news

News March 24, 2025

విజయ్ ఆఖరి సినిమా రిలీజ్ డేట్ ఖరారు

image

రాజకీయాల్లోకి వెళ్లిన తమిళ నటుడు విజయ్ చేస్తున్న ఆఖరి సినిమా ‘జన నాయగన్’. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ ఈరోజు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయనున్నట్లు పేర్కొంది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి ఇది రీమేక్ అని సినీ వర్గాలంటున్నాయి.

News March 24, 2025

సుదూర రోదసిలో మరో భూమి?

image

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో నెదర్లాండ్స్‌ పరిశోధకులు సుదూర గెలాక్సీలో ఆక్సిజన్‌ను గుర్తించారు. 13.4 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆ నక్షత్ర సమూహాన్ని జేడీస్-జీఎస్-జెడ్14-0గా పిలుస్తున్నారు. 2024లో దాన్ని గుర్తించినట్లు వారు తాజాగా ప్రకటించారు. ఆక్సిజన్ ప్రాణవాయువు కాబట్టి అది ఉన్న చోట జీవం ఉంటుందనేది ఓ అంచనా. మరి ఆ గెలాక్సీలో మరో భూమి ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.

News March 24, 2025

పెట్టుబడి పెట్టాక ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే..

image

షేర్లలో ఇన్వెస్ట్ చేసేవారిలో కొందరికి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. కింది సూచనలు పాటిస్తే బెటరని నిపుణులు అంటున్నారు. * నిర్దేశించుకున్న టార్గెట్ చేరినప్పుడు * P/E, P/B రేషియోలు, DCF‌ను విశ్లేషించి ప్రాఫిట్ బుక్‌చేసుకోవడం * బుల్ మార్కెట్ ర్యాలీలో దశల వారీగా షేర్లు అమ్మేయడం * స్టాప్‌లాస్‌ను తాకినప్పుడు * షేర్లు అనుకున్న స్థాయిలో పెరగనప్పుడు * PF రీబ్యాలెన్సింగ్ కోసం * ఎకానమీ పరిస్థితిని బట్టి..

News March 24, 2025

రాహుల్ గాంధీ పౌరసత్వంపై నిర్ణయం తీసుకోండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం

image

కాంగ్రెస్ అగ్రనేత, LoP రాహుల్ గాంధీ పౌరసత్వంపై నిర్ణయం తీసుకొనేందుకు కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. కనీసం 8 వారాలైన ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. RGకి బ్రిటిష్ పౌరసత్వం ఉందంటూ కర్ణాటకు చెందిన ఒకరు ఇక్కడ పిటిషన్ వేశారు. విదేశీయుడైన ఆయనకు ప్రభుత్వ పదవులు చేపట్టే అధికారం లేదని ఆరోపించారు. BJP నేత సుబ్రహ్మణ్య స్వామి సైతం ఢిల్లీ కోర్టులో ఇలాంటి పిటిషనే వేయడం తెలిసిందే.

News March 24, 2025

సీఎం పుట్టినరోజున ‘చంద్రన్న నాటకోత్సవాలు’

image

AP: వచ్చే నెల 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని వారం పాటు ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనున్నట్లు ఏపీ నాటక అకాడమీ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 20-26 వరకు జరిగే వేడుకల్లో నాటికలు, పౌరాణిక/సాంఘిక నాటకాలు, పద్య నాటకాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది. ఆసక్తిగలవారు వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించే నాటక వివరాలను వెల్లడిస్తూ నాటక <>అకాడమీ చిరునామాకు<<>> పంపాలని కోరింది.

News March 24, 2025

రేపు 52 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో రేపు 52, ఎల్లుండి 88 మండలాల్లో <>వడగాలులు<<>> వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూ.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ALERT జారీ చేసింది. ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News March 24, 2025

ఆవు పాలు తాగడంతో మహిళకు రేబిస్.. మృతి

image

ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్ సోకి మృతి చెందిన ఘటన UP నోయిడాలో జరిగింది. దీనిపై ప్రముఖ వైద్యుడు సుధీర్ అవగాహన కల్పించారు. ‘నోయిడాలో వీధి కుక్క కరవడంతో ఆవుకు రేబిస్ సోకింది. దాని పచ్చి పాలు తాగడంతో మహిళ కూడా ఆ వ్యాధి బారిన పడింది. ఇలాంటి కేసు ఇదే తొలిసారి. రేబిస్ సోకిన ఆవు పచ్చి పాలు తాగితే టీకా వేసుకోవాలి. పచ్చి పాలు ఎప్పుడూ తీసుకోవద్దు. మరగబెట్టాక తాగడమే సురక్షితం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News March 24, 2025

చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది: పవన్

image

APలో తమిళ మీడియం పాఠశాలలు ఉండటం సంతోషమని BJP నేత తమిళి సై చేసిన ట్వీట్‌కు DyCM పవన్ స్పందించారు. ‘చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసింది. AP భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తోంది. తమిళంతో సహా వివిధ మాధ్యమాల్లో 1,610 పాఠశాలలను నిర్వహిస్తోంది. ఇతర భాషలను గౌరవిస్తూనే మన మాతృభాషను కాపాడుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News March 24, 2025

రాహుల్ గాంధీతో డేట్ చేయాలనుకున్నా: బాలీవుడ్ నటి

image

బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పడం కాంట్రవర్సీకి దారి తీయొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. తరచుగా RG ఫొటోలను చూసేదాన్నని పేర్కొన్నారు. తమ కుటుంబాల బ్యాగ్రౌండ్ అందరికీ తెలిసిందేనని చెప్పారు. కాగా 2012లో సైఫ్‌ను కరీనా పెళ్లి చేసుకున్నారు.

News March 24, 2025

SLBC సహాయక చర్యలపై సీఎం కీలక ఆదేశాలు

image

TG: ఎస్ఎల్‌బీసీ సహాయక చర్యలను కొనసాగించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెస్క్యూ నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికి తీసేలా చూడాలన్నారు. నిపుణుల కమిటీ సూచనలతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ఈ ఘటన జరిగి నెలరోజులు దాటగా ఏడుగురి మృతదేహాలు దొరకాల్సి ఉంది.