India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

UK పార్లమెంట్ అందించిన జీవిత సాఫల్య పురస్కారంతో అన్నయ్య చిరంజీవి కీర్తి మరింత పెరిగిందని AP DyCM పవన్ పేర్కొన్నారు. ‘మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో కళామతల్లి దీవెనలతో ఆయన చిత్ర రంగంలో మెగాస్టార్‌గా ఎదిగారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తున్నా. నేను ఆయనను అన్నయ్యగా కాకుండా తండ్రి సమానుడిగా భావిస్తా. నాకు మార్గం చూపిన వ్యక్తి ఆయన’ అని ట్వీట్ చేశారు.

TG: సూర్యాపేట (D) హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్‌నగర్‌కు చెందిన రోజా తన స్నేహితురాలి(26)ని ఇంటికి పిలిచింది. ఆపై మద్యం తాగించి మత్తులోకి వెళ్లాక రోజా ప్రియుడు ప్రమోద్ ఆ యువతిపై అత్యాచారం చేయగా ఆమె వీడియో తీసింది. బుధవారం మరోసారి ఆ యువతికి ఫోన్ చేసి పిలిపించారు. ఈ సారి తన ఫ్రెండ్ హరీశ్ కోరిక తీర్చాలని ప్రమోద్ కోరగా ఆమె నిరాకరించి పోలీసులను ఆశ్రయించారు.

‘కోర్టు’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.36.85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల తీర్పుతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు.

AP: కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు సమస్య తీవ్రం కావడానికి రాజకీయాలే కారణమని పేర్కొంది. నాటి వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు పేరుతో చెరువు గట్లను పేల్చేసిందని దుయ్యబట్టింది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం తమదని తెలిపింది.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,388 మంది దర్శించుకోగా.. 26,145 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 22, 23న రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో AI చాట్‌బాట్ (గ్రోక్) సృష్టిస్తున్న వివాదాస్పద ప్రతిస్పందనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల గ్రోక్ హిందీలో అభ్యంతకర రీతిలో బూతు రిప్లైలు ఇచ్చింది. దీంతో గ్రోక్ హిందీ యాస దుర్వినియోగంపై కేంద్రం స్పందించింది. గ్రోక్ ఉత్పత్తి చేసిన ఆన్సర్లు, చాట్‌బాట్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిన డేటాకు సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ నుంచి వివరణ కోరింది.

APలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని అమలు చేయవద్దని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. తెలంగాణలో ఈ స్కీమ్ వల్ల వస్తోన్న ఇబ్బందులను చూస్తున్నామని, ఉచిత పథకాలను ప్రోత్సహించవద్దని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేవలం జిల్లా పరిధిలోనే ఫ్రీ బస్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. బస్సుల సంఖ్యనూ పెంచుతోంది. దీనిపై మీ కామెంట్?

IPL: ఆదివారం CSKతో జరిగే తొలి మ్యాచులో ముంబై ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగనుంది. బుమ్రా గాయం ఇంకా తగ్గలేదని, కోలుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని కోచ్ జయవర్ధనే క్లారిటీ ఇచ్చారు. నిషేధం కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్య సైతం ఫస్ట్ మ్యాచుకు దూరమయ్యారు. అతడి స్థానంలో సూర్య కెప్టెన్సీ చేయనున్నారు. గత కొన్ని సీజన్లుగా ఫస్ట్ మ్యాచ్ ఓడుతూ వస్తోన్న MI.. ఈ స్టార్లు లేకుండా ఎలా ఆడుతుందో మరి!

TG: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ.5వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లు ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.