news

News March 21, 2025

జస్టిస్ వర్మపై అభిశంసనకు సిద్ధంగా కేంద్రం?

image

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు చర్యలను బట్టి నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఆయనపై అత్యున్నత న్యాయస్థానం అంతర్గత విచారణకు ఆదేశించింది. ఢిల్లీ నుంచి తిరిగి పాత చోటికే బదిలీ చేసింది. ఈ నిర్ణయాలను అలహాబాద్ సహా అనేక బార్ అసోసియేషన్స్ వ్యతిరేకించాయి. కొలీజియం వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి.

News March 21, 2025

ఔరంగజేబు సమాధిని కూల్చే అవకాశం ఉందా?

image

మహారాష్ట్ర ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కార్‌కు దానిని కూల్చే అధికారం ఉందా అనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా దీనిని కూల్చే హక్కు రాష్ట్రానికి లేదు. పురాతన స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, అవశేషాల చట్టం, 1958 కింద దీనికి ASI రక్షణ కల్పిస్తోంది. ఇటువంటి స్థలాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా డీ-నోటిఫై చేసే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంది.

News March 21, 2025

నిమిషానికి ప్రభుత్వ అప్పు రూ.కోటి: ఏలేటి

image

TG: రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై ₹2.27L రుణభారం ఉందని BJP శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. TG అప్పు ₹8.6L Crకు చేరిందని ఆరోపించారు. ప్రభుత్వం నిమిషానికి ₹కోటి అప్పు చేస్తోందని, ఇలా రుణాలు పెరిగితే అభివృద్ధి ఎలా సాధ్యమని బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. UPA హయాంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 32% ఉంటే ఇప్పుడు 42% అందుతోందని, అయినా కేంద్రాన్ని విమర్శించడం సరికాదన్నారు.

News March 21, 2025

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో నిలిచిన లారీ.. 5KMల ట్రాఫిక్ జామ్

image

AP: శ్రీశైలం ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఇసుక లారీ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తుమ్మలబైలు నుంచి శ్రీశైలం వరకు 5 కి.మీ మేర బస్సులు, కార్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.

News March 21, 2025

ఆ రోడ్లకు టోల్ విధించే ఆలోచన లేదు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వాటికి చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని అసెంబ్లీలో దుయ్యబట్టారు.

News March 21, 2025

ఢిల్లీలో పెట్రోల్‌తో నడిచే బైక్స్‌కు నో రిజిస్ట్రేషన్?

image

ఢిల్లీలో గాలి నాణ్యతను పెంపొందించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పెట్రోల్‌‌తో నడిచే బైక్& స్కూటీలను నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 ఆగస్టు నుంచి ఎలక్ట్రిక్ బైక్స్‌కు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేలా ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0’ తీసుకొస్తారని సమాచారం. అలాగే, ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇంధనంతో నడిచే త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ కూడా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.

News March 21, 2025

హామీలకు మంగళం అన్న BRS.. Tకాంగ్రెస్ సెటైర్లు

image

తెలంగాణ రాజకీయం సోషల్ మీడియా వేదికగా రసవత్తరంగా మారుతోంది. ‘ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు సీఎం రేవంత్ మంగళం పాడారు. బడ్జెట్‌లో ఒక్క హామీకి కూడా నిధులు కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వం’ అని బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌కు టీకాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ‘కచరా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ.. ఇక్కడ తాజాగా ఫేక్ న్యూస్‌లు తయారు చేయబడును’ అని కేటీఆర్ కార్టూన్‌ను షేర్ చేసింది. దీనిపై మీ కామెంట్?

News March 21, 2025

యశ్వంత్ వర్మపై విచారణకు సుప్రీం ఆదేశం

image

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15834106>>యశ్వంత్ వర్మ<<>> ఇంట్లో భారీగా నగదు బయటపడిన వ్యవహారంపై సుప్రీం కోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. హైకోర్టు సీజే నుంచి నివేదిక కోరింది. వర్మ నివాసంలో రూ.50కోట్ల వరకు నగదు బయటపడినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ డబ్బంతా ఎవరిదన్న కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. కాగా వర్మపై ఇప్పటికే బదిలీ వేటు పడింది.

News March 21, 2025

IPL కామెంటేటర్‌గా ఇండియన్ అంపైర్

image

భారత్‌కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక నుంచి కామెంటేటర్‌గా కొనసాగనున్నారు. ఢిల్లీకి చెందిన ఆయన 2013-2025 వరకు 12 టెస్టులు, 49 ODIs, 64 T20s, 131 IPL, 91 ఫస్ట్ క్లాస్, 114 లిస్ట్-A మ్యాచులకు అంపైరింగ్ చేశారు. ఇలా అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్‌గా చేసి ఫుల్ టైమ్ కామెంటేటర్‌గా మారిన తొలి భారత అంపైర్‌గా నిలిచారు. ఇప్పుడు IPLలో హర్యాన్వి, హిందీలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

News March 21, 2025

76 ఏళ్ల వయసులో తల్లయిన మహిళ

image

ఇథియోపియా దేశంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మెకెల్లే ప్రాంతానికి చెందిన మెధిన్ హాగోస్ అనే మహిళ 76 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చారు. తాను సహజ పద్ధతిలోనే గర్భం దాల్చినట్లు ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా, ఇంత లేటు వయసులో సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాకపోవచ్చని పలువురు నెటిజన్లు అంటున్నారు. IVF విధానంలో ప్రెగ్నెంట్ అయ్యుంటారని కామెంట్స్ చేస్తున్నారు.