంపోనెంట్‌ను సుమారు ₹4,500 కోట్లకు పెంచారు. ఇన్వెస్ట‌ర్ల ఆస‌క్తికి అనుగుణంగా OFS కాంపోనెంట్‌నూ సవరించినట్లు తెలిసింది. మొత్తం IPO పరిమాణం ₹11,700 కోట్ల నుంచి ₹11,800 కోట్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నాయి.

News October 27, 2024

క్షీణిస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖ‌మేనీ ఆరోగ్యం!

image

ఇజ్రాయెల్ ప్ర‌తీకార దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్‌ను సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖ‌మేనీ(85) ఆరోగ్య ప‌రిస్థితి కలవరపెడుతోంది. ఖ‌మేనీ తీవ్ర అనారోగ్యం బారిన ప‌డినట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇప్ప‌టికే మాజీ అధ్య‌క్షుడు ఇజ్ర‌హీం రైసీ మృతితో దేశంలో అస్థిర‌త ఏర్ప‌డ‌డంతో తాజాగా ఖ‌మేనీ అనారోగ్యం ఇరాన్‌ను దిగులు పెడుతోంది. ఖ‌మేనీ వార‌సుడిగా రెండో పెద్ద‌కుమారుడు మొజ్తాబా ప‌గ్గాలు చేప‌డతారని తెలుస్తోంది.

News October 27, 2024

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

నాన్ టెక్నికల్ కేటగిరీ(NTPC)లో 3,693 పోస్టులకు RRB దరఖాస్తులు స్వీకరిస్తోంది. అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో 18 నుంచి 33 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఈ నెల 27 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500. మహిళలు, ఎస్టీ, ఎస్సీ, ఈబీసీలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

News October 27, 2024

ఉదయం చలి.. పగలు ఎండ

image

AP: రాష్ట్ర ప్రజలను ఉదయం పూట చలి వణికిస్తుంటే మధ్యాహ్నం ఎండ బాదుతోంది. శీతాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అటు పగటిపూట ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

News October 27, 2024

సైబర్ నేరాల నియంత్రణకు AI పరిష్కారాలు!

image

సైబ‌ర్ నేరాల‌ను ఎదుర్కొనేందుకు AI ప‌రిష్కారాల కోసం కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. IndiaAI ఇనిషియేటివ్‌లో భాగంగా నేష‌న‌ల్ సైబ‌ర్ క్రైం పోర్ట‌ల్‌ (NCRP)లో పౌరులు సుల‌భంగా సైబ‌ర్ నేరాల‌పై ఫిర్యాదు చేసే విధంగా, నేర విధానాల ఆధారంగా వాటి విభ‌జ‌న‌కు అవ‌స‌ర‌మైన Natural Language Processing వృద్ధికి ఔత్సాహికులను ఆహ్వానించింది. రోజూ నమోదయ్యే 6K కేసుల నిర్వహణ, నేరాల నియంత్రణకే ఈ ప్రయత్నాలని ఓ అధికారి తెలిపారు.

News October 27, 2024

రోజుకు 10000 STEPS వేస్తున్నారా?

image

ఫిట్నెస్ ట్రాకర్లు వచ్చాక రోజుకు ‘10000 STEPS’ టార్గెట్‌గా పెట్టుకోవడం అలవాటైంది. ఈ ట్రెండుపై కాస్త ఆలోచించాలని పరిశోధకులు అంటున్నారు. ఆయు ప్రమాణం పెరగాలంటే ‘10000’ అవసరమేమీ లేదంటున్నారు. శ్రద్ధగా రోజుకు 2300 అడుగులు వేసినా గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని అంటున్నారు. 3300 అడుగులేస్తే డెత్ రిస్క్ 15% తగ్గుతుందని, అదనంగా వేసే ప్రతి 500 స్టెప్స్‌కు 7% కార్డియో డెత్ రిస్క్ తగ్గుతుందని వెల్లడించారు.