news

News March 23, 2025

వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం: సోము వీర్రాజు

image

AP: 60 సీట్లు వచ్చినప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్లలేదని, ఇప్పుడు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలంటున్నారని BJP MLC సోము వీర్రాజు విమర్శించారు. YCPని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమని, ఆ పార్టీకి 20% ఓట్లు కూడా రాకుండా చేస్తామని పేర్కొన్నారు. జగన్‌కు మళ్లీ అధికారమిస్తే అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మాట్లాడుతూ కార్మిక సంఘాల నాయకుల వల్లే అది నష్టపోయిందని ఆరోపించారు.

News March 23, 2025

SRHvsRR: జట్లు ఇవే

image

SRH: హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, అనికేత్, కమిన్స్, సిమర్‌జీత్, హర్షల్, షమీ

RR: జైస్వాల్, రాణా, జురెల్, పరాగ్, హెట్‌మెయిర్, శుభమ్ దూబే, జోఫ్రా, తీక్షణ, సందీప్, తుషార్ దేశ్‌పాండే, ఫరూఖీ

News March 23, 2025

SRHvRR: టాస్ గెలిచిన RR

image

ఉప్పల్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో SRH ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

News March 23, 2025

త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి: సత్యకుమార్ యాదవ్

image

AP: బలభద్రపురం క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘<<15850475>>బలభద్రపురం<<>>లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ వెళ్లి వైద్యులు సర్వే చేస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నాం. త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తూ.గో జిల్లా బిక్కవోలు(M) బలభద్రపురంలో 200 మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.

News March 23, 2025

ఉప్పల్‌లో IPL మ్యాచ్.. జాగ్రత్త బ్రో!

image

HYDలోని ఉప్పల్ వేదికగా ఇవాళ IPL జట్లు SRH, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. అయితే స్టేడియంలో ఆకతాయిల పని పట్టేందుకు ‘షీ టీమ్స్’ మఫ్టీలో మహిళల రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అమ్మాయిలను ఇబ్బంది పెడితే తాటతీసేలా చర్యలు ఉండనున్నాయి. మరోవైపు 2,700 మంది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. IPL స్కోర్ అప్‌డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.

News March 23, 2025

క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

image

క్రెడిట్ కార్డుల వాడకం ఇటీవల ఎక్కువైంది. అయితే చెల్లింపుల ఊబిలో చిక్కుకున్నవారు కార్డు క్లోజ్ చేస్తుంటారు. అది మంచిది కాదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడమనేది మన ఆర్థిక పరిస్థితి బాలేదనే విషయాన్ని సూచిస్తుంది. దాంతో సిబిల్ స్కోర్‌ తగ్గే అవకాశముంది. ఒకవేళ కార్డు నిలిపేయడం తప్పనిసరైతే మరో క్రెడిట్ కార్డు తీసుకున్నాక దీన్ని క్లోజ్ చేసుకోవడం బెటర్’ అని వివరిస్తున్నారు.

News March 23, 2025

ప్రాక్టీస్ ఫొటోలు షేర్ చేసిన SRH

image

ఈ సీజన్‌లో SRH తొలి మ్యాచ్ మరో మూడు గంటల్లో మొదలు కాబోతోంది. రాజస్థాన్‌పై గెలిచి హోంగ్రౌండ్ తొలి మ్యాచ్‌తోనే ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇవ్వాలని ప్లేయర్స్ కసరత్తు చేస్తున్నారు. టీమ్ ప్రాక్టీస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన SRH మేనేజ్మెంట్.. ప్రతి ఒక్కరిలో, ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆటగాళ్ల దృఢ సంకల్పం కన్పిస్తోందని కామెంట్ చేసింది. అటు స్టేడియానికి ఫ్యాన్స్ తాకిడి మొదలవగా ఉప్పల్ పరిసరాల్లో కోలాహలంగా ఉంది.

News March 23, 2025

వచ్చే నెలలో ముహూర్తాల జాతర

image

ఏప్రిల్ నెలలో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదు. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు మూఢాలు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరగనున్నాయి.

News March 23, 2025

వీల్‌ఛైర్‌లో ఉన్నా నాతో క్రికెట్ ఆడిస్తారు: ధోనీ

image

తాను నడవలేని స్థితిలో వీల్‌ఛైర్‌లో ఉన్నా సీఎస్కే ఫ్రాంచైజీ లాక్కెళ్లి క్రికెట్ ఆడిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ అన్నారు. తాను ఆడాలనుకున్నంత కాలం ఆడతానని స్పష్టం చేశారు. CSK ఫ్రాంచైజీ అంటే తనదేననే ఫీల్ వస్తుందన్నారు. కాగా 43 ఏళ్ల ధోనీ ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్కేకి ఆడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ముంబైతో జరగనున్న మ్యాచులో ఆయన బరిలోకి దిగనున్నారు.

News March 23, 2025

ఆ సామర్థ్యం భారత్ సొంతం: జైశంకర్

image

ఇంధన శక్తి విషయంలో భారత్ విభిన్న విస్తృతమైన బంధాల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అభిప్రాయపడ్డారు. ‘మనది ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. మన అవసరాలకు తగిన విధంగా బంధాలుండాలి. ఏకకాలంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్‌తో, అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్‌తో, అటు పశ్చిమ దేశాలు ఇటు దక్షిణార్ధ దేశాలతో, అటు బ్రిక్స్ ఇటు క్వాడ్‌తో చర్చలు జరపగల సామర్థ్యం మన సొంతం’ అని పేర్కొన్నారు.