India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఇంట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు. శనివారం ఉదయం HYDలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య నేతలు సంతాపం తెలిపారు.

రేపు ఐపీఎల్-2025 ప్రారంభం కానుండగా పలు జట్లలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. బౌలర్ మోహ్సిన్ ఖాన్ స్థానంలో ఆయనను తీసుకున్నట్లు తెలిపాయి. సీఎస్కే, కేకేఆర్ వంటి జట్లకు ఆడిన శార్దూల్ వేలంలో అమ్ముడుపోలేదు. తర్వాత జరిగిన దేశవాళి టోర్నీల్లో సత్తా చాటారు.

‘బలగం’ డైరెక్టర్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటించే అవకాశాలున్నాయి. తాజాగా ఆమెకు డైరెక్టర్ స్టోరీ చెప్పినట్లు సమాచారం. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. తొలుత సాయిపల్లవిని తీసుకోవాలనుకున్నారని, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్, అనుపమ, కయాదు లోహర్ నటించిన ‘డ్రాగన్’ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ధనుశ్ దర్శకుడిగా తెరకెక్కించిన జాబిలమ్మ నీకు అంత కోపమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

స్టాక్‌మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లోనూ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,266 (+78), సెన్సెక్స్ 76,580 (+238) వద్ద చలిస్తున్నాయి. ఐటీ, వినియోగం మినహా అన్ని సెక్టోరల్ సూచీలు ఎగిశాయి. రియాల్టి, హెల్త్‌కేర్, PSE, ఫార్మా, CPSE, మీడియా, ఎనర్జీ, చమురు, ఆటో, కమోడిటీస్ షేర్లకు డిమాండ్ ఉంది. బజాజ్ ఫైనాన్స్, హీరోమోటో, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, నెస్లే టాప్ గెయినర్స్. ఇన్ఫీ, HDFC బ్యాంకు, టైటాన్ టాప్ లూజర్స్.

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని KTR డిమాండ్ చేశారు. ‘తమిళనాడులో ఈ స్కీమ్‌ను అమలు చేయడం వల్ల ఆస్పత్రిలో చేరే పిల్లల సంఖ్య 63.2% తగ్గింది. తీవ్ర అనారోగ్య సమస్యలు 70.6% తగ్గాయి. విద్యార్థుల అభ్యాసం మెరుగుపడింది. ఈ ఫలితాలను చూసి BRS ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది’ అని ట్వీట్ చేశారు.

విద్యార్థినులపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న UPలోని హథ్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ రజినీష్ కుమార్ పోలీసులకు దొరికాడు. మార్కులు వేస్తానని, ఉద్యోగాల పేరుతో అమ్మాయిలపై కొన్నేళ్లుగా అత్యాచారం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. లైంగిక దాడి దృశ్యాలు రికార్డ్ చేయడానికి అతను కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నాడన్నారు. నిందితుడికి 1996లో పెళ్లైనా పిల్లలు లేరని తెలిపారు.

బ్యాడ్మింటన్ టోర్నీ స్విస్ ఓపెన్ 2025లో భారత షట్లర్ శంకర్ ముత్తుస్వామి సంచలనం నమోదు చేశారు. వరల్డ్ నం.2 ర్యాంకర్ అండర్స్ ఆంటోన్సన్‌పై విజయం సాధించారు. 18-21, 21-12, 21-5 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.

ద్రోణి ప్రభావంతో TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, MNCL, ఉమ్మడి కరీంనగర్, BHPLతో పాటు మరికొన్ని చోట్ల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, YSR, నంద్యాల, ప్రకాశం, పల్నాడులో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

ప్రముఖ కన్నడ దర్శకుడు AT రఘు(76) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీశ్‌తో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. 55 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన తొలి చిత్రం ‘న్యాయ నీతి ధర్మ’.
Sorry, no posts matched your criteria.