news

News March 20, 2025

నా టెంపర్‌మెంట్ ఏం మారలేదు: సీఎం రేవంత్

image

TG: తాను ముఖ్యమంత్రి అయినా 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి టెంపర్‌మెంట్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘2004లో ప్రజల్లోకి వచ్చాను. నేటికీ టెంపర్‌మెంట్‌లో ఛేంజ్ లేదు. సీఎంగా హుందాగా వ్యవహరించాలని కొంతమంది అంటుంటారు కానీ అలా వ్యవహరిస్తే అటువైపు అర్థం చేసుకునేవారు ఉండాలి కదా? టెంపర్‌మెంట్ పోతే న్యాయం చేయలేం. నా దూకుడు పోలేదు కానీ జ్ఞానం పెరిగింది’ అని తెలిపారు.

News March 20, 2025

ఆర్మీలోకి రూ.7వేల కోట్ల విలువైన ATAGS.. కేంద్రం ఆమోదం

image

భారత ఆర్మీ మరింత శక్తిమంతం కానుంది. రూ.7వేల కోట్ల విలువైన అత్యాధునిక టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ATAGS) కొనుగోలుకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తయారుచేయనున్న 307 ATAGSను భారత్ ఫోర్జ్, TASL సంస్థల నుంచి సైన్యం కొనుగోలు చేయనుంది. వీటికి 48 కి.మీ పరిధి ఉంటుంది. ట్రక్కులపై తరలించే మౌంటెడ్ గన్ సిస్టమ్స్‌ తరహాలో వీటిని తయారుచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News March 20, 2025

మేం ఆదేశిస్తే పోలీసులు కేటీఆర్‌ను వంగబెట్టి దంచరా?: సీఎం రేవంత్

image

TG: తనకు పరిపాలనపై పట్టు రాలేదని BRS చేస్తున్న విమర్శలపై CM రేవంత్ మండిపడ్డారు. ‘వ్యవస్థ అంతా గత ప్రభుత్వం నాటిదే ఉంది కదా. ఆనాడు కోదండరామ్ తలుపులు బద్దలుకొట్టిన అదే పోలీసులు ఈరోజు నేను ఆదేశిస్తే KTR తలుపులు పగులకొట్టి వంగబెట్టి దంచరా? కానీ నేను అలాంటి విధానానికి వ్యతిరేకం. సచివాలయానికే రాని మీకు పట్టు ఉందా? రోజుకు 18 గంటలపాటు పనిచేస్తున్న నాకు, మా సీతక్కకు పరిపాలనపై పట్టు లేదా?’ అని ప్రశ్నించారు.

News March 20, 2025

ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు ఎందుకు? : కామెంటేటర్

image

ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడంతో పాటు అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంపై క్రికెట్ కామెంటేటర్ వెంకటేశ్ ప్రశ్నించారు. ‘హైదరాబాద్ క్రికెట్‌కు రాజీవ్ గాంధీకి ఏమిటి సంబంధం? HYD క్రికెట్‌కు వన్నె తెచ్చిన అబిద్ అలీ, ML జయసింహ లాంటి వారి విగ్రహాలు పెడితే బాగుండేది’ అని డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ, నరేంద్ర మోదీ స్టేడియంలపై నెటిజన్లు ప్రశ్నించగా వాటిని కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

News March 20, 2025

భారీ ఎన్‌కౌంటర్: 30కి చేరిన మృతుల సంఖ్య

image

ఛత్తీస్‌గఢ్‌లోని అండ్రీ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు మరణించారు. ఈ పోరులో డీఆర్‌జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News March 20, 2025

మాలా ఉద్యోగాలిచ్చిన రాష్ట్రమేదైనా ఉందా?: సీఎం రేవంత్

image

TG: తమ ప్రజాపాలనలో 10 నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. ‘నేను సవాల్ చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలోకానీ, ప్రధాని మోదీ సీఎంగా పనిచేసిన గుజరాత్‌లో కానీ, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో కానీ మేం ఇచ్చినట్లుగా 10నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చినట్లు రికార్డ్ ఉందా? నేను చర్చకు సిద్ధం. విజ్ఞతతో ఉద్యోగాలిచ్చాం. ప్రజాపాలనతో దేశానికే తెలంగాణ ఓ మోడల్‌గా నిలబడింది’ అని పేర్కొన్నారు.

News March 20, 2025

వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ‘యాత్ర గురించి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించాను. ఈ ఏడాది చివరి వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉంటాను. వచ్చే ఏడాది యాత్ర ప్రారంభిస్తాను’ అని వెల్లడించారు.

News March 20, 2025

SRH ప్లే ఆఫ్స్ చేరడం కష్టం: మైకేల్ వాన్

image

ఐపీఎల్ 2025 సీజన్‌లో GT, MI, KKR కచ్చితంగా ప్లేఆఫ్స్ వెళ్తాయని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ జోస్యం చెప్పారు. నాలుగో బెర్త్ కోసం LSG, PBKS, SRH మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. గతేడాది ఫైనలిస్ట్ అయిన SRH ఈసారి ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనని ఆయన పేర్కొన్నారు. అన్ని జట్ల కంటే గుజరాత్ టైటాన్స్ జట్టు గొప్పగా ఉన్నా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలుస్తుందని అంచనా వేశారు.

News March 20, 2025

వైస్రాయ్ హోటల్లో క్యాంపులు నడిపినోళ్లే దొంగలు: చంద్రశేఖర్

image

AP: YCP సభ్యులను దొంగలుగా సంబోధించిన స్పీకర్ <<15822076>>అయ్యన్నపై<<>> ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఫైరయ్యారు. ‘ప్రజాస్వామ్యంలో దొంగలంటే వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినోళ్లు, వైస్రాయ్ హోటల్లో క్యాంపులు నడిపినోళ్లు, జయప్రదంగా పార్టీని దోచినోళ్లని స్పీకర్ తెలుసుకోవాలి. మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు’ అని ట్వీట్ చేశారు.

News March 20, 2025

కోహ్లీకి 2008లో రూ.12 లక్షలు.. ఇప్పుడు రూ.21కోట్లు

image

ఐపీఎల్ ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసింది. 2008 నుంచి బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ తొలి టోర్నీలో రూ.12 లక్షలు పొందితే ఇప్పుడు రూ.21 కోట్లు అందుకోనున్నారు. ముంబై జట్టు ప్లేయర్ రోహిత్ శర్మ రూ.3 కోట్ల నుంచి రూ.16 కోట్లకు చేరారు. ఇక 2008లో ధోనీకి ఉన్న క్రేజ్‌కు ఏకంగా రూ.6కోట్లు ఇవ్వగా ఇప్పుడు రూ.4కోట్లిస్తున్నారు. తొలి టోర్నీ నుంచి రహానే, మనీశ్, ఇషాంత్, జడేజా, అశ్విన్ కూడా ఉన్నారు.