news

News March 22, 2025

నేటి నుంచి కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

AP: రాష్ట్రంలో KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏప్రిల్ 11వరకు <>ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు<<>> స్వీకరిస్తున్నారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ పరిధిలోని బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు.

News March 22, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గి సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. కాగా, రెండు రోజుల్లోనే వెండీ ధర ఏకంగా రూ.4100 తగ్గడం విశేషం.

News March 22, 2025

సైబర్ నేరగాళ్లకూ టార్గెట్.. ఛేదించకపోతే నరకమే!

image

ఉద్యోగాల కోసం ఏజెంట్ ద్వారా మయన్మార్, థాయ్‌లాండ్‌కు వెళ్లి సైబర్ ముఠా వలలో చిక్కుకున్న 589 మంది భారతీయులను కేంద్రం రక్షించింది. సైబర్ క్రైమ్స్ చేయడమే ఆ ఉద్యోగమని తెలియక అక్కడికి వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘వీసా లాక్కుంటారు. టార్గెట్స్ చేరుకోకపోతే ఎండలో 4కి.మీలు పరిగెత్తిస్తారు. పుష్‌అప్స్ చేయిస్తారు. పాడైపోయిన బాతు గుడ్లు తినిపిస్తారు’ అని తెలంగాణకు చెందిన ఓ బాధితుడు BBCతో చెప్పారు.

News March 22, 2025

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాయలసీమలో, కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు నిన్న రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6 డిగ్రీలు నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో వడగాలులు వీచాయి.

News March 22, 2025

వ్యోమగాములకు నా సొంత డబ్బు చెల్లిస్తా: ట్రంప్

image

8రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్‌మోర్ 9 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఆ అదనపు కాలానికి వారిద్దరికీ రోజుకు చెరో 5 డాలర్ల చొప్పున 286 రోజులకు 1430 డాలర్ల వేతనాన్ని నాసా ఇవ్వకపోవడంపై ట్రంప్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ విషయం తనకు తెలియదని తెలిపారు. అవసరమైతే తన సొంత డబ్బునే వారికి జీతాలుగా ఇస్తానని స్పష్టం చేశారు.

News March 22, 2025

నేడు ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు

image

తెలంగాణలో వర్షాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. నిన్న కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది.

News March 22, 2025

ట్రంప్ ఎఫెక్ట్..5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు

image

USAలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన దాదాపు 5.30 లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు. వచ్చే నెల 24తో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుంది. యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు.

News March 22, 2025

ఎంపురాన్ కోసం హీరో, డైరెక్టర్ కీలక నిర్ణయం

image

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘L2:ఎంపురాన్’. <<15821261>>ట్రైలర్‌తోనే<<>> ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కోసం తాను, మోహన్ లాల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఆ మొత్తాన్ని మూవీ క్వాలిటీ కోసం వెచ్చించినట్లు చెప్పారు. మలయాళ సినీ పరిశ్రమ చిన్నదైనా టాప్ టైర్ ప్రొడక్షన్ క్వాలిటీతో సినిమాలు చేస్తున్నామన్నారు.

News March 22, 2025

నిన్న నైట్ ఏం చేశారు డ్యూడ్..?

image

ఎప్పట్లాగే AP, తెలంగాణలో నిన్న సాయంత్రం తర్వాత అంతా ఇళ్లకు చేరారు. అనంతరం APలో చూస్తే ఉదయం నుంచి బయట వేడికి తోడు రాత్రి ఇంట్లో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి. ఇక తెలంగాణలో కొన్ని చోట్ల వర్షం, రాత్రి, కరెంట్ కట్ కాంబోగా కలిసొచ్చాయి. ఇక హైదరాబాద్‌లో మిడ్‌నైడ్ భీకర ఉరుములు, మెరుపులతో వర్షం. సీన్ కట్ చేస్తే.. కరెంట్ కట్. భిన్న కారణాలతో AP, TGలో కామన్ మ్యాన్‌కు కామన్‌గా కునుకు లేదు. మీకు ఎలా ఉంది? కామెంట్!

News March 22, 2025

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకోగా 26,821 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు సమకూరింది.