news

News March 24, 2025

కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

image

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో 5 అమలు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసిన ఈ సవాల్‌కు కేటీఆర్ సిద్ధమేనా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.

News March 24, 2025

అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట

image

ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల మహంతికి డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే స్టే విధించేందుకు క్యాట్ నిరాకరించడంతో మహంతి హైకోర్టు మెట్లెక్కారు.

News March 24, 2025

ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి: జగన్

image

AP: రైతుల విషయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని, తమ ప్రభుత్వంలో పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదని మాజీ CM జగన్ అన్నారు. నష్టపోయిన అరటి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కడప (D) లింగాలలో అరటి రైతులను <<15868939>>పరామర్శించిన<<>> ఆయన మాట్లాడుతూ.. ‘రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సొమ్ము ఇవ్వాలి. సాయం అందని వారిని మరో మూడేళ్లలో మేం అధికారంలోకి వచ్చి ఆదుకుంటాం’ అని తెలిపారు.

News March 24, 2025

మన టాలెంట్‌ను ఆస్కార్ గుర్తించలేదు: దీపిక

image

భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప చిత్రాలు తెరకెక్కినా ఆ కథలను, నటీనటుల ప్రతిభను ‘ఆస్కార్’ గుర్తించలేదని బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె అన్నారు. మనకు రావాల్సిన అవార్డులను కూడా లాగేసుకున్నారంటూ ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే RRRలోని నాటునాటు పాటకు అకాడమీ అవార్డు వచ్చినప్పుడు అక్కడే ఉన్న తాను ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు దీపిక చెప్పారు. ఆ క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేనని తెలిపారు.

News March 24, 2025

హోరెత్తిస్తున్న షేర్లు: రూ.5లక్షల కోట్ల లాభం

image

స్టాక్‌మార్కెట్లు దూకుడు మీదున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ దుమ్మురేపుతున్నాయి. MON మిడ్ సెషన్‌కు నిఫ్టీ 23,616 (+270), సెన్సెక్స్ 77,834 (+930) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.5లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, FIIs తిరిగి పెట్టుబడులు ఆరంభించడం, డాలర్‌తో రూపాయి బలపడుతుండటం, బ్యాంకింగ్ స్టాక్స్ జోరు, ఇన్వెస్టర్ల విశ్వాసం పెరగడమే ఇందుకు కారణాలు.

News March 24, 2025

మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఇటీవల రాష్ట్రంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

News March 24, 2025

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. త్వరలో ‘ది రాజాసాబ్’ టీజర్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రఫ్ కట్ వీడియోను ఇండస్ట్రీ మిత్రులకు మారుతి చూపించగా.. ఫ్రభాస్‌ను ఇలా ఎప్పుడూ చూడలేదని అందరూ చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్. డైలాగులు, ప్ర‌భాస్ లుక్‌ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తాయని సమాచారం. ఈ చిత్రం సర్‌ప్రైజింగ్ విజువల్ ట్రీట్ ఇవ్వనుందని సినీవర్గాలు తెలిపాయి.

News March 24, 2025

అరటి రైతులను పరామర్శించిన జగన్

image

AP: కడప జిల్లా లింగాల మండలంలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో మండలంలోని తాతిరెడ్డి పల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. మండలంలో 2,460 ఎకరాల్లో అరటి పంట నష్టపోయినట్లు ఉద్యానశాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి జగన్‌కు తెలిపారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 24, 2025

ఈవారం కొత్త సినిమాలు!

image

ఉగాది పండుగ వేళ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సినిమాలు సిద్ధమవుతున్నాయి.
థియేటర్ రిలీజ్: మార్చి 27న మోహన్‌లాల్ ‘ఎల్2 ఎంపురాన్’, విక్రమ్ ‘వీర ధీర శూర’. 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’. 30న సల్మాన్ ఖాన్ ‘సికందర్’.
ఓటీటీ: JIO హాట్‌స్టార్‌లో ‘ముఫాసా: ది లయన్ కింగ్(మార్చి 26), జీ5లో విడుదల పార్ట్-2(మార్చి 28), నెట్‌ఫ్లిక్స్‌లో మిలియన్ డాలర్ సీక్రెట్ (మార్చి 26).

News March 24, 2025

నేను సభకు రావొద్దని రాసివ్వండి: జగదీశ్ రెడ్డి

image

TG: ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సస్పెండ్ అయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వెళ్లగా సభలోకి రావొద్దని చీఫ్ మార్షల్ సూచించారు. దీంతో స్పీకర్ ఇచ్చిన బులెటిన్ చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సభకు రావొద్దని రాతపూర్వకంగా రాసివ్వాలన్నారు. లేకపోతే అక్కడే కూర్చొని నిరసన తెలుపుతానని చెప్పారు. మరోవైపు BRS ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వచ్చారు. రుణమాఫీ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.