news

News March 21, 2025

IPLలోకి ఎంట్రీ ఇస్తోన్న కేన్ మామ

image

ఐపీఎల్ 2025లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఓపెనింగ్ గేమ్ ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచుకు ఆయన ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరించనున్నారు. కాగా మెగా వేలంలో విలియమ్సన్‌ అన్‌సోల్డ్‌గా మిగిలారు. రూ.2 కోట్ల కనీస ధరతో ఆయనను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. మరోవైపు PSL డ్రాఫ్ట్‌లోనూ కేన్ మామను ఎవరూ పట్టించుకోలేదు.

News March 21, 2025

BREAKING: పోసానికి బెయిల్ మంజూరు

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో సినీనటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. CID కేసులో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. త్వరలో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పోసాని 5 కేసుల్లో అరెస్ట్ అవగా అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది.

News March 21, 2025

నంది అవార్డులను పునరుద్ధరించాలి: నిర్మాతల మండలి

image

APలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని నిర్మాతల మండలి తెలిపింది. విశాఖ, రాజమండ్రి, తిరుపతిలో స్టూడియోలు నిర్మించాలని, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరామంది. నంది అవార్డులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రులు లోకేశ్, దుర్గేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

News March 21, 2025

ఎన్నాళ్లకెన్నాళ్లకో ఈ మురిపెం!

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. ఈ వారం వరుసగా 5 సెషన్లలోనూ అదరగొట్టాయి. కొన్ని నెలల తర్వాత బెంచ్‌మార్క్ సూచీలు ఒక వారమంతా లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది నవంబర్ నాటి పుల్‌బ్యాక్ ర్యాలీలో చివరిసారిగా ఈ ఫీట్ నమోదైంది. NOV 29 నుంచి DEC 5 వరకు సూచీలు వరుసగా ఎగిశాయి. నిఫ్టీ ప్రస్తుత 23,300 స్థాయిలో కన్సాలిడేట్ అయితే మార్కెట్ వర్గాల్లో పాజిటివ్ సెంటిమెంటు మరింత బలపడుతుంది.

News March 21, 2025

‘యానిమల్’ లుక్‌లో ధోనీ.. భారీ రెమ్యునరేషన్!

image

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కిన ఈ-సైకిల్ <<15801433>>యాడ్<<>> భారీ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ యాడ్ కోసం వీరిద్దరూ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ యాడ్ షూట్‌కు ధోనీ రూ.8 కోట్లు తీసుకున్నారని, సందీప్ రూ.5 కోట్లు పొందినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ యాడ్‌పై ఆ సైకిల్ కంపెనీ సీఈవో కునాల్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

News March 21, 2025

వివేకా హత్య కేసు.. రోజువారీ విచారణ కోరుతూ సునీత పిటిషన్

image

వివేకా హత్య కేసు విచారణపై ఆయన కుమార్తె సునీత TG హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. CBI కోర్టులో రోజూ విచారణ జరిగేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. 15 నెలలుగా విచారణ జరగడం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. అభియోగ పత్రాల కాపీలను హార్డ్ డిస్క్‌లో సీబీఐ సమర్పించిందని, అయితే అవి ఓపెన్ కావట్లేదంటూ నిందితులు చెబుతున్నారని పేర్కొన్నారు.

News March 21, 2025

కశ్మీర్‌లో ఆ రోజులు పోయాయి: అమిత్ షా

image

కశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గిపోయి, పరిస్థితులు మారిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆ రాష్ట్రంలోని సినిమా హాళ్లన్నీ నిండిపోతున్నాయని చెప్పారు. ‘యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులకు సానుభూతిగా ఎలాంటి ఆందోళనలు చేయడం లేదు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయి. మేం కశ్మీర్‌ను విజయవంతంగా భారత్‌లో విలీనం చేశాం’ అని పేర్కొన్నారు.

News March 21, 2025

GST: 12% శ్లాబ్‌రేట్ రద్దుకోసం రంగంలోకి నిర్మల

image

GSTలో 12% శ్లాబ్‌రేటు ఎత్తివేతపై ఏర్పాటైన ఆరుగురు సభ్యుల మంత్రుల బృందంతో FM నిర్మలా సీతారామన్ సమావేశం అవుతారని తెలిసింది. పన్ను వ్యవస్థను సింప్లిఫై చేసేందుకు ఈ శ్లాబును రద్దు చేయాలని ప్రయత్నిస్తున్న కేంద్రం GoMను నియమించింది. వీరిలో కొందరు దీనికి మద్దతు ఇస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఏకగ్రీవ నిర్ణయం కోసం నిర్మల వీరితో చర్చించనున్నారు. 12% శ్లాబ్ ద్వారా GOVTకి 5% ఆదాయమే వస్తోంది.

News March 21, 2025

Stock Markets: మీడియా, PSE షేర్ల దూకుడు

image

స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 23,350 (+159), సెన్సెక్స్ 76,905 (+557) వద్ద ముగిశాయి. మీడియా, PSE, చమురు, CPSE, ఎనర్జీ, PSU బ్యాంకు, హెల్త్‌కేర్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, ఇన్ఫ్రా, కమోడిటీస్, ఫైనాన్స్, బ్యాంకు, రియాల్టి, ఆటో షేర్లు అదరగొట్టాయి. మెటల్, వినియోగ షేర్లు ఎరుపెక్కాయి. SBI లైఫ్, ONGC, NTPC, BPCL, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్. ట్రెంట్, ఇన్ఫీ, విప్రో, హిందాల్కో టాప్ లూజర్స్.

News March 21, 2025

ఇక రచ్చే.. రేపే IPL ప్రారంభం

image

ధనాధన్ క్రికెట్ సంబరానికి సర్వం సిద్ధమైంది. రేపు IPL 18వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో KKR, RCB పోటీ పడనున్నాయి. మండు వేసవిలో రెండు నెలలపాటు సిక్సర్లు, ఫోర్ల వర్షంలో తడిసి మురిసేందుకు అభిమానులు రెడీ అయ్యారు. వారిని ఏ మాత్రం నిరాశపర్చకుండా పైసా వసూల్ వినోదాన్ని అందించేందుకు ఆటగాళ్లు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లను వీక్షించవచ్చు.