news

News March 21, 2025

TODAY HEADLINES

image

* SCలను ఆదుకుంది TDPనే: చంద్రబాబు
* తిరుమల దర్శనాలపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
* మోదీలాగే బాబూ వరుసగా సీఎం కావాలి: పవన్
* వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా: KTR
* త్వరలో 10,762 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: అనిత
* ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోల మృతి
* భారత క్రికెటర్ చాహల్-ధనశ్రీకి విడాకులు మంజూరు
* బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. రానా, విజయ్‌పై కేసు
* లండన్‌లో పురస్కారం అందుకున్న చిరంజీవి

News March 21, 2025

ఎంఎస్ ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇవే

image

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ IPL తొలి సీజన్ నుంచి ఆడుతున్నారు. ఇప్పటికీ తన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 43 ఏళ్ల వయసులో IPL 2025లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇలా ఉన్నాయి. 2008-414, 2009-332, 2010-287, 2011-392, 2012-358, 2013-461, 2014-371, 2015-372, 2016-284, 2017-290, 2018-455, 2019-416, 2020-200, 2021-114, 2022-232, 2023-104, 2024లో 161 రన్స్ చేశారు.

News March 21, 2025

‘కోర్టు’ నటుడితో దిల్ రాజు మూవీ?

image

‘కోర్టు: స్టేట్vsనోబడీ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు హర్ష్ రోషన్‌తో దిల్ రాజు సినిమా తీయనున్నట్లు సమాచారం. దీనికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రమేశ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తారని టాలీవుడ్ టాక్. ఇందులో శివాజీ కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన కోర్టు మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

News March 20, 2025

ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగిస్తున్నారా?

image

ఏప్రిల్ 1 నుంచి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది. ఈ రూల్స్ ప్రకారం డియాక్టివేట్, సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను ఈ నెల 31లోగా తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది. ఆ తర్వాత ఈ నంబర్లను ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు పొందలేరని తెలిపింది. అప్డేట్ చేసిన మొబైల్ నంబర్‌ సిస్టమ్‌ను ఉపయోగించి ట్రాన్సాక్షన్ల సంఖ్యను పేర్కొనాలని సూచించింది.

News March 20, 2025

మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్.. స్పందించిన ఎన్వీఎస్ రెడ్డి

image

TG: మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ విషయం తన దృష్టికి వచ్చిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా సంబంధిత యాడ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు అనైతికమని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాడ్స్‌ను మెట్రోలో నిషేధిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

News March 20, 2025

ఆర్సీబీ వదిలేశాక భావోద్వేగానికి లోనయ్యాను: సిరాజ్

image

ఆర్సీబీ నుంచి వేరయ్యాక తాను భావోద్వేగానికి లోనయ్యానని పేసర్ సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా కెరీర్ ఈరోజు ఇలా ఉండటం వెనుక విరాట్ కీలక పాత్ర పోషించారు. 2018-19 మధ్యకాలంలో నేను కష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో చాలా మద్దతునిచ్చారు. ఆ తర్వాతే నా ప్రదర్శన మెరుగై నా కెరీర్ గ్రాఫ్ మారింది. వచ్చే నెల 2న RCBతో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. వేలంలో ఆయన్ను గుజరాత్ దక్కించుకుంది.

News March 20, 2025

భారత్‌కు సొంతంగా బ్రౌజర్!

image

భారత పౌరుల డేటా భద్రత, గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘సేవల నుంచి ఉత్పత్తుల వైపు మళ్లేందుకు భారత్‌కు ఇదో సదవకాశం. బ్రౌజర్‌కోసం పోటీలు నిర్వహిస్తే విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకే బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు.

News March 20, 2025

రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా 2,650 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌‌లు తీసుకెళ్లకూడదు.
* ALL THE BEST

News March 20, 2025

రేపు 49 మండలాల్లో వడగాలులు

image

AP: రేపు రాష్ట్రంలోని 49 మండలాల్లో <>వడగాలులు వీస్తాయని<<>> APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం-12, విజయనగరం-16, మన్యం-13, అల్లూరి-1, కాకినాడ-2, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

News March 20, 2025

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్.. చివరికి!

image

కడుపునొప్పి తాళలేక ఓ వ్యక్తి యూట్యూబ్ సాయంతో ఆపరేషన్‌కు ప్రయత్నించి ఆస్పత్రి పాలయ్యాడు. UP మధురలో ఈ ఘటన జరిగింది. అనేక మంది వైద్యులను సంప్రదించినా రాజబాబు(32)కు కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించలేదు. దీంతో మత్తు ఇంజెక్షన్, ఇతర సామగ్రి కొని ఆపరేషన్ మొదలుపెట్టాడు. మత్తు ప్రభావం తగ్గడంతో నొప్పి ఎక్కువై అరుస్తూ బయటికి పరిగెత్తగా, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.