news

News March 21, 2025

RCB ఆఖరి స్థానానికే పరిమితం: గిల్‌క్రిస్ట్

image

ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఈసారి అట్టడుగున నిలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ జోస్యం చెప్పారు. ఆ జట్టంటే తనకేమీ ద్వేషం లేదని, కోహ్లీకి కూడా తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. ‘ఆర్సీబీలో ఇంగ్లండ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. వారి వల్ల ఆ జట్టుకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అందుకే టేబుల్‌లో పదో స్థానంలో నిలిచే అర్హతలు ఈ జట్టుకే ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News March 21, 2025

రేపు కర్ణాటక బంద్.. విద్యార్థుల్లో ఆందోళన

image

గత నెలలో బెళగావిలో RTC బస్సు కండక్టర్‌పై మరాఠీ అనుకూలవాదులు చేసిన దాడికి నిరసనగా కర్ణాటకలో కన్నడ సంఘాలు రేపు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 వరకు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోనున్నాయి. ఓవైపు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితేంటంటూ విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక వెళ్లే తెలుగురాష్ట్రాలవారు ప్రయాణం వాయిదా వేసుకోవడమే మంచిది.

News March 21, 2025

చెన్నైలో రోడ్డుకు రవిచంద్రన్ అశ్విన్ పేరు?

image

మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరును చెన్నైలో ఓ రోడ్డుకు పెట్టే అవకాశం ఉంది. అశ్విన్ స్వగృహం ఉన్న వెస్ట్ మాంబళంలోని రామకృష్ణాపురం ఫస్ట్ స్ట్రీట్‌కు తన పేరును పెట్టే ప్రతిపాదనను ఆయన సంస్థ ‘క్యారమ్ బాల్ ఈవెంట్ అండ్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కు సమర్పించింది. కాగా.. ఈ ఏడాది IPLలో CSKకు ఆడనున్న అశ్విన్, సీజన్ ముగిశాక IPL నుంచి రిటైరవ్వొచ్చని సమాచారం.

News March 21, 2025

ఉగాది రోజున ‘స్పిరిట్’ స్టార్ట్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోయే ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, రెగ్యులర్ షూటింగ్‌కు కాస్త టైమ్ పట్టే అవకాశం ఉంది.

News March 21, 2025

రాష్ట్రంలో భానుడి భగభగలు

image

AP: రాష్ట్రంలో ఇవాళ ఎండలు మండిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. కర్నూలు జిల్లా కోసిగిలో 40.6, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. మరోవైపు రేపు 18 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది.

News March 21, 2025

సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం లైంగిక హింస కాదు: హైకోర్టు

image

సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం, పాటలు పాడటం లైంగిక హింస కిందకు రాదని బాంబే హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. తన జుట్టు గురించి ఓ సహోద్యోగి కామెంట్స్ చేస్తూ పాటలు పాడారని.. మహిళల ఎదుట పురుషుల మర్మావయాల గురించి మాట్లాడారని పుణేలోని HDFC బ్యాంకు ఉద్యోగిని తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. అతడిని బ్యాంకు డిమోట్ చేయగా ఆయన పారిశ్రామిక కోర్టుకెళ్లారు. అక్కడ చుక్కెదురవ్వడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

News March 21, 2025

ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్టార్ బ్యాటర్ దూరం?

image

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గైర్హాజరవనున్నట్లు సమాచారం. భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆయన జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సభ్యుడైన మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ ఈ విషయాన్ని తెలిపారు. గత సీజన్లో LSG కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ను ఢిల్లీ రూ.14 కోట్లకు వేలంలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.

News March 21, 2025

వారి నవ్వు చూసి నాకు సంతోషం కలిగింది: నాగబాబు

image

AP: శాసనసభ కల్చరల్ ఈవెంట్‌లో CM చంద్రబాబు, Dy.CM పవన్ నవ్వడం చూసి తనకు సంతోషం వేసిందని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ‘ఆ రోజు అసెంబ్లీలో గౌరవనీయులైన చంద్రబాబుకు జరిగిన అవమానానికి ఆయన కన్నీరు పెట్టడం ఎంతో బాధించింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతున్న దృశ్యం ఆహ్లాదంగా అనిపించింది. పని ఒత్తిడిలో పవన్ కూడా నవ్వడం చూసి సంతోషం వేసింది’ అని ట్వీట్ చేశారు.

News March 21, 2025

తెలుగు కామెంటేటర్స్ సిద్ధం.. మీ ఫేవరెట్ ఎవరు?

image

స్టేడియంలో ప్లేయర్లు తమ ఆటతో అలరిస్తే, కామెంటేటర్లు తమ మాటలతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ ప్యానల్‌ను సిద్ధం చేసింది. గతంలో ‘ఉప్పల్‌లో కొడితే.. తుప్పల్లో పడింది’ అనే డైలాగ్ తెగ వైరలైంది. ఈ ప్యానల్‌లో రాయుడు, MSK ప్రసాద్, శ్రీధర్, హనుమ విహారి, సుమన్, ఆశిశ్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, అక్షత్ రెడ్డి, శశి, కళ్యాణ్, కౌశిక్, హేమంత్, నందు ఉన్నారు.

News March 21, 2025

VIRAL: ప్లీజ్.. ఇది OYO కాదు.. క్యాబ్!!

image

బెంగళూరులో ఓ డ్రైవర్ తన క్యాబ్‌లో పెట్టిన పోస్టర్ వైరల్ అవుతోంది. ‘హెచ్చరిక.. రొమాన్స్‌కు అనుమతి లేదు. ఇది క్యాబ్, ఓయో కాదు..’ అని అతడు రాసుకొచ్చాడు. దీంతో తన క్యాబ్‌లో ఎన్నిసార్లు జంటల పనులతో విసిగి ఇలా చేశాడో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.