news

News March 23, 2025

రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా?

image

ప్రస్తుత బిజీ జీవితంలో నిద్రాసమయం కుంచించుకుపోతోంది. ఎప్పుడు పడితే అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కానీ రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం శరీరానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే నిద్ర నాణ్యత కోల్పోవడమే కాకుండా జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. అలాగే నిద్రలేచిన వెంటనే అలసట, నీరసంగా ఉండి ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. రోగనిరోధకశక్తి బలహీనపడి అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.

News March 23, 2025

వర్ష బాధిత రైతులకు రేపు జగన్ పరామర్శ

image

AP: మాజీ సీఎం జగన్ రేపు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు చేతికొచ్చిన అరటి తోటలు నేలకొరిగాయి. ఈ క్రమంలో ఆయన వాటిని పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఈ రాత్రికి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అవుతారు. ఈ నెల 27న జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

News March 23, 2025

YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, HYD తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.

News March 23, 2025

మొబైల్ కొనేటప్పుడు ఇది చూస్తున్నారా?

image

ప్రస్తుతం ఫోన్ కొనేటప్పుడు అందరూ అంటుటు (anTuTu) స్కోర్ చూస్తున్నారు. ఫోన్ స్పీడ్, గ్రాఫిక్స్, ర్యామ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటివాటిని పరిశీలించి ఒక నంబర్ ఇస్తారు. దీనినే అంటుటు అంటారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫోన్ అంత పవర్‌ఫుల్ అని అర్థం. ఎలాంటి గేమ్స్ ఆడినా ఫోన్‌ హ్యాంగ్ కాదు. ప్రస్తుతం ఐకూ13 మొబైల్‌ 26,98,668 స్కోర్‌తో టాప్‌లో, రెడ్ మ్యాజిక్ 10 ప్రో ఫోన్ 26,66,229తో సెకండ్ ప్లేస్‌లో ఉంది.

News March 23, 2025

పంట నష్టం అంచనా వేయండి: అచ్చెన్న

image

AP: రాష్ట్రంలో కురిసిన వడగళ్ల వానపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించాలని, నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. అలాగే అన్నదాతలకు అందుబాటులో ఉంటూ తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.

News March 23, 2025

ఎప్పుడూ నైటీలో ఉండమంటున్నారు.. ఓ భార్య ఫిర్యాదు!

image

భర్త, అత్తమామలు తనను రోజంతా నైటీయే వేసుకుని ఉండాలని వేధిస్తున్నారంటూ అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ(21) పోలీసుల్ని ఆశ్రయించారు. 2023 మేలో పెళ్లైందని, అప్పటి నుంచీ అత్తింటి కుటుంబం వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త మద్యానికి బానిసై హింసిస్తున్నారని, అతడికి అత్తామామలు అండగా ఉన్నారని తెలిపారు. కలిసుండేందుకు తాను ప్రయత్నించినా భర్త వదిలేశారని, అతడి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News March 23, 2025

కష్టాల్లో ముంబై.. 6 వికెట్లు డౌన్

image

IPL-2025: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 13వ ఓవర్ ముగిసే సరికి 6వికెట్లు కోల్పోవడంతో రన్‌రేట్ నెమ్మదిగా సాగుతోంది. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు ముంబై కష్టపడుతోంది. నూర్ 3, ఖలీల్ 2 వికెట్లు తీశారు. రోహిత్(0), రికెల్టన్(13), జాక్స్(11), సూర్య(29), తిలక్ వర్మ(31), రాబిన్(3) ఔటయ్యారు. 13 ఓవర్లకు MI స్కోర్ 96/6గా ఉంది.

News March 23, 2025

ముంబై టీమ్‌లో సత్యనారాయణ రాజు.. ఎవరితను?

image

IPLలో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చారు. ముంబై టీమ్‌ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని MI రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ ఏ క్రికెట్‌లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశారు.

News March 23, 2025

రాష్ట్రంలో 8 మంది మృతి

image

TG: రాష్ట్రంలో జరిగిన పలు ఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట (D) బీబీగూడెం వద్ద కారు-బస్సు ఢీకొన్నాయి. ఘటనలో కారులోని భార్యాభర్త, పాప(8), మరొకరు చనిపోయారు. మృతుల్లో రవి, రేణుక, రితికను గుర్తించారు. అలాగే, హనుమకొండ- కరీంనగర్ NHపై హసన్‌పర్తి పెద్దచెరువు వద్ద టూవీలర్ను టిప్పర్ ఢీకొట్టగా పవన్, మహేశ్ మృతిచెందారు. నల్గొండ (D) ఏపూరులో ఈతకు వెళ్లి నవీన్(23), రాఘవేంద్ర(20) నీటమునిగి చనిపోయారు.

News March 23, 2025

రోహిత్ డకౌట్

image

IPL-2025: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై‌కు తొలి ఓవర్లో‌నే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యారు. ఖలీల్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ ఫీల్డర్‌ శివమ్ దూబేకు ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో రికెల్టన్, విల్ జాక్స్ ఉన్నారు.