India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

WWE సూపర్‌స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గతంలో తాను స్కిన్ క్యాన్సర్ బారినపడ్డట్లు వెల్లడించారు. ‘ఒకసారి డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు నా స్కిన్ కింది నుంచి క్యాన్సర్ కణుతులను తొలగించారు. WWE మ్యాచ్‌ల సందర్భంగా నా శరీరంపై మీరు ఆ స్పాట్స్‌ను చూడొచ్చు. మహమ్మారిపై పోరాడే సందర్భంలో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

AP: రాష్ట్రంలో రేపు 26, ఎల్లుండి 28 మండలాల్లో <

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై బోణీ కొట్టింది. KKRపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్(13) నిరాశపర్చగా, రికెల్టన్ 62*, జాక్స్ 16, సూర్య 27* రన్స్ చేశారు. రస్సెల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటర్లంతా విఫలమవడంతో KKR 16.2 ఓవర్లలోనే ఆలౌటైంది. MI బౌలర్లలో కుమార్ 4, చాహర్ 2, బౌల్ట్, హార్దిక్, పుతుర్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.

AP: తిరుమలలో మద్యం, మాంసం వినియోగం, అనుచిత ప్రవర్తన ఘటనలు పెరిగిపోయాయని YCP విమర్శించింది. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ పరిస్థితి దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘JAN 18న తమిళనాడు భక్తులు కొండపై ఎగ్ బిర్యానీ తిన్నారు. మార్చి 15న మద్యం మత్తులో యువకులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. మార్చి 17న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ మద్యం తీసుకెళ్లాడు’ అని పేర్కొంది.

సోషల్ మీడియాలో స్టూడియో ghibli ఫొటోల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ చాట్ జీపీటీ లేదా గ్రోక్ వంటి ఏఐల ద్వారా ఫొటోల్ని అప్‌లోడ్ చేసి ఘిబ్లీ స్టైల్లోకి మార్చుకుంటున్నారు. ఇది చాలా రిస్క్ అంటున్నారు సైబర్ నిపుణులు. ‘మనం ఇష్టపూర్వకంగానే అప్‌లోడ్ చేస్తాం కాబట్టి యాప్‌లు ముఖ కవళికల్ని భద్రపరుచుకుంటాయి. దీని వల్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు కచ్చితంగా భంగం వాటిల్లుతుంది’ అని వివరిస్తున్నారు.

సన్‌రైజర్స్ జట్టుతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ‘మాకు కేటాయించిన వాటికి మించి అదనపు పాసుల్ని ఎప్పుడూ అడగలేదు. అసోసియేషన్ పరువుకు భంగం కలిగించే పద్ధతి మంచిది కాదు. మ్యాచ్‌లను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే మౌనం పాటిస్తున్నాం. ఏదేమైనా సన్‌రైజర్స్ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపాయి.

వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి ముందే బీజేపీ సీనియర్ నేతలు ఇండీ కూటమి నేతలతో సమావేశమై చర్చించొచ్చని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి. ఆలోపుగా ఉభయ సభలూ ఆమోదిస్తేనే బిల్లు చట్టరూపం దాల్చుతుంది.

AP: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఉక్కుశాఖ అధికారులు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటన, బ్లాస్ట్ ఫర్నేస్ తదితర అంశాలపై చర్చించారు. ఉక్కు కర్మాగారానికి, ప్రజలకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం అన్నారు. దానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని సూచించారు. ఫ్యాక్టరీకి SPFతో భద్రత కల్పిస్తామన్న సీఎంకు శ్రీనివాసవర్మ ధన్యవాదాలు తెలిపారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. పాకిస్థాన్ వరల్డ్ అలయెన్స్(PWA) ఈ నామినేషన్ వేసింది. పాక్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల రక్షణలో ఆయన ఎనలేని సేవ చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడింది. గతంలో భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేసినందుకు గాను ఇమ్రాన్ ఖాన్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తూ పాక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్ పాక్ జైల్లో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.