news

News March 21, 2025

నేడే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల

image

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. CPS, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని CM అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరింది.

News March 21, 2025

కష్ట సమయాల్లో అండగా కోహ్లీ: సిరాజ్

image

ఆర్సీబీని వీడటం బాధగా ఉందని పేస్ బౌలర్ సిరాజ్ అన్నారు. తన కెరీర్‌లో విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. 2018-19లో క్లిష్ట పరిస్థితుల్లోనూ తన వెన్నంటి ఉన్నారన్నారు. ఆ తర్వాత తాను తిరిగి సత్తా చాటినట్లు తెలిపారు. గత ఏడాది వేలంలో సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఆర్సీబీ తరఫున 87 మ్యాచుల్లో 83 వికెట్లు తీశారు. ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ సిరాజ్.

News March 21, 2025

అక్రమ వలసదారుల కోసం ట్రంప్ కొత్త యాప్

image

అక్రమ వలసదారుల కోసం CBP హోమ్ యాప్ తీసుకొచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ యాప్‌ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశానికి వెళ్లవచ్చని తెలిపారు. అలా వెళ్లడం ద్వారా తరువాతి కాలంలో లీగల్‌గా అమెరికాకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా అక్రమంగా ఉండి ప్రభుత్వానికి పట్టుబడితే వారిని అమెరికా నుంచి బహిష్కరించడంతో పాటు దేశంలోకి మరోసారి ప్రవేశముండదని ట్రంప్ హెచ్చరించారు.

News March 21, 2025

EPFO నూతన ఉద్యోగుల వివరాలు తెలిపిన కార్మిక శాఖ

image

ఈ ఏడాది జనవరిలో ఈపీఎఫ్‌ఓలో నికరంగా 17.89లక్షల మంది నూతన చందాదారులు చేరినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 11.47శాతం అధికమని తెలిపింది. కొత్తగా చేరిన వారిలో18-25 ఏళ్లవారు దాదాపు 4.7 లక్షలమంది ఉన్నారు. జనవరిలో కొత్తగా చేరిన మహిళా సభ్యులు 2.17 లక్షల మంది ఉండగా గతేడాదితో పోలిస్తే 6.10 శాతం పెరిగారు.

News March 21, 2025

శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు ఫ్యామిలీ

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా ఇవాళ అన్నప్రసాద వితరణ చేయనున్నారు. మంత్రి లోకేశ్‌తో సహా కుటుంబసభ్యులంతా నిన్న రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. అన్నప్రసాదాలు తీసుకోవడంతో పాటు భక్తులకు వడ్డించనున్నారు.

News March 21, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

image

TG: నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,403 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. ALL THE BEST.

News March 21, 2025

అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు: మంత్రి

image

TG: రాష్ట్రంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ప్రారంభించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనుండగా 31న హైటెక్స్‌లో ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. మెుత్తంగా 21 ప్రదేశాల్లో 23థీమ్‌లతో ఈవెంట్ నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నారు. మే7నుంచి31వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

News March 21, 2025

డీలిమిటేషన్ సదస్సుకు హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు

image

ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటేషన్‌ సదస్సుకు కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. డీఎంకే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పాల్గొననున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News March 21, 2025

ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్

image

ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నాగ్‌పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు. ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన వారిని పొగిడితే ఒప్పుకోమని అన్నారు. మన దేశంపై దాడి చేసిన వారిని కీర్తించడం సరికాదని హితవు పలికారు.

News March 21, 2025

ఉల్లిపాయ తింటే కలిగే ప్రయోజనాలివే..!

image

ఉల్లిపాయ తినటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. తద్వార వడదెబ్బ తాకే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇందులో ఉండే అధిక నీటిశాతం, ఖనిజాల వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక శాతం ఫైబర్ ఉంటుంది తద్వార జీర్ణశక్తి పెరుగుతుంది. సల్ఫర్, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తాయి. ఇవి తినటం వల్ల చర్మం, జుట్టుకు సైతం ఎంతో మేలు.