news

News March 22, 2025

GDP గ్రోత్: భారత్, చైనా భళా.. EU కంట్రీస్ డీలా

image

ఎకానమీ పరంగా ఆసియా దేశాలైన భారత్, చైనా రికార్డులు సృష్టిస్తుంటే ఐరోపా కంట్రీస్ డీలా పడ్డాయి. 2015-2025 మధ్యన అంటే దశాబ్ద కాలంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ GDP వృద్ధిరేటు 6 నుంచి 14 శాతమే పెరగడం గమనార్హం. జన సంక్షోభం ఎదుర్కొంటున్న జపాన్‌దీ ఇదే పరిస్థితి. కొవిడ్, అనిశ్చితి, యుద్ధాలు, ట్రేడ్‌వార్స్ ఇందుకు కారణాలు. టాప్10 ఎకానమీస్‌లో బ్రెజిల్ అత్యల్పంగా 8% వృద్ధిరేటుతో $2.1T నుంచి $2.3Tకు చేరుకుంది.

News March 22, 2025

కనీసం పోస్టర్‌పై కూడా పేరు వేయరు: పూజా హెగ్డే

image

ఇండస్ట్రీలో నటీమణులపై ఓ రకమైన వివక్ష ఉందని హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా పోస్టర్‌లో కూడా హీరోయిన్ల పేర్లు వేయరని అసహనం వ్యక్తం చేశారు. ‘షూటింగ్‌లో సెట్ పక్కనే హీరో కారవాన్ ఉంటుంది. మిగతా అందరివీ దూరంగా ఉంచుతారు. ఒక్కోసారి భారీ లెహెంగాలు, బరువైన దుస్తులు ధరించి వాటి వరకూ నడుచుకుంటూ వెళ్లాలి. మళ్లీ ఈడ్చుకుంటూ అక్కడికి రావాలి’ అని చెప్పుకొచ్చారు.

News March 22, 2025

డీలిమిటేషన్‌పై HYDలో బహిరంగ సభ: రేవంత్

image

TG: డీలిమిటేషన్‌పై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ మోసం చేస్తోంది. సొంత ఎజెండాతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. డీలిమిటేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. దీనిపై త్వరలోనే HYDలో బహిరంగ సభ ఉంటుంది. ఇది దక్షిణాది పార్టీల సమస్య కాదు ప్రజల సమస్య. స్టాలిన్‌తో కలసి పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తాం. అన్ని రాష్ట్రాలను కలుపుకుని ముందుకెళ్తాం’ అని చెన్నైలో మీడియాతో పేర్కొన్నారు.

News March 22, 2025

టెన్త్ పేపర్ లీక్: ఇద్దరు ఆఫీసర్ల సస్పెన్షన్

image

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని SLBC బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన అధికారులపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. అలాగే పేపర్ లీకేజీకి సహకరించిన విద్యార్థినిని కూడా డిబార్ చేసింది. కాగా నిన్న తెలుగు ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

News March 22, 2025

విరాట్ మంచోడు.. కానీ అది మైదానంలో దిగనంతవరకే: సాల్ట్

image

విరాట్ కోహ్లీపై ఆయన ఆర్సీబీ టీమ్ మేట్ ఫిల్ సాల్ట్ ప్రశంసలు కురిపించారు. ‘విరాట్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉంటారు. కానీ అది మైదానంలో దిగనంతవరకే. గ్రౌండ్‌లో ఆయన తీవ్రత వేరే స్థాయిలో ఉంటుంది. యుద్ధాన్ని కోరుకుంటారు. ఈ సీజన్లో ఆయనతో కలిసి బ్యాటింగ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. సాల్ట్ గత సీజన్‌లో కేకేఆర్‌కు ఆడారు.

News March 22, 2025

జనరేటర్లు పనిచేయకే ఎయిర్‌పోర్టు మూసివేత!

image

లండన్‌లోని <<15833839>>Heathrow<<>> ఎయిర్‌పోర్టులో బ్యాకప్ పవర్ లైన్ పనితీరుపై చర్చ జరుగుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు మేనేజ్మెంట్ ఇక్కడ డీజిల్ జనరేటర్లను బయోమాస్ జనరేటర్లతో రిప్లేస్ చేసింది. పవర్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌ తగలబడటంతో ఎయిర్‌పోర్టు నిన్నంతా మూతబడింది. దాంతో 1300 విమానాలు, 2లక్షలకు పైగా ప్రయాణికులపై ప్రభావం పడింది. ఎమర్జెన్సీ టైమ్‌లో బయో జనరేటర్లు పనిచేయలేదన్న వార్తలు విమర్శలకు దారితీశాయి.

News March 22, 2025

BREAKING: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

image

TG: ఏపీలో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని BRS అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తాము సింగిల్‌గానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. కార్యకర్తలంతా ఒక్కో కేసీఆర్‌లా తయారవ్వాలి. మోదీ నా మెడపై కత్తిపెట్టినా నేను రాష్ట్రం కోసం వెనకడుగు వేయలేదు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే’ అని పేర్కొన్నారు.

News March 22, 2025

వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు

image

కేంద్ర ప్రభుత్వం 2025కు గాను జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ప్రఖ్యాత హిందీ రచయిత, కవి వినోద్ కుమార్ శుక్లా రచించిన ‘నౌకర్ కీ కమీజ్’ నవలను ఇందుకు ఎంపిక చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆయన 50 ఏళ్లుగా సాహిత్య సేవ చేస్తున్నారు.

News March 22, 2025

చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీరిలీజ్!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘నాయక్’ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా ‘నాయక్’ రీరిలీజ్‌పై అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తెరకెక్కించారు. ఈ చిత్రం 2013లో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.

News March 22, 2025

విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

image

AP: విశాఖ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా కూటమి నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో YCPకి షాక్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. GVMCలో 98 స్థానాలుండగా, YCP 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీల్లో చేరడంతో YCP బలం పడిపోయింది. మేయర్‌కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.