India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: నేటి నుంచి విజయ, సంగం పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ఆయా డెయిరీలు తెలిపాయి. పాల ఉత్పత్తి తగ్గడం, ప్యాకింగ్, ఇతర ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. విజయ గోల్డ్ పాల ధర ప్రస్తుతం లీటర్ రూ.74 ఉండగా రూ.76 కానుంది. అలాగే టోన్డ్ మిల్క్ పెరుగు ప్యాకెట్ (900 గ్రాములు) రూ.62 నుంచి రూ.64కు పెరగనుంది. నెలవారీ పాలకార్డు ఉన్న వారికి ఈ నెల 8 వరకు పాత ధరలే వర్తిస్తాయని తెలిపింది.

రంజాన్ మరుసటి రోజైన ఇవాళ TG ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. ప్రైవేటు ఆఫీస్‌లు తెరుచుకోనున్నాయి. APలో ఇవాళ ఆప్షనల్ హాలిడే(ఐచ్ఛిక సెలవు) ఇచ్చారు. టెన్త్ సోషల్ ఎగ్జామ్ యథావిధిగా జరగనుంది. ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. స్కూళ్లు కొనసాగడంపై స్థానిక DEOలు నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు తీసుకునే ఆప్షన్ ఉంది.

AP: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు క్లాసులు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి. సెకండియర్ విద్యార్థులకు నేటి నుంచే క్లాసులు జరగనుండగా ఈనెల 7 నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఎంబైపీసీ అనే కొత్త కోర్సును కూడా ప్రవేశపెడుతున్నారు.

AP: వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.

NSE (నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్) లోని 2,710 కంపెనీల మార్కెట్ విలువ రూ.410.87 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది మార్చి 31 నాటికి ఎన్ఎస్ఈ విలువ రూ.384.2 లక్షల కోట్లుగా ఉంది. అలాగే గత నెల 28నాటికి NSEలో ఇన్వెస్టర్ల సంఖ్య 11.3 కోట్లుగా ఉంది. వీరిలో ఏపీ నుంచి 51 లక్షలు, టీజీ నుంచి 27 లక్షల మంది ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 3 సంస్థలు ఐపీఓలకు వచ్చి రూ.6,283 కోట్లు సమీకరించాయి.

హీరో నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన IND చిత్రాల్లో బుక్‌మై షో పబ్లిక్ రేటింగ్ 9.5 సాధించిన మూవీగా నిలిచింది. రూ.10 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అలాగే USలో మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శిని, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు.

TG: హైదరాబాద్‌లో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయనతోపాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా విందులో పాల్గొన్నారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం’ అని సీఎం పేర్కొన్నారు.

తమ దేశానికి చెందిన నౌకలపై దాడులు ఆపాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను హెచ్చరించారు. లేదంటే మీతోపాటు ఇరాన్‌కు కూడా నొప్పి అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ నౌకలపై దాడులు ఆపేవరకూ హూతీలపై దాడులు ఆపమని స్పష్టం చేశారు. ఇరాన్ కూడా హూతీలకు తక్షణమే మద్దతు ఆపాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు 300 సార్లకుపైగా USకు చెందిన నౌకలపై దాడులు చేశారు

IPLలో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నోలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆడిన తొలి మ్యాచులోనే పంజాబ్ ఘన విజయం సాధించి జోరు మీద ఉంది. ఈ మ్యాచులో కూడా గెలిచి 2 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది. మరోవైపు లక్నో తొలి మ్యాచులో ఓటమిపాలైనా, రెండో మ్యాచులో SRHపై గెలిచింది. ఇదే జోరులో పంజాబ్‌ను ఓడించాలని యోచిస్తోంది.

AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Sorry, no posts matched your criteria.