news

News March 30, 2025

కొత్త రేషన్ కార్డుల్లో 30 లక్షల మంది: సీఎస్

image

TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్‌లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.

News March 30, 2025

ముంబై, చెన్నైల పని అయిపోయిందా?

image

IPLలో ఒక్క ట్రోఫీ గెలిస్తేనే గొప్ప. అలాంటిది ముంబై, చెన్నై ఐదేసి సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఇదంతా గతం. రోహిత్, ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దూరమయ్యాక ఈ రెండు ఫ్రాంచైజీల పరిస్థితి దారుణంగా తయారైంది. 200కు పైగా స్కోర్లను అలవోకగా ఛేదించే ఈ జట్లలో ఇప్పుడు గెలవాలన్న కసి కనిపించట్లేదు. మొన్న RCBపై చెన్నై, నిన్న GTపై ముంబై బ్యాటింగ్ చూసి.. ఆ జట్ల పని అయిపోయినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. COMMENT?

News March 30, 2025

నితీశ్ రాణా విధ్వంసం..

image

IPL-2025: చెన్నైతో జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ జైస్వాల్ (4) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా బౌండరీలతో వీరవిహారం చేస్తున్నారు. 22 బంతుల్లోనే 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 58* రన్స్ చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 6 ఓవర్లలో 79/1గా ఉంది.

News March 30, 2025

సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరు: CM రేవంత్

image

TG: సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ.11వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర తమదని చెప్పారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు.

News March 30, 2025

66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మ!

image

10మంది పిల్లలకు జన్మనివ్వడమంటేనే కష్టం. ఆ పదో బిడ్డను 66ఏళ్ల వయసులో ప్రసవిస్తే..? జర్మనీకి చెందిన ఆలెగ్జాండ్రా హెల్డెబ్రాండ్ ఇదే ఘనత సాధించారు. ఎటువంటి కృత్రిమ పద్ధతులూ లేకుండా ఆమె సహజంగానే తల్లి కావడం, ప్రసవించడం విశేషం. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారని బెర్లిన్‌లోని చారైట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అలెగ్జాండ్రా తొలి బిడ్డకు ఇప్పుడు 50 ఏళ్లు కావడం ఆసక్తికరం.

News March 30, 2025

కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని చెప్పి ఫామ్ హౌస్‌లో ఎకరాల కొద్దీ పండించారని అన్నారు. రూ.4,500కు క్వింటా చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. మూడేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే.. మూడేళ్లలోనే కూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కావాలనే శ్రీశైలం ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు.

News March 30, 2025

అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చా: పవన్

image

AP: కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పీ-4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు. ‘సాధారణ నాయకుడు రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడు. చంద్రబాబు లాంటి విజనరీ నేత వచ్చే తరం గురించి ఆలోచిస్తారు. పీ-4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయి. తెలుగు ప్రజలు బాగుండాలనేదే చంద్రబాబు, నా ఆకాంక్ష’ అని తెలిపారు.

News March 30, 2025

మా వల్లే తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం: సీఎం

image

AP: పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకే ఉగాది రోజు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పాతికేళ్ల క్రితం తెచ్చిన ఐటీ వల్ల రైతులు, కూలీల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మేం చేసిన అభివృద్ధి వల్ల తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం వస్తోంది. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నాం. నేను ఏ తప్పూ చేయలేదు. భవిష్యత్తులో చేయను’ అని స్పష్టం చేశారు.

News March 30, 2025

దొడ్డు బియ్యంతో రూ.10వేల కోట్ల దోపిడీ: రేవంత్

image

TG: 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ పథకాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. దానినే ఎన్టీఆర్ కొనసాగించారని హుజూర్ నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చెప్పారు. పేదలు అన్నం తినాలని గతంలో 90 పైసలకే బియ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దొడ్డు బియ్యంతో ఏటా రూ.10వేల కోట్ల దోపిడీ జరుగుతోందన్నారు. దీంతో మిల్లర్ల మాఫియా విస్తరిస్తోందన్నారు. పేదలు తినాలనే సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు.

News March 30, 2025

కోల్‌కతా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

image

కేకేఆర్ ఫ్యాన్స్‌కు ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్ గుడ్ న్యూస్ చెప్పారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా ఆడని సునీల్ నరైన్ కోలుకున్నారని ఆయన తెలిపారు. రేపు వాంఖడేలో ముంబైతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కాగా.. RRతో మ్యాచ్‌లో నరైన్ స్థానంలో ఆడిన మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు.