news

News April 14, 2025

అంబేడ్కర్ జయంతి వేళ ఆయన గురించి..

image

* అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న MPలోని మోవ్‌లో జన్మించారు.
* విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన తొలి ఇండియన్
* స్వాతంత్ర్యం తర్వాత మన దేశానికి తొలి న్యాయ మంత్రి
* రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా సేవలు
* 64 సబ్జెక్టుల్లో మాస్టర్, ఆ తరంలో అత్యంత విద్యావంతులు
* అణగారిన వర్గాలకు విద్య, అంటరాని వారికి సమాన హక్కుల కోసం పోరాటాలు
* 1956 DEC 6న ఢిల్లీలో కన్నుమూశారు.

News April 14, 2025

రుతురాజ్ ప్లేస్‌లో ఎవరికో చోటు?

image

సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బాధపడుతూ ఐపీఎల్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం భావిస్తోంది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రేలపై ఫ్రాంచైజీ దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. మరి వీరిలో ఎవరు సీఎస్కేకు అవసరమో కామెంట్ చేయండి.

News April 14, 2025

‘డబ్బులు ఊరికే రావు’ అని చిన్నప్పటి నుంచే చెప్పండి..

image

పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే డబ్బు పాఠాలు నేర్పాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అడిగినంత డబ్బులిస్తే ఆర్థిక క్రమశిక్షణ కొరవడుతుంది. పిల్లలు అవసరానికే కొంటున్నారా? ఆకర్షణకు లోనై ఖర్చు చేస్తున్నారా? అనే విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఖర్చు, పొదుపు మధ్య తేడాను వివరించాలి. పొదుపుతో కలిగే లాభాలు చెబితే ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఉన్నంతలో ఎలా జీవించాలో నేర్పిస్తే భవిష్యత్తు బాగుంటుంది.

News April 14, 2025

ICC మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి గంగూలీ

image

టీమ్‌ఇండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ మరోసారి ICC మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైనట్లు ICC వెల్లడించింది. ఈ కమిటీలో VVS లక్ష్మణ్ తిరిగి ప్యానెల్ మెంబర్‌గా చేరారు. వీరితో పాటు హమీద్ హసన్(AFG), డెస్మండ్ హేన్స్(WI), టెంబా బావుమా(SA), జోనాథన్ ట్రాట్‌(ENG) కమిటీలో ఉన్నారు. గంగూలీ మూడేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు. దాదా తొలిసారి 2021లో క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియామకమైన విషయం తెలిసిందే.

News April 14, 2025

సమ్మర్‌లో కీరదోసతో ఎన్నో లాభాలు!

image

* కీరదోసలోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు.
* అంతర్గత వాపు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
* పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది.
* నోటి దుర్వాసన తగ్గడంతో పాటు శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.
* బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస మంచి ఆయుధం.
* కీరలోని డైయూరిటిక్‌ గుణాలు మూత్రం ద్వారా టాక్సిన్స్‌ బయటకు పంపుతాయి.

News April 14, 2025

ఎలక్ట్రానిక్ వస్తువులపై US కొత్త టారిఫ్‌లు?

image

US అధ్యక్షుడు ట్రంప్ ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇచ్చిన టారిఫ్‌ల మినహాయింపు కొద్ది రోజులే అని తెలుస్తోంది. త్వరలోనే వాటితో పాటు ఔషధాలపైనా టారిఫ్ బాంబ్ పేల్చనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు తదితర వస్తువులు ప్రత్యేక సుంకాల పరిధిలోకి వస్తాయని ఆ దేశ వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ వెల్లడించినట్లు తెలిపింది. 2 నెలల్లో కొత్త సుంకాలు విధించనున్నట్లు వివరించింది.

News April 14, 2025

ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా ఆర్సీబీ!

image

IPL 2025లో RCB తన ప్రత్యర్థులను సొంత మైదానాల్లోనే ఓడించి వారి పాలిట సింహస్వప్నంలా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈడెన్‌లో KKR, చెపాక్‌లో CSK, వాంఖడేలో MI, జైపూర్‌లో RRను మట్టికరిపించింది. అన్ని విభాగాల్లో రాణిస్తూ తమకు ఎదురే లేకుండా నిలుస్తోంది. కానీ తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీ ఇంకా ఖాతా తెరవకపోవడం విశేషం. అక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.

News April 14, 2025

ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

image

1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి
1892: తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు జయంతి
1939: సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జయంతి
1950: భారత్ తత్వవేత్త శ్రీ రమణ మహర్షి వర్ధంతి
1963: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వర్ధంతి
2011: సినీ నటుడు, ప్రతినాయకుడు రామిరెడ్డి వర్ధంతి

News April 14, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 14, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 14, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.32 గంటలకు
ఇష: రాత్రి 7.46 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.