India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎంఎస్ ధోనీని మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రశంసలతో ముంచెత్తారు. ‘ధోనీ, సీఎస్కే భారత్‌లో ఎక్కడ ఆడినా ఆ స్టేడియం పసుపుతో నిండిపోతుంది. ఐపీఎల్‌లో ధోనీ రేంజ్ అలాంటిది. ఆయన ఏ స్థానంలో ఆడారన్నది ఎవరికీ అక్కర్లేదు. 11వ స్థానంలో వచ్చినా ఆయన ఆట చూస్తే చాలు అని ఫ్యాన్స్ భావిస్తుంటారు’ అని పేర్కొన్నారు. ధోనీ ఈ సీజన్లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

IPL మ్యాచులను ఇంట్లోనే టీవీల్లో 4Kలో ఉచితంగా వీక్షించే సదుపాయాన్ని జియో అందించింది. జియో ఓల్డ్ & న్యూ కస్టమర్లు రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్‌తో 4Kలో TV/ మొబైల్‌లో 90 రోజులు ఉచితంగా జియో హాట్‌స్టార్ చూడొచ్చు. అలాగే 50 రోజులు ఉచిత jio fiber కనెక్షన్ పొందొచ్చు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 15 వరకు రీచార్జ్ చేసిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మిగిలిన వారు RS.100తో యాడ్ ఆన్ ప్యాక్ రీచార్జ్ చేసుకోవాలి.

AP: తల్లికి వందనం పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 లోపు ఆ పథకం కింద రూ.15వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. పిల్లలను ఇంకా కనాలని, వాళ్లకూ పథకాలు అందుతాయని చెప్పారు. ఇక ప్రతి మహిళకు నగదు, ఉచిత బస్సు పథకాలు అమలు చేయాల్సి ఉందన్నారు. కానీ ఖజానాలో డబ్బులు లేవని, అన్నీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అత్యధిక పెన్షన్లు ఏపీలోనే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద(47) చనిపోయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన ప్రాణత్యాగం చేశారని చెప్పారు. అయితే కేసుల నుంచి తప్పించుకోవడంతో పాటు ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడం కోసం నిత్యానంద ఈ వదంతులు వ్యాప్తి చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

దేశీయ స్టాక్ మార్కెట్స్‌లో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 1428 పాయింట్లు కోల్పోయి 75,986 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 372Pts నష్టంతో 23,147 వద్ద కొనసాగుతోంది. IT, రియాల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు పతనమయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. రేపు క్వశ్చన్ అవర్ పూర్తైన తర్వాత బిల్లు చర్చకు వస్తుందన్నారు. 8 గంటల పాటు చర్చించేందుకు నిర్ణయించామని, అవసరమైతే సమయం పెంచుతామని తెలిపారు. బిల్లు గురించి వివరిస్తూ దాని ప్రయోజనాలను వెల్లడించారు. మతపరమైన సంస్థల్లో బిల్లు ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.

కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చేటని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పానీయాల్లో అధికంగా ఉండే సుక్రోజ్‌తో శరీరానికి ప్రమాదమేనని ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వెల్లడయింది. అధిక శాతం సుక్రోజ్ ఉండే పానీయాలతో మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. దీంతోపాటు జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

AP: ఏప్రిల్ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామన్నారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. అన్నదాత-సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తామని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీలో కంటే తక్కువ పెన్షన్ ఇస్తున్నారని అన్నారు.

మన స్కూల్ డేస్‌లో ఏప్రిల్ 1 వస్తుందంటే ఎవరిని ఎలా ఫూల్ చేయాలా అని ప్లాన్ చేసేవాళ్లం. ఇక ఆ రోజు.. గోడమీద బల్లి, నీ డ్రెస్‌పై ఏదో పడింది, మీ వాళ్లు వస్తున్నారు, నిన్ను పిలుస్తున్నారు.. అని ఆ ఏజ్‌లో మనలోని చాణక్య చతురతతో అవతలి వారిని నమ్మించి ‘ఏప్రిల్ ఫూల్..’ అని ఆనందించాం. ఇప్పుడు నిజ జీవితంలో కొందరి చేతిలో ఫూల్ అవుతున్నాం.. అది వేరే అనుకోండి. ఫూల్స్ డేతో మీకున్న మెమోరీస్, ఫీలింగ్స్ కామెంట్ చేయండి.

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.69.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్లలో నవ్వులు.. థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు’ అని రాసుకొచ్చింది. MADకు సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Sorry, no posts matched your criteria.