India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మలయాళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ OTTలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతోపాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఈ నెల 14న తెలుగులో థియేటర్లలో విడుదలైంది. రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వచ్చేసింది. రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకుపైగా రాబట్టింది. ఈ చిత్రంలో కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.

తన భార్య ధనశ్రీ వర్మకు టీమ్ఇండియా బౌలర్ చాహల్ విడాకులిచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు అంగీకరించారు.. ఈ నేపథ్యంలో చాహల్ గర్ల్‌ఫ్రెండ్ RJ మహ్వాష్ ఇన్‌స్టాలో చేసిన పోస్టు వైరలవుతోంది. ‘అబద్ధాలు, దురాశ, మోసాలకు దూరంగా ఉంచిన ఆ దేవునికి ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను చాహల్ కూడా లైక్ చేయడం గమనార్హం.

IPLలో కొన్ని రూల్స్‌పై బీసీసీఐ BCCI కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో 2 బంతులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండో బంతిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను యథావిధిగా కొనసాగించనుంది.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌పై హీరో విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. ‘రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని మాత్రమే ఆయన అంబాసిడర్‌గా పనిచేసేందుకు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చట్ట అనుమతి ఉన్న గేమ్స్‌కి మాత్రమే ఆయన ప్రచారం చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎ23 సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీం కూడా పలుమార్లు చెప్పింది’ అని ఆయన టీమ్ వివరణ ఇచ్చింది.

AP: ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు ఇచ్చింది ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీలను అన్నివిధాల ఆదుకుంది టీడీపీనేనని అసెంబ్లీలో పేర్కొన్నారు.. ‘దళితులైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్, కాకి మాధవరావును సీఎస్ చేశాం. ఎస్సీల కోసం రూ.8,400 కోట్లతో పథకాలు తీసుకొచ్చాం. ఉగాది నుంచి పీ4 ప్రారంభిస్తాం. వర్గీకరణకు సహకరించిన BJPకి, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

TG: హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. 140 దేశాల అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. అలాగే రాష్ట్రానికి ఆర్థికంగానూ లబ్ధి చేకూరుతుందని చెప్పారు. స్క్విడ్ గేమ్, BTS బ్యాండ్ లాంటివి సౌత్ కొరియా అభివృద్ధికి ఉపయోగపడ్డాయని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌ను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు.

భార్య పోర్న్ చూస్తోందనో లేక స్వయంతృప్తిని పొందుతోందనో భర్త విడాకులు ఇవ్వడం కుదరదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తనతో పాటు కలిసి చూడాలంటూ భర్తను ఆమె బలవంతపెట్టనంత వరకూ అది వైవాహిక క్రూరత్వం కిందకు రాదని తేల్చిచెప్పింది. భార్య పోర్న్ చూస్తూ స్వయంతృప్తిని పొందుతోందని, ఆమె నుంచి తనకు విడాకులిప్పించాలని కోరుతూ ఓ భర్త వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

AP: రాష్ట్ర శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. మొత్తం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గత నెల 24 నుంచి నేటి వరకు సమావేశాలు కొనసాగాయి. 85 గంటల 55 నిమిషాల పాటు సభ కొనసాగింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు కూటమి సర్కార్ ఆమోదం పలికింది. అలాగే 9 బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు వార్తలు రాగా, టీజర్‌తో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ తొలివారంలోనే టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదని వెల్లడించాయి.

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలంటూ శాసనసభలో తీర్మానం చేసింది. దీనికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది.
Sorry, no posts matched your criteria.