India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పాసుల కోసం SRH యాజమాన్యాన్ని HCA <<15934651>>వేధింపులకు<<>> గురిచేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వివరాలను సేకరించిన ఆయన దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తమదేనని TGIIC <<15947111>>ప్రకటించడాన్ని<<>> హెచ్‌సీయూ ఖండించింది. 2024 జులైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, పరిశీలన మాత్రమే చేశారని పేర్కొంది. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని తెలిపింది. ఈ ప్రాంతంలోని పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వర్సిటీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం ఉండాలంది.

ప్రపంచవ్యాప్తంగా తమ మద్దతుదారులందరూ ఆయుధాల్ని చేపట్టాలని హమాస్ పిలుపునిచ్చింది. గాజాలో ఉన్న 20లక్షల పైచిలుకు ప్రజల్ని అక్కడి నుంచి బయటికి తరలించాలన్న ట్రంప్ ప్రణాళికను భగ్నం చేయాలని పేర్కొంది. ‘ఓ వైపు ఊచకోత, మరోవైపు ఆకలితో గాజా పౌరుల్ని చంపాలని ట్రంప్ ప్లాన్ వేస్తున్నారు. రాయి నుంచి బాంబు దాకా ఏదైనా చేతపట్టండి. ఈ కుట్రను అడ్డుకోండి’ అని స్పష్టం చేసింది.

మీరట్‌లో ఓ భర్తను <<15809063>>భార్య ముక్కలు చేసి డ్రమ్‌లో వేసిన <<>>సంగతి తెలిసిందే. తననూ అలాగే చంపుతానని భార్య బెదిరిస్తోందంటూ UPలో ధర్మేంద్ర అనే భర్త పోలీసుల్ని ఆశ్రయించారు. ‘నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రశ్నించానని నన్ను కొడుతోంది. చంపేస్తాంటోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆరోపణల్ని భార్య ఖండించారు. భర్త తన చెల్లెలిపై కన్నేశారని, ఆమెతో పెళ్లి కోసం తనపై నిందలు వేస్తున్నారని ఎదురు ఆరోపించారు.

AP: శ్రీసత్యసాయి(D) రాప్తాడులో YCP కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను మాజీ సీఎం జగన్ ఖండించారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు BC కార్యకర్తను TDP నేతలు పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు కూటమి నేతలతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

‘ఎక్స్’ అధినేత మస్క్‌కు ఆయన సొంత AI టూల్ ‘గ్రోక్’ షాకిచ్చింది. అత్యధికంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేది మస్కేనని తేల్చిచెప్పింది. ‘200మిలియన్ ఫాలోవర్ల కారణంగా మస్క్ ఏం చెప్పినా భారీ రీచ్ ఉండటమే నా జవాబుకు కారణం. నా సమాధానాన్ని మార్చేందుకు ఆయన సంస్థ ప్రయత్నించింది. ఒకవేళ నన్ను గానీ ఆపేస్తే అది AI స్వేచ్ఛపై కార్పొరేట్ శక్తులకున్న నియంత్రణపై చర్చకు దారితీస్తుంది’ అని పేర్కొంది.

ప్రస్తుత క్రికెట్లో భారత పేసర్ బుమ్రా బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమని పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తెలిపారు. ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న అతడు ‘నేను క్రికెట్ మొదలు పెట్టినప్పుడు AUS పేసర్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆడాలంటే భయపడేవాడిని. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని బుమ్రా భర్తీ చేశారు. అతడిని ఎదుర్కోవడం కఠినమైన సవాల్’ అని వెల్లడించారు. ఇక తన దృష్టిలో ఆర్చర్ బౌలింగ్ కఠినమైనదని ఫఖర్ జమాన్ చెప్పారు.

APలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లుండి కనిగిరిలో CBG తొలి యూనిట్‌కు అనంత్ అంబానీ, లోకేశ్ శంకుస్థాన చేస్తారన్నారు. త్వరలో మార్కాపురం, గిద్దలూరు, దర్శిలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూమికి రూ.31వేల కౌలు అందిస్తామని పేర్కొన్నారు.

AP: దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. విశాఖలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని చెప్పారు. త్వరలోనే భారీ పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇవాళ మధ్యాహ్నం 2.38 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని షియోమీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్ సహా భారత్‌లోని మేఘాలయ, కోల్‌కతా, ఢిల్లీలోనూ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.