India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

APలో టెన్త్ పరీక్షలు ముగిశాయి. మార్చి 17న తెలుగు పరీక్షతో ప్రారంభమైన పరీక్షలు ఇవాళ సోషల్ స్టడీస్‌తో ముగిశాయి. 6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.17 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత పలు దఫాల పరిశీలన అనంతరం మే రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.

ENG మహిళా క్రికెటర్లు నాట్ స్కివర్ బ్రంట్, క్యాథరిన్ స్కివర్ బ్రంట్ మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు థియోడోర్ మైకేల్ స్కివర్ బ్రంట్ అని పేరు పెట్టినట్లు నాట్ ఇన్‌స్టాలో వెల్లడించారు. నాట్, క్యాథరిన్ 2022లో వివాహం చేసుకున్నారు. తమ చివరి పేరును స్కివర్ బ్రంట్‌గా మార్చుకున్నారు. వీరు రెసిప్రోకల్ IVF విధానంలో పేరెంట్స్ అయినట్లు తెలుస్తోంది. నాట్ WPLలో MIకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

I.N.D.I అలయెన్స్ పార్టీలన్నీ కలిసి వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘వక్ఫ్ సవరణ బిల్లుపై మేం తొలినుంచీ వ్యతిరేక వైఖరితోనే ఉన్నాం. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం. కచ్చితంగా వ్యతిరేకిస్తాం. మా కూటమి పార్టీలన్నీ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా మాతో కలిసిరావాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

లక్నోలో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో LSG ఇన్నింగ్స్ ముగిసింది. లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. పూరన్(30 బంతుల్లో 44), బదోనీ (33 బంతుల్లో 41), సమద్ (12 బంతుల్లో 27) రాణించారు. PBKS బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు ఫెర్గ్యూసన్, మ్కాక్స్‌వెల్, జాన్సెన్, చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు. లక్నో కెప్టెన్ పంత్(5 బంతుల్లో 2) మళ్లీ నిరాశపరిచారు.

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువును APR 15 వరకు కేంద్రం పొడిగించింది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలలోపు ఉండాలి. దీని ద్వారా దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఏడాది ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద రూ.6000 ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <

AP: వైద్యవృత్తి విలువలు నేడు పలుచబడ్డాయని వైద్యమంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వైద్యుల్ని ప్రజలు దేవుళ్లుగా చూస్తారు. కానీ నేడు వైద్యం వ్యాపారంగా మారింది. అవసరం లేని పరీక్షల్ని చేయిస్తున్నారు. సహజ ప్రసవాల్ని తగ్గించేశారు. రోగుల్ని వైద్యులు చిరునవ్వుతో పలకరించాలి. నైతిక విలువల్ని పాటించాలి’ అని సూచించారు.

AP: మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. గుండె ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారని చెప్పారు. ఆయన ఆరోగ్యం విషమించిందంటూ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు సూచించారు. కొడాలి నాని, వంశీ ధైర్యాన్ని కోల్పోయే నేతలు కాదన్నారు. త్వరలోనే వారిద్దరూ క్షేమంగా తిరిగొచ్చి టీడీపీని ఎదిరిస్తారని స్పష్టం చేశారు.

కర్ణాటకలో డీజీల్ ధరలు పెరగనున్నాయి. డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం 21.7% శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటరు డీజీల్ ధర ₹2 పెరిగి ₹91.02కి చేరుకోనుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే బెంగళూరులో ఇవాళ్టి నుంచి చెత్త పన్ను కూడా వసూలు చేయనుంది. నివాస భవనాల విస్తీర్ణాన్ని బట్టి నెలకు ₹10 నుంచి ₹400 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

FY2025లో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరినట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. FY24తో(రూ.21,083 కోట్లు) పోలిస్తే 12.04 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. ఈ విజయంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50వేల కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిఫెన్స్ రంగంలో ఇది గర్వించదగ్గ మైలురాయి అని PM కొనియాడారు.

AP: SC, ST, BC, ఆదివాసీ గిరిజనుల(PVTG) వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్నవాటి నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘మారిన ఖర్చుకు తగిన విధంగా ఎస్సీలకు రూ.50వేలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నాం’ అని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.