India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగారం ఆభరణాల మాదిరే వెండి నగలకూ హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని BISను కోరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అమలు సాధ్యాసాధ్యాలు, వినియోగదారులు, డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరినట్లు చెప్పారు. అవసరమైన చర్చల తర్వాతే ప్రక్రియ మొదలుపెడతామన్నారు. అటు 3-6 నెలల్లో ఈ విధానం అమలుకు సిద్ధంగా ఉన్నట్లు BIS డైరెక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు.
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి బయల్దేరారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసుల అనుమతితో బాలుడిని పరామర్శించేందుకు బన్నీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
USలో బర్డ్‌ఫ్లూ కారణంగా తొలిసారి ఓ మనిషి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. లూసియానాలో 65 ఏళ్ల వృద్ధుడు అడవి పక్షుల కారణంగా H5N1 వైరస్ సోకి ఆస్పత్రిలో చేరాడని, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. USలో ఇప్పటి వరకు 66 మందికి బర్డ్‌ఫ్లూ సోకింది. అయితే మనుషుల నుంచి మనుషుల్లో వ్యాప్తికి ఆధారాలు లభించలేదు. గతంలో బర్డ్‌ఫ్లూ సోకి మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయాడు.
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్‌కు 13-15ఏళ్లు ఉండాలి. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష విధానం, సిలబస్ కోసం <
సైట్: https://exams.nta.ac.in/AISSEE/
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మరోవైపు అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
TG: సంక్రాంతికి గాలి పటాలు ఎగురవేసేందుకు కాటన్ దారాలను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 040-23231440, 18004255364 టోల్ ఫ్రీ నంబర్లలో ఫిర్యాదు చేయాలన్నారు. చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా ఐదేళ్ల జైలు శిక్ష, ₹లక్ష వరకూ ఫైన్, మనుషులు, పక్షులకు హాని జరిగితే 3-5 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా ఉంటుందన్నారు. NGT ఆదేశాలతో TGలో చైనా మాంజా వాడటాన్ని నిషేధించామన్నారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 16కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 54,180 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.20కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
AP: పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో భార్యకు ఇస్తున్న పెన్షన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భర్త చనిపోయిన భార్యకే కాకుండా భార్య చనిపోయిన భర్తకూ వర్తింపజేయాలని కోరుతున్నారు. భార్య చనిపోయి ఇప్పటి వరకు పెన్షన్ రాని భర్తల్లో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. అటు, నవంబర్ 1- డిసెంబర్ 15 మధ్య 23K మంది చనిపోతే, స్పౌజ్ పెన్షన్లు 5K మందికే ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
TG: పలు డిమాండ్లతో గత కొన్ని రోజులుగా విధులను బహిష్కరించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. Dy.CM భట్టితో చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. విద్యాశాఖలో విలీనం, పే స్కేల్ అమలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ వంటివి అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు.
AP: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో రిటైర్డ్ ఎంప్లాయిస్, వారి భాగస్వామికి EHSలో వైద్య సదుపాయం ఉండేది. 2020లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక ఈ సదుపాయం లేకుండా పోయింది. దీనిపై ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
Sorry, no posts matched your criteria.