news

News March 24, 2025

ఓటీటీలో అదరగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జీ5లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు 400M+ స్ట్రీమింగ్ మినట్స్ నమోదైనట్లు మేకర్స్ వెల్లడించారు. రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. థియేటర్లలో ₹300Crకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 1న OTTలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం. ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి హీరోయిన్లుగా నటించారు.

News March 24, 2025

ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ వర్సిటీ.. ఒప్పందం ఖరారు

image

AP: విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు జార్జియా నేషనల్ వర్సిటీ ముందుకొచ్చిందన్నారు. ₹1,300Cr పెట్టుబడి పెట్టనుందని, 500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం, GNU మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

News March 24, 2025

కాంగ్రెస్ అధిష్ఠానంతో రాష్ట్ర నేతల భేటీ

image

కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. మంత్రి వర్గ విస్తరణ, రిజర్వేషన్ల అంశం, డీలిమిటేషన్ వంటి అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది.

News March 24, 2025

21 బంతుల్లో హాఫ్ సెంచరీ

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ వీర విహారం చేశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. మరోవైపు పూరన్ సైతం ధాటిగా ఆడుతున్నారు. 7 ఓవర్లలో స్కోరు 89/1.

News March 24, 2025

రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి!

image

కొన్ని అలవాట్లు రాత్రి తిన్న తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ‘తిన్న తర్వాత ఓ 10 ని.లు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఓ 30 ని.లు పడుకోకుండా ఉంటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు. సోంపు లేదా వాము నమిలితే బాగా జీర్ణమై మలబద్ధకం తగ్గుతుంది. కొద్దిసేపు నిటారుగా కూర్చున్నా మంచిదే’ అని తెలిపారు.

News March 24, 2025

నాడు మోదీ చెప్పారు.. నేడు అమరావతిలోనూ అదే దోపిడీ: YCP

image

AP: అమరావతిలో రూ.27,159 కోట్ల విలువైన కాంట్రాక్టులను 3.94-4.34% అధిక ధరకు సొంత మనుషులకు CBN కేటాయించారని YCP ఆరోపించింది. ‘పోలవరాన్ని చంద్రబాబు ATM మాదిరి వాడుకుంటున్నారని మోదీ ఏ క్షణాన అన్నారో కానీ నేడు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అప్పు తెచ్చిన డబ్బంతా అమరావతిలో పోసి 59 ప్యాకేజీల పనులను తమవాళ్లకు ఇచ్చుకున్నారు. అందులో కమీషన్లు నొక్కుతూ చంద్రబాబు సంపన్నుడు అవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

News March 24, 2025

ఎలుక వల్ల భారీగా షేర్ల పతనం!

image

అద్భుతంగా రాణిస్తున్న కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయంటే ఆదాయం తగ్గడమో, ప్రపంచ మార్కెట్ ట్రెండ్లో కారణమని అనుకుంటాం. కానీ జపాన్‌కు చెందిన జెన్షో హోల్డింగ్స్ కో అనే రెస్టారెంట్ చెయిన్ షేర్ విలువ మాత్రం ఎలుక కారణంగా పడిపోయింది. ఆ సంస్థకు చెందిన ఓ శాఖలో కస్టమర్‌కి సూప్‌లో ఎలుక వచ్చింది. అతడి ఫిర్యాదుతో హోటల్‌లో పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కంపెనీ షేర్లు 7.1శాతం మేర పతనమయ్యాయి.

News March 24, 2025

పార్లమెంటులో ‘ఛావా’ చూడనున్న మోదీ, కేంద్ర మంత్రులు!

image

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం ‘ఛావా’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాను త్వరలో పార్లమెంటులో ప్రదర్శిస్తారని తెలిసింది. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారని సమాచారం. నటుడు విక్కీ కౌశల్, క్యాస్ట్ అండ్ క్రూ వస్తారని తెలుస్తోంది. స్క్రీనింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

News March 24, 2025

DCvsLSG: జట్లు ఇవే

image

DC: మెక్‌గర్క్, డు ప్లెసిస్, పోరెల్, సమీర్ రిజ్వీ, అక్షర్, స్టబ్స్, విప్రాజ్, స్టార్క్, కుల్‌దీప్, మోహిత్, ముకేశ్

LSG: మార్క్‌రమ్, మార్ష్, పంత్, పూరన్, బదోనీ, మిల్లర్, షాబాజ్, దిగ్వేశ్, శార్దూల్, బిష్ణోయీ, ప్రిన్స్

News March 24, 2025

రేవంత్‌వి దివాలాకోరు రాజకీయాలు: హరీశ్ రావు

image

TG: సీఎం రేవంత్ చిల్లర, దిగజారుడు, దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ గజ్వేల్‌ను తెలంగాణలో ఇతర పట్టణాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఆయన కృషితోనే మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలు వచ్చాయన్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో గజ్వేల్‌కు ఇచ్చిందేమీ లేదని దుయ్యబట్టారు. గజ్వేల్‌పై రేవంత్‌ది సవతి తల్లి ప్రేమ అని విమర్శించారు.