India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నటి సనా ఖాన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘సరైన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అది జీవితంలో ఆనందాన్ని నింపుతుంది’ అని రాసుకొచ్చారు. 2020లో ఆమె ముస్లిం మతగురువు అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకోగా 2023లో ఓ బాబు జన్మించాడు. సనా ఖాన్ తెలుగులో కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిబెట్‌లో ఇప్పటివరకు 53 మంది మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. 62 మందికి గాయాలైనట్లు తెలిపింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన కుటుంబం అని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఆ ఫ్యామిలీకి మద్దతుగా నిలవడం తన బాధ్యత అని చెప్పారు. వారు కచ్చితంగా గట్టి కమ్‌బ్యాక్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన BGTలో రోహిత్, విరాట్ ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే నెల ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో రాణించేందుకు వీరిద్దరూ సన్నద్ధమవుతున్నారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అరెస్టుపై స్టే కూడా ఎత్తేసింది. చట్టప్రకారం నడుచుకోవాలని సూచించింది. అటు నందినగర్‌లోని కేటీఆర్ ఇంటికి హరీశ్ రావు, కవిత చేరుకున్నారు. లీగల్ టీమ్‌తో వీరు ముగ్గురు చర్చలు జరుపుతున్నారు. క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో భవిష్యత్ కార్యాచరణ ఏంటని సమాలోచనలు చేస్తున్నారు.
TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా-ఈ రేసు కేసుకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడలోనూ గ్రీన్ కో, ఏస్ జెన్‌నెక్ట్స్ ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ తెలపగా ఏసీబీ అనుమతి ఇచ్చింది. విచారణకు ఎప్పుడు రావాలో ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది.
AP: ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లు, పోలీసులకు హైకోర్టు ఊరట కలిగించింది. IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీ, ACP హనుమంతురావు, CI సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వారు తెలిపారు.
hMP వైరస్ దేశంలో నెమ్మదిగా విస్తరిస్తోంది. నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఇద్దరు చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చిన 7, 13 ఏళ్ల చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని క్లిప్పింగ్స్ వాడుకున్నందుకు నయనతారకు తాము నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను నిర్మాతలు ఖండించారు. తాము రూ.5కోట్లు డిమాండ్ చేయలేదని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఆమె తమ నుంచి ముందే NOC తీసుకున్నారని తెలిపింది. కాగా ఈ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీదాన్’ క్లిప్స్ వాడినందుకు నయన్‌పై హీరో ధనుష్ రూ.10కోట్లకు దావా వేసిన విషయం తెలిసిందే.
TG: ఫార్ములా-e రేస్ కేసులో KTR క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ACB వాదనలను పరిగణనలోకి తీసుకొని తీర్పు ఇచ్చింది. అటు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న KTR లాయర్ వినతిని తోసిపుచ్చింది. దీంతో ఏసీబీ, ఈడీలకు మాజీ మంత్రిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినట్లైంది. కాగా ఈ పిటిషన్‌పై నేడు తీర్పు రానుందనే తర్వాత విచారణకు వస్తానని EDకి KTR లేఖ రాశారు.
హాలీవుడ్ స్టార్లు టామ్ హాలండ్, జెండయా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌లో జెండయా డైమండ్ రింగ్ ధరించి కనిపించడంతో ఫ్యాన్స్ వారికి విషెస్ చెబుతున్నారు. ‘స్పైడర్‌మ్యాన్’ ఫ్రాంచైజీలో 3 సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ 2021 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఎంగేజ్‌మెంట్‌పై వారు ప్రకటన చేయాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.