news

News March 25, 2025

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 8వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు తెలిపింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతోపాటు మరో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నెలకుపైగా విజయవాడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

News March 25, 2025

డీలిమిటేషన్‌పై TDP MLA కీలక వ్యాఖ్యలు

image

AP: డీలిమిటేషన్‌లో భాగంగా జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించాయని చెప్పారు. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఎన్డీఏ భాగస్వాములం కాబట్టి దీనిపై బహిరంగంగా మాట్లాడలేకపోతున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News March 25, 2025

కొలీజియాన్ని రద్దు చేసే NJAC అంటే ఏంటి…

image

జడ్జిల నియామక వ్యవస్థే కొలీజియం. ఇందులో CJI సహా కొందరు జడ్జిలు ఉంటారు. వీరు ఎంపిక చేసిన పేర్లనే కేంద్రం ఆమోదించాలి. దీంట్లో GOVT, MPల జోక్యం ఉండదు. 2014లో మోదీ ప్రభుత్వం NJAC (నేషనల్ జుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్) చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో CJI, ఇద్దరు జడ్జిలు, SC/ST, OBC నుంచి ఇద్దరు ప్రముఖులు (PM, LOP ఎంపిక చేస్తారు), న్యాయ మంత్రి ఉంటారు. NJAC రాజ్యాంగ విరుద్ధమని 2016లో SC కొట్టేసింది.

News March 25, 2025

భోజనం చేశాక ఇలా అనిపిస్తోందా?

image

కొందరికి భోజనం చేశాక పొట్టలో గడబిడగా ఉంటుంది. వేయించిన ఆహారం తీసుకున్నా, వేగంగా, పూర్తిగా నమలకుండా తీసుకున్నా కడుపులో ఉబ్బరం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని పట్టించుకోకపోతే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే కాకుండా 10 నిమిషాల తర్వాత వాకింగ్ చేయాలి. తిన్నాక డ్రింక్స్ తాగకూడదు. రాత్రి సమయంలో క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, వెల్లుల్లి, దుంపలు తీసుకోకూడదు.

News March 25, 2025

SLBC సొరంగం నుంచి మరో మృతదేహం వెలికితీత

image

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఈరోజు ఉదయం గుర్తించిన మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యూపీకి చెందిన ఇంజినీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మొత్తం 8మంది టన్నెల్‌లో చనిపోగా ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.

News March 25, 2025

నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం: రాజగోపాల్ రెడ్డి

image

TG: మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని, ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదని తెలిపారు. ‘సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించా. నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం’ అని పేర్కొన్నారు.

News March 25, 2025

క్రికెటర్ తమీమ్ ఆరోగ్యం ఎలా ఉందంటే?

image

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన డాక్టర్లతో మాట్లాడుతున్నారు. తమీమ్‌కు గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు దాదాపు 22 నిమిషాలపాటు CPR చేశారు. అనంతరం మూడుసార్లు DC షాక్ ఇచ్చారు. వెంటనే స్టెంట్లు అమర్చారు. దీంతో తమీమ్ మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాగా నిన్న ఓ మ్యాచ్ సందర్భంగా తమీమ్ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.

News March 25, 2025

Stock Markets: 800 పాయింట్లు పడ్డ సెన్సెక్స్

image

స్టాక్‌మార్కెట్లు మరోసారి ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయుల నుంచి కనిష్ఠానికి పడిపోయాయి. సెన్సెక్స్ 78,741 నుంచి మధ్యాహ్నం 800PTS మేర కుంగి 77,912 వద్ద కనిష్ఠాన్ని టచ్ చేసింది. ప్రస్తుతం 78,023 (47) వద్ద చలిస్తోంది. నిఫ్టీ 23,869 నుంచి 23,627కు పడిపోయింది. 23,687 (30) వద్ద ట్రేడవుతోంది. సూచీకి 23800 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్సీ ఉంది. ట్రంప్ టారిఫ్స్‌తో నెగటివ్ సెంటిమెంటు పెరిగింది.

News March 25, 2025

ఢిల్లీ గెలుపుపై కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

లక్నోపై విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత నిద్రలోంచి మేల్కొంటే పొందే అనుభవం అద్భుతం. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మ్యాచ్. ఢిల్లీ జట్టు పోరాడుతూనే ఉంటుంది. మన గోల్‌ను చేరుకునేందుకు బ్యాట్, బాల్, ఫీల్డ్‌లో మనం చాలా మెరుగుపరుచుకోవాలని నాకు తెలుసు. దయచేసి మాతో ప్రయాణాన్ని ఆస్వాదించండి’ అని కెవిన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

News March 25, 2025

జస్టిస్ వర్మ నగదు ఘటన: ఎంపీలతో ధన్‌ఖడ్ కీలక సమావేశం

image

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సాయంత్రం 4:30కు ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ‌ ఇంట్లో నగదు కాలిపోవడం, ఆయనపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అలాగే NJACని అమల్లోకి తీసుకురావడంపై చర్చిస్తారని సమాచారం. నిన్న BJP, కాంగ్రెస్ ప్రెసిడెంట్స్‌ జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేతో ధన్‌ఖడ్ ప్రత్యేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.