news

News March 25, 2025

ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలేను భారతరత్నతో సత్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా CM ఫడణవీస్ మాట్లాడుతూ ‘మహాత్మా బిరుదు దేశంలో అన్నింటికన్నా గొప్పది. దీనిని ప్రజలు ఫూలే, గాంధీకి మాత్రమే ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఫూలే దంపతులు 19వ శతాబ్దంలో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.

News March 25, 2025

నేడు, రేపు సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు CCLA ప్రారంభ ఉపన్యాసం, ఆ తర్వాత CS, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం కలెక్టర్ల సమావేశంపై సీఎం ప్రసంగిస్తారు. నేడు వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

News March 25, 2025

బండి సంజయ్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి: బీఆర్ఎస్

image

TG: మాజీ సీఎం, BRS అధినేత KCRపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సంజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అక్కడ ప్రింట్ చేసిన డబ్బునే ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారని BRS తన ఫిర్యాదులో పేర్కొంది.

News March 25, 2025

పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

image

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్‌లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

News March 25, 2025

BSNL యూజర్లకు అలర్ట్

image

కేవైసీ కంప్లీట్ చేయకపోతే 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని నోటీసులు వస్తే స్పందించవద్దని యూజర్లకు BSNL సూచించింది. ఇటీవల పలువురు యూజర్లకు ఇలాంటి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్కామర్లు KYC పేరిట యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News March 25, 2025

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదనిపించింది: ధోనీ

image

IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రూల్‌ను ప్రకటించినప్పుడు అవసరం లేదని అనిపించింది. టోర్నీ మంచి పొజిషన్‌లోనే ఉంది. TRP కూడా బాగుంది. అలాంటప్పుడు ఇంకా మసాలా యాడ్ చేయడమెందుకు అని అనుకున్నా. ప్రస్తుతం ఈ రూల్ నాకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే నేను బ్యాటింగ్‌, కీపింగ్ రెండూ చేస్తున్నా. టోర్నీలో హైస్కోర్లు నమోదవడానికి పిచ్ పరిస్థితులే కారణం. ఈ రూల్ కాదు’ అని పేర్కొన్నారు.

News March 25, 2025

నేను క్షమాపణ చెప్పను: కునాల్ కమ్రా

image

మహారాష్ట్ర Dy.CM ఏక్‌నాథ్ షిండేపై తాను చేసిన వ్యాఖ్యలను కమెడియన్ <<15868229>>కునాల్ కమ్రా<<>> సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పబోనని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ హక్కు అనేది శక్తివంతమైన వారిని ప్రశంసించడానికి మాత్రమే కాదు. రాజకీయ నేతలపై వ్యంగ్యంగా మాట్లాడడం చట్టవిరుద్ధం కాదు. షిండే గురించి అజిత్ పవార్ ఏం అన్నారో అదే నేనూ చెప్పాను. అయినా పోలీసులు, కోర్టుకు సహకరిస్తాను’ అని పేర్కొన్నారు.

News March 25, 2025

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. భారత్‌కు షాక్?

image

US అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెనెజువెలా నుంచి చమురును కొనే దేశాలు ఇకపై తమతో చేసే ఏ వాణిజ్యంలోనైనా 25శాతం అదనపు సుంకం కట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆ దేశం అమెరికాకు శత్రుత్వం పాటిస్తోందని వివరించారు. వెనెజువెలా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం భారత్‌కు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది.

News March 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 25, 2025

మార్చి 25: చరిత్రలో ఈరోజు

image

1655: శని గ్రహ ఉపగ్రహం టైటాన్‌ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నారు
1914: అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ జననం (ఫొటోలో)
1931: స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు గణేష్ శంకర్ విద్యార్థి మరణం (ఫొటోలో)
1933: భారతీయ శాస్త్రవేత్త వసంత్ గోవారికర్ జననం
2001: నటుడు కన్నడ ప్రభాకర్ మరణం