news

News March 20, 2025

అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు

image

AP: GMO సిఫార్సులతో అమరావతిలో పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.
* బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్‌కు 70 ఎకరాలు
* IT టవర్ నిర్మాణానికి L&Tకి 10 ఎకరాలు
* ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు 25 ఎకరాలు
* హడ్కో హ్యాబిటేట్ సెంటర్‌కు 8 ఎకరాలు
* ఆస్పత్రి, మెడి‌కల్ కాలేజీ నిర్మాణం కోసం భూకేటాయింపు
* బడ్జెట్ హోటల్‌కు స్థలం కేటాయించాలని IRCTC ప్రతిపాదన

News March 20, 2025

రూ.61 లక్షల వెహికల్ అలవెన్స్.. స్మితకు నోటీసులు?

image

IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ వెహికల్ అలవెన్స్ కోసం వర్సిటీ నుంచి నెలకు రూ.63వేలు తీసుకోవడంపై జయశంకర్ వర్సిటీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎంవో అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మితా 2016-24 వరకు రూ.61 లక్షలు అద్దె కింద తీసుకున్నట్లు తాజాగా ఆడిట్‌లో తేలింది. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె నుంచి డబ్బులు తిరిగి రాబట్టేందుకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

News March 20, 2025

ఇవాళ్టి AP న్యూస్ రౌండప్

image

* నేటితో ముగియనున్న MLA, MLCల క్రీడాపోటీలు
* అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు ఈ-లాటరీ
* విశాఖలో నిరసనలకు వైసీపీ పిలుపు
* అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగింపు
* వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై తుది విచారణ
* తిరుపతి తొక్కిసలాట ఘటన.. CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్

News March 20, 2025

నేడు విచారణకు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు?

image

TG: బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసి కేసులు ఎదుర్కొంటున్న పలువురు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మెుత్తం 17మందిపై కేసు నమోదు కాగా, నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు పోలీసులు నోటీసులిచ్చారు. వీరి ప్రమోషన్లతో అమాయక ప్రజలు బెట్టింగ్ భూతానికి బలి అవుతున్నారని సజ్జనార్ ఫిర్యాదు చేయడంతో వీరిపై కేసు నమోదు చేశారు.

News March 20, 2025

HCA మాజీ కోశాధికారి ఆస్తి సీజ్

image

TG: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తులో ఈడీ పట్టు బిగించింది. HCA మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ చేసిన అవినీతిపై ఆధారాలతో ED రూ.90.86 లక్షల అక్రమ సొమ్మును సీజ్ చేసింది. అజహరుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన పనుల్లో క్విడ్ ప్రోకో కింద అపెక్స్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సురేందర్ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలింది.

News March 20, 2025

ఆర్ఆర్‌బీ లోకో పైలట్ పరీక్ష వాయిదా

image

RRB అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ-2 పరీక్షను రైల్వే శాఖ వాయిదా వేసింది. నిన్న షిఫ్ట్ 1, 2లో జరగాల్సిన పరీక్షల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఏ సెంటర్లనోనైతే ఎగ్జామ్ జరగలేదో వారికి త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అప్డేట్స్ కోసం తరచూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. కాగా 18,799 పోస్టులకు గతేడాది సీబీటీ-1 నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు.

News March 20, 2025

ఆ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు

image

దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC)లో పని చేసే ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాదిలో 9.8% మేర పెరగనున్నట్లు ఓ నివేదిక అంచనా వేసింది. ఉద్యోగుల వేతనాల వృద్ధిలో GCCలు IT కంపెనీలను మించిపోయాయంది. 2030 నాటికి వీటి మార్కెట్ విలువ 11,000కోట్ల డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నైపుణ్యాలున్న ఉద్యోగులకు వేతనాలు గణనీయంగా పెరుగుతాయంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై GCCలు అధిక జీతాలు చెల్లిస్తున్నాయి.

News March 20, 2025

జనాభా కంటే ఫోన్లే ఎక్కువ

image

తెలంగాణ జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో టూ వీలర్‌ల వాటా 73.52%. మిగతా కేటగిరీలో కార్లు, ఆటోలు, బస్సులు, మధ్య స్థాయి, భారీ రవాణా వాహనాలున్నాయి.

News March 20, 2025

2 రోజులు సెలవులు, 2 రోజులు ఆప్షనల్ హాలిడేస్

image

TG: హజ్రత్ అలి షహాదత్‌ను గుర్తు చేసుకుంటూ ఈ నెల 21న ఆప్షనల్ హాలిడే ఇచ్చిన ప్రభుత్వం అందులో మార్పు చేసింది. రంజాన్ నెల చంద్రవంక కనిపించడం ఆలస్యం కావడంతో మార్చి 22న ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. ఈ నెల 28న కూడా జుమతుల్ విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది. దీంతో స్కూళ్లు, కాలేజీలు ముఖ్యంగా మైనారిటీ సంస్థలు సెలవు ఇవ్వొచ్చు. ఇక తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31, ఏప్రిల్ 1న రంజాన్ సెలవులు ఉన్నాయి.

News March 20, 2025

నేడు వారికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు

image

TG: స్థానిక సంస్థల్లో కారుణ్య ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాల వారసులకు CM రేవంత్ నేడు నియామక పత్రాలను అందజేయనున్నారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో 582 మంది ఈ పత్రాలను అందుకోనున్నారు. జెడ్పీ, మండల పరిషత్తుల్లో ఉన్న 524 ఆఫీసు సబార్డినేట్, నైట్ వాచ్‌మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేశారు. దీంతో పాటు 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించారు.