India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

MH డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేపై కమెడియన్ <<15866900>>కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు<<>> వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలపై ఏ మాత్రం చింతించడం లేదని ఆయన పోలీసులకు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు తనకు డబ్బులిచ్చి వ్యాఖ్యలు చేయించాయనే ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను సీఎం ఫడణవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు.

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవర’ మూవీ త్వరలోనే జపాన్‌లోనూ రిలీజ్ కానుంది. ఈ ప్రమోషన్లకు జపాన్ వెళ్లిన యంగ్ టైగర్ NTR తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. RRR సినిమా సమయంలోనూ ఆయన జపాన్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.

కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో అందరూ తనను పొగరుబోతు అనుకునేవారని ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ ఓ ఈవెంట్‌లో తెలిపారు. ‘‘ఏ సినిమా ఆఫర్ వచ్చినా ఆ స్క్రిప్ట్ మొత్తం కాపీ ఇవ్వమని అడిగేవాడిని. దీంతో నాకు ‘పొగరుబోతు’ అన్న ముద్ర వేశారు. నేను నటించబోయే సినిమా కథ ఏంటో, నా పాత్ర ఏంటో తెలియకుండా ప్రాజెక్ట్ ఎలా అంగీకరించగలను? అలాంటి సమయంలో నాకు హిట్ అందించిన ‘మొగ్గిన మనసు’ టీమ్‌ను ఎప్పటికీ మరచిపోలేను’’ అని తెలిపారు.

TG: ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటన యావత్ సమాజాన్ని కలిచివేసిందన్నారు. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోవడానికి సీఎం రేవంత్(హోంమంత్రి) చేతగాని పాలనే కారణమని మండిపడ్డారు.

AP: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిలు రూ.6,200 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇవాళ ఉ.11.30 గంటల నుంచి వారి ఖాతాల్లో GLI, GPF, CPS తదితర మొత్తాలను జమ చేస్తోంది. ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు క్రెడిట్ అవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. బకాయిల విడుదలకు CM చంద్రబాబు ఈ నెల 20న ఆదేశించారు. మరుసటి రోజే జమ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో కాస్త ఆలస్యమైంది.

GOLD ధర మున్ముందు మరింత పెరగొచ్చని వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ అంచనా వేశారు. ‘గ్లోబల్ ఎకానమీ అనిశ్చితిలో పడ్డ ప్రతిసారీ బంగారం ధర రికార్డు గరిష్ఠాలకు చేరడాన్ని మనం చూశాం. సురక్షితమైన పెట్టుబడిగా ఇది మరింత మెరవనుంది. ఔన్స్ $3000 దాటడంతో ఇంకా పెరుగుతుందని నిపుణుల అంచనా. భారత్ వద్ద ఇప్పటికే ఉన్న గోల్డ్ అసెట్స్‌ను రివైవ్, రీవైటలైజ్ చేయడానికి ఇదే సరైన టైమ్. అవకాశాన్ని వాడుకోవాలి’ అని అన్నారు.

CSK కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ కొనియాడారు. ‘రుతురాజ్ నన్ను అడిగితే తప్ప నేను సాయం చేయను. మైదానంలో ప్రతి నిర్ణయం అతడిదే. ఒకవేళ నేను ఏదైనా సలహా చెప్పినా అది కచ్చితంగా అనుసరించాలని అనుకోవద్దని తనకి ముందే చెప్పాను. కెప్టెన్‌గా రుతు ఉన్నా నిర్ణయాలు నేనే తీసుకుంటాననుకుంటారు చాలామంది. అందులో ఏమాత్రం నిజం లేదు’ అని స్పష్టం చేశారు.

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ గుంటూరులోని CID ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల బెయిల్ ఇచ్చిన సమయంలో సీఐడీ కేసుకు సంబంధించి వారంలో 2 రోజులు కార్యాలయానికి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. సోమ, గురువారం కార్యాలయంలో సంతకాలు చేయాలని పేర్కొన్న విషయం తెలిసిందే. CIDతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదై రిమాండులో ఉండగా, ఒక్కొక్కటిగా బెయిల్ రావడంతో పోసాని 2 రోజుల కిందట రిలీజ్ అయ్యారు.

ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘రాబిన్‌హుడ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. క్రికెటర్లు సినిమాల్లోకి రావడం కొత్తేమీ కాదు. తెరపై మెరిసిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అందులో బ్రెట్‌లీ- అన్ఇండియన్, పఠాన్ – కోబ్రా, యువరాజ్- పుట్ సరదారన్ దే, మెహందీ షగ్రా దిలలో బాలనటుడిగా, సచిన్ తన డాక్యుమెంటరీలో, కపిల్ దేవ్-83, అజయ్ జడేజా- ఖేల్, సునీల్ గవాస్కర్ – పదుల సినిమాల్లో నటించారు.

TG: గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరిపించాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే దిద్దించారని తెలిపారు. 3 భాషల్లో పరీక్ష జరిగితే ఒకే నిపుణుడితో మూల్యాంకనం చేయించడం వల్ల నాణ్యత కొరవడిందని చెప్పారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వాదనలు విన్న కోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని TGPSCకి నోటీసులిచ్చింది.
Sorry, no posts matched your criteria.