news

News April 2, 2025

SBI అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా?

image

నిన్న ఎస్బీఐ సేవల్లో <<15956785>>అంతరాయంతో<<>> కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉ.8.15 నుంచే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యూపీఐ సేవల్లో సమస్యలు ఎదురయ్యాయి. తమ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయ్యాయని, ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అయ్యాయని కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంకా డబ్బులు క్రెడిట్ కాలేదని, వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై SBI ఇంకా స్పందించలేదు. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా?

News April 2, 2025

శ్రేయస్ అయ్యర్ సరికొత్త ఘనత

image

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరో ఘనత సాధించారు. టోర్నీలో అత్యధిక విన్ పర్సంటేజీ సాధించిన మూడో కెప్టెన్‌గా అయ్యర్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 72 మ్యాచులకు సారథ్యం వహించి 55.55% విజయాలు సాధించారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (55.06%) రికార్డును ఆయన అధిగమించారు. ఈ జాబితాలో ధోనీ (58.84%) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సచిన్ (58.82%) కొనసాగుతున్నారు.

News April 2, 2025

వక్ఫ్ సవరణ బిల్లు.. మీ అభిప్రాయం?

image

వక్ఫ్ అంటే ముస్లింలు చేసే దానం. ఎక్కువగా స్థిరాస్తి రూపంలోనే ఉంటుంది. 9.4 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయని అంచనా. వాటిలో చాలావాటికి పత్రాలు లేకపోవడం వివాదాస్పదమవుతోంది. ఒక ఆస్తిని వక్ఫ్‌గా నిర్ణయిస్తే దానిపై సర్వాధికారాలు వక్ఫ్ బోర్డువే. ఆ అధికారాల్ని తగ్గించి బోర్డుల్ని చట్టం పరిధిలోకి మరింతగా తీసుకొచ్చేలా కేంద్రం నేడు బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆ సవరణపై మీ అభిప్రాయం? కామెంట్ చేయండి.

News April 2, 2025

దేశంలో 13వేల చదరపు కి.మీ.ల అటవీ భూముల కబ్జా

image

దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13వేల చదరపు కిలోమీటర్ల అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా MPలో 5,460.9 Sqkm భూములు కబ్జాకు గురైనట్లు నివేదికలో తెలిపింది. APలో 133.18 చదరపు కి.మీల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంది. మొత్తం ఆక్రమిత భూముల్లో 409.77 Sqkm తిరిగి స్వాధీనం చేసుకున్నామంది. కాగా తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ వివరాలు ఇవ్వలేదని తెలిపింది.

News April 2, 2025

ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

News April 2, 2025

శ్రీశైల మల్లన్నకు రూ.6.10కోట్ల ఆదాయం

image

AP: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 27 రోజులకు గానూ రూ.6.10కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు. అదే విధంగా 990 యూఎస్ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే.

News April 2, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్

image

భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. హాకీ ఇండియా లీగ్‌లో మాత్రమే ఆడతానని తెలిపారు. మొత్తం 320 మ్యాచులు ఆడిన వందన 158 గోల్స్ చేశారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్ చేసిన భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. క్రీడా సేవలకు గుర్తుగా ఆమెను పద్మశ్రీ, అర్జున అవార్డులు వరించాయి.

News April 2, 2025

చలాన్లు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు?

image

చలాన్ల రికవరీని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక చలాన్‌ను 3 నెలలలోపు చెల్లించకపోతే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు చలాన్లు పడినవారి లైసెన్స్‌ను కనీసం 3 నెలలపాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తారని సమాచారం.

News April 2, 2025

రాష్ట్రంలోనే క్లీన్ ఎయిర్ సిటీగా కడప

image

AP: రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ 10 పీఎం స్థాయిలో 42 పాయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో ఉండగా కర్నూలు, ఒంగోలు (56 ) మూడో స్థానంలో నిలిచాయి. అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం (120) నిలిచింది. అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు లేకపోయినా కాలుష్యం 71 పాయింట్లుగా నమోదైంది.

News April 2, 2025

IPL: హ్యాట్రిక్‌పై కన్నేసిన RCB

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ఆర్సీబీ-జీటీ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆర్సీబీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కేకేఆర్, సీఎస్కేను వారి సొంత మైదానాల్లో ఓడించిన ఉత్సాహంలో జీటీపై కూడా విజయం సాధించాలని పాటీదార్ సేన భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కూడా ఆర్సీబీని తన సొంతగడ్డపైనే ఓడించాలని యోచిస్తోంది.